ఫోన్ ట్యాపింగ్ కేసులో తనకు నోటీసు అందిందన్న వార్తలపై మాజీ మంత్రి హరీశ్ రావు స్పందంచారు. తెలంగాణలో జరుగుతున్న విచారణలు, అరెస్టులను తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రంలో సిట్‌లు ప్రహసనంగా మారాయని అభివర్ణించారు. ప్రతిపక్ష నాయకులైన తమపై కేసులు కొత్త కాదని హరీష్ రావు పేర్కొన్నారు. కొంతమంది అధికారులు అనుకూలమైన పోస్టింగ్‌ల కోసం దూకుడుగా చట్టవిరుద్ధమైన కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర మంచి పేరు కోసం ప్రయత్నిస్తున్న అధికారులకు ఆయన తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కోసం అతిచేస్తే అధికారులు మూల్యం చెల్లించుకోక తప్పదు అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ మార్పులను ఒక ఉదాహరణగా పేర్కొన్నారు. రాజకీయ కక్షతో ఇబ్బందిపెడితే.. మూల్యం చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఒక రాజకీయ వర్గానికి చెందిన నాయకులను ఇబ్బంది పెడితే.. మీరు కూడా అదే విధిని ఎదుర్కొంటారని చెప్పారు.
మరోవైపు కేసీఆర్ ప్రెస్‌మీట్ గురించి హరీశ్ రావు మాట్లాడారు. రేవంత్ సర్కార్ డిఫెన్స్‌లో పడిందన్నారు. తాను 25 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని చెప్పారు. రాత్రి 9.30 గంటలకు ముఖ్యమంత్రి చిట్‌చాట్ పెట్టడం చూడలేదని వ్యాఖ్యానించారు. అందాల పోటీలు, ఫుట్‌బాల్ షోకులు, గ్లోబల్ సమ్మిట్‌లు అన్నం పెడతాయా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్‌కు వాస్తు భయం పట్టుకుందన్నారు. అందుకోసమే.. సచివాలయానికి పోవడం లేదని ఎద్దేవా చేశారు.
'బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాలుగు వేల మంది సర్పంచ్‌లుగా గెలిచారు. బీఆర్ఎస్ దెబ్బకు డీసీసీబీలకు ఎన్నికలు పెట్టడం లేదు. కాంగ్రెస్ కార్యకర్తలను నామినేట్ చేయాలని చూస్తున్నారు. రేవంత్ రెడ్డి పోలీసులు లేకుండా ఓయూకు వస్తానని చెప్పారు. కానీ పోలీస్ పహారా మధ్య వచ్చారు. ఇరిగేషన్ మీద పీపీటీని స్వాగతిస్తున్నాం, పీపీటీపై అసెంబ్లీలో మాకు సరిపడా అవకాశం ఇవ్వాలి.' అని హరీశ్ రావు అన్నారు.
అసెంబ్లీలో తమ గొంతు నొక్కడం, మైక్ కట్ చేయడంలాంటివి చేయవద్దని హరీశ్ రావు సూచించారు. ఎవరి వాదన నిజం అనేది ప్రజలు చూస్తారని చెప్పారు. సీపీఐ, ఎంఐఎం, బీజేపీ కంటే తక్కువ సమయం బీఆర్ఎస్కు ఇస్తున్నారన్నారు. బీఆర్ఎస్కు ప్రభుత్వం భయపడుతుందన్నారు. అవకాశం ఇస్తే అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వ బట్టలు విప్పుతామన్నారు.
{{/usCountry}}అసెంబ్లీలో తమ గొంతు నొక్కడం, మైక్ కట్ చేయడంలాంటివి చేయవద్దని హరీశ్ రావు సూచించారు. ఎవరి వాదన నిజం అనేది ప్రజలు చూస్తారని చెప్పారు. సీపీఐ, ఎంఐఎం, బీజేపీ కంటే తక్కువ సమయం బీఆర్ఎస్కు ఇస్తున్నారన్నారు. బీఆర్ఎస్కు ప్రభుత్వం భయపడుతుందన్నారు. అవకాశం ఇస్తే అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వ బట్టలు విప్పుతామన్నారు.
{{/usCountry}}