బీఆర్ఎస్ సర్పంచ్‌లకు నిధులివ్వకుంటే తాటతీస్తాం - కేటీఆర్ వార్నింగ్
కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై కేటీఆర్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్పంచులకు నిధులు ఎమ్మెల్యేల దయాదాక్షిణ్యాలు కాదని.. రాజ్యాంగం కల్పించిన హక్కు అని గుర్తు చేశారు. బీఆర్ఎస్ సర్పంచ్‌లకు నిధులివ్వకుంటే తాటతీస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
పంచాయతీ నిధులు సర్పంచ్‌ల హక్కు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ సర్పంచ్‌లకు నిధులివ్వకుంటే తాటతీస్తామని హెచ్చరించారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో ఖానాపూర్, షాద్‌నగర్ నియోజకవర్గ నూతన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లకు సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ… పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలను ఖండించారు.

కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై కేటీఆర్ ఫైర్
కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అధికార మదం తలకెక్కిందని… ప్రజలను మరియు ప్రజాప్రతినిధులను చంపేస్తామంటూ బరితెగించి మాట్లాడుతున్నారని కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
“కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. ఒక ఎమ్మెల్యే అయితే ‘నన్ను ఓడించి చంపేస్తే.. నేను మిమ్మల్ని గెలిచి చంపేస్తా’ అని బహిరంగంగా బెదిరింపులకు దిగుతున్నారు. ఎమ్మెల్యేల ప్రవర్తన చూసి కాంగ్రెస్ కార్యకర్తలు కూడా గ్రామాల్లో అరాచకాలు చేస్తున్నారు. సర్పంచులు ఎవరూ ఇలాంటి బెదిరింపులకు లొంగవద్దు. ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వకపోవడానికి ఈ ఎమ్మెల్యేలు ఎవరు? అవి మీ అబ్బ సొత్తు కాదు.. మీ అత్త సొత్తు కాదు. రేవంత్ రెడ్డి ఏమైనా తన భూములు అమ్మి గ్రామాలకు నిధులిస్తున్నారా” అని కేటీఆర్ ప్రశ్నించారు.
"ప్రజల పైసలతో కడుతున్న ఇళ్లకు అర్హులను ఎంపిక చేసే పూర్తి అధికారం గ్రామ సభలకు, సర్పంచులకే ఉంటుంది. ఎవడైనా అడ్డుతగిలితే తాట తీసి లైన్‌లో పెట్టండి" అని కార్యకర్తలకు కేటీఆర్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ఏంఏల్యేలకే నిధులు దిక్కులేఖ ప్రపంచబ్యాంకుకు ఉత్తరాలు రాస్తున్నారని… అలాంటి సర్పంచ్‌లకు ఏం ఇస్తారని కేటీఆర్ ఏద్దేవా చేశారు.
కాంగ్రెస్ నేతలు తమ ఇండ్లు భూములు అమ్మి నిధులివ్వడంలేదని, ప్రజల సొమ్ములకు దర్మకర్తలు మాత్రమే అని గుర్తుంచుకోవాలని కేటీఆర్ హెచ్చరించారు.గ్రామ పంచాయతీలకు వచ్చే నిధులు ఎవరి భిక్ష కాదని స్పష్టం చేశారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం ఐదు అంచెల పాలనలో గ్రామ పంచాయతీలకు స్వయం ప్రతిపత్తి ఉందని గుర్తు చేశారు.
"కేంద్ర ఫైనాన్స్ కమిషన్ నుంచి రావాల్సిన రూ. 3,500 కోట్ల నిధుల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేసి, రిజర్వేషన్లను 24% నుంచి 17%కి తగ్గించి హడావుడిగా ఎన్నికలు జరిపింది. ఫైనాన్స్ కమిషన్ నిధుల్లో 70 శాతం నేరుగా గ్రామ పంచాయతీలకే రావాలి. ఆ నిధులను ఆపే హక్కు ఏ ముఖ్యమంత్రికి గానీ, ఎమ్మెల్యేకు గానీ లేదు. మీ హక్కుల కోసం కొట్లాడండి, బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుంది" అని కేటీఆర్ హామీ ఇచ్చారు.
లీగల్ సెల్ ఏర్పాటు చేస్తాం - కేటీఆర్
జిల్లాకోక ప్రత్యేక లిగల్ సెల్ ఏర్పాటుతో పాటు… స్ధానిక ప్రజాప్రతినిధులకు ప్రత్యేక శిక్షణా శిభిరాలు ఏర్పాటు చేస్తామని కేటీఆర్ చెప్పారు. కేసీఆర్ పాలనలో పల్లెలు పచ్చగా ఉండేవని, ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో అనాథలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.
"కేసీఆర్ హయాంలో ప్రతి గ్రామానికి ట్రాక్టర్, ట్యాంకర్, నర్సరీ, వైకుంఠధామం వచ్చాయి. తెలంగాణ పల్లెలు దేశానికే ఆదర్శంగా నిలిచి 30 శాతం జాతీయ అవార్డులు గెలుచుకున్నాయి. కానీ నేడు పరిస్థితి దారుణం. ట్రాక్టర్లకు డీజిల్ పోయించే దిక్కు లేదు. రైతులు యూరియా కోసం లైన్లలో నిలబడి బాదలుపడుతున్నారని, ఆ చెప్పుల లైన్లు కనపడితే ప్రభుత్వం పరువు పోతుందని ముఖ్యమంత్రి తెలివిగా ‘యూరియా యాప్’ అనే కొత్త స్కీమ్ తెచ్చారు. షాపులో దొరకని యూరియా యాప్‌లో దొరుకుతుందా?" అనికేటీఆర్ ఎద్దేవా చేశారు.
సర్పంచ్ ఎన్నికల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి… స్వయంగా జిల్లాలు తిరుగుతూ ప్రచారం చేయడం చరిత్రలో ఎన్నడూ లేదని కేటీఆర్ విమర్శించారు. ఎన్టీఆర్, వైఎస్ఆర్, కేసీఆర్ వంటి నాయకులు ఏనాడూ సర్పంచ్ ఎన్నికల కోసం రోడ్ల మీద పడలేదన్నారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

