నీటి హక్కుల కోసం BRS పోరుబాట - రంగంలోకి కేసీఆర్..!
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ భవన్ కు రానున్నారు. రేపు మధ్యాహ్నం 2 గంటలకు BRSLP, రాష్ట్ర కార్యవర్గం సంయుక్త భేటీ కానుంది. సాగు నీటి హక్కుల విషయంపై మరో ఉద్యమాన్ని నిర్మించే దిశగా పార్టీ నాయకత్వం కసరత్తు చేయనుంది. ఇదే అంశంపై కేసీఆర్… నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.
తెలంగాణ భవన్‌లో రేపు(ఆదివారం) బీఆర్ఎస్ ఎల్పీ, రాష్ట్ర కార్యవర్గ సంయుక్త భేటీ కానుంది. ఇందుకు ఆ పార్టీ అధినేత కేసీఆర్ హాజరు కానున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ఈ భేటీ ప్రారంభం కానుంది.

సాగునీటి హక్కులపై పోరుబాట..!
ముఖ్యంగా ఏపీ ప్రాజెక్టులు, కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంపై ప్రధానంగా చర్చించనున్నారు. ఏపీ సర్కార్ తెరపైకి తీసుకువస్తున్న ప్రాజెక్టులు… తెలంగాణ ప్రభుత్వ వైఖరిపై నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. సాగునీటి హక్కుల రక్షణ కోసం మరో ఉద్యమాన్ని చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పే అవకాశం ఉందని తెలుస్తోంది.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు 45 టీఎంసీలకే ఒప్పుకోవడాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. నాడు బీఆర్ఎస్ 91 టీఎంసీలు కేటాయిస్తే.. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రం వద్ద మోకరిల్లిందని విమర్శలు చేస్తోంది. నదుల అనుసంధానం పేరుతో ఏపీ జలదోపిడీకి కేంద్రం సహకరిస్తోందని ఆరోపిస్తోంది.
రాష్ట్రానికి 8 మంది బీజేపీ, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నా నోరు మెదపకపోవడం లేదని చెబుతోంది. పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ రైతాంగ ప్రయోజనాలపై ప్రత్యక్ష పోరాటానికి సిద్ధం కావాలని బీఆర్ఎస్ నాయకత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్… ఈ భేటీని నిర్వహించనున్నారు.
సమావేశంలో పార్టీ సంస్థాగత నిర్మాణం, భవిష్యత్ కార్యాచరణపై కీలక నిర్ణయాలపై కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. సర్పంచ్ ఎన్నికల ఫలితాల అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలపై కూడా చర్చ జరుగొచ్చని సమాచారం. మొత్తంగా చూస్తే…. కృష్ణా జలాల విషయంపై బీఆర్ఎస్ మరో పోరాటం చేసేందుకు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. రేపటి భేటీలో కీలక నిర్ణయాలు ఉంటాయని సమాచారం.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

