...
...
Next Story

తెలంగాణ తెచ్చుకున్నట్టుగానే బీసీ రిజర్వేషన్లు సాధించుకుందాం : కేటీఆర్

బీసీల విషయంలో కాంగ్రెస్ పార్టీది చిత్తశుద్ధి లేని శివపూజలాంటిదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పార్లమెంటులో చేయాల్సిన పనిని ఇక్కడ చేసి.. వేరే వాళ్ల మీద నెపాన్ని నెడుతున్నారని విమర్శించారు.

Published on: Oct 15, 2025, 19:12:52 IST
Advertisement

బంద్ ఫర్ జస్టిస్ పేరుతో ఈనెల 18వ తేదీన తలపెట్టిన రాష్ట్ర బంద్‌కు మద్దతు ఇవ్వాలని కోరుతూ.. తెలంగాణ భ‌వ‌న్‌లో బీసీ జేఏసీ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య, కమిటీ ప్రతినిధులు కేటీఆర్‌ను కలిశారు. బీసీ ఐకాస ధ‌ర్నాకు బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఉంటుందని కేటీఆర్ స్పష్టం చేశారు.

కేటీఆర్‌ను కలిసిన ఆర్.కృష్ణయ్య
కేటీఆర్‌ను కలిసిన ఆర్.కృష్ణయ్య

బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీది చిత్తశుద్ధి లేని శివపూజ లాంటిదని కేటీఆర్ విమర్శించారు. పార్లమెంటులో చేయాల్సిన పనిని ఇక్కడ చేసి.. వేరే వాళ్ల మీదకు నెడుతున్నారని పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్ల మీద తమ పార్టీ విధానం చాలా స్పష్టంగా ఉందన్నారు. గతంలో శాసనసభలో రెండుసార్లు రిజర్వేషన్ల కోసం తీర్మానం చేసి పంపించామని, కానీ కాంగ్రెస్ పార్టీలాగా ప్రచారం చేసుకోలేదన్నారు. కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా రిజర్వేషన్లు పెడతామని శాసనసభలో చెప్పినప్పుడు మేం మద్దతు ఇచ్చామన్నారు.

బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీ పద్ధతి సరైనది కాదని కేటీఆర్ అన్నారు. బీసీ రిజర్వేషన్ల మీద కాంగ్రెస్ పార్టీ ఐదు రకాలుగా మాట్లాడుతుందన్నారు. రాజ్యాంగ సవరణ ద్వారా, పార్టీ తరఫున రిజర్వేషన్లు ఇస్తాం అని, ఆర్డినెన్స్, బిల్లు, మరోసారి రాహుల్ గాంధీ ప్రధాని అయ్యాక అని కాంగ్రెస్ మాట్లాడుతుందని విమర్శించారు. రకరకాలుగా మాటలు మార్చిన కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిపై తాము తప్పకుండా ప్రశ్నిస్తామని స్పష్టం చేశారు.

'బీసీ రిజర్వేషన్లకు మా పార్టీ సంపూర్ణంగా మద్దతు ఇస్తుంది. ఈ విషయంలో బీసీ సంఘాల ప్రయత్నాలకు మా పార్టీ సపోర్ట్ ఉంటుంది. బీసీ రిజర్వేషన్లు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రావు. కాంగ్రెస్ తెచ్చిన 42 శాతం రిజర్వేషన్ కేవలం స్థానిక సంస్థల కోసం. కానీ విద్య, ఉపాధికి సంబంధించిన రిజర్వేషన్ల వాటా మిగిలిన అన్ని రంగాల్లో రావాల్సి ఉంది. అన్నింటిలో వాటా రావాలి అని బీసీ సమాజం డిమాండ్ చేయాలి.' అని కేటీఆర్ అన్నారు.

బీసీ రిజర్వేషన్ల కోసం బలమైన ఉద్యమాన్ని నిర్మిస్తామని ఆర్.కృష్ణయ్య అన్నారు. ప్రజా ఉద్యమాలు బలంగా ఉంటనే ప్రభుత్వాలు స్పందిస్తాయన్నారు. అన్నాదమ్ముల నడుమ వాటాలు ఎప్పటికైనా పంచాల్సిందేనని స్పష్టం చేశారు. బీసీలకు రిజర్వేషన్లు పెంచడం ఎప్పటికైనా తప్పదు అన్నారు. బీసీ రిజర్వేషన్ల కోసం అన్ని పార్టీలు సహకరించాలన్నారు కృష్ణయ్య.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe