రేవంత్ నిన్ను వదిలి పెట్టను.. సిట్ విచారణకు ముందు హరీశ్ రావు సెన్సెషనల్ కామెంట్స్
ఎన్ని విచారణలకు పిలిచినా.. రేవంత్ రెడ్డిని వదిలిపెట్టేది లేదని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. చట్టాన్ని గౌరవించి తాను సిట్ విచారణకు హాజరవుతున్నానని చెప్పారు.
సిట్ విచారణకు హాజరయ్యే ముందు మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు మాట్లాడారు. ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డిపై కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి బావమరిది బాగోతం పొద్దున బయటపడగానే.. సాయంత్రం నోటీసులు ఇచ్చారన్నారు. సిద్దిపేటలో ఉంటే.. రాత్రి తన ఇంటి వద్దకు వచ్చి సిబ్బందికి నోటీసులు ఇచ్చి వెళ్లారన్నారు. చట్టాన్ని గౌరవించి తాను సిద్దిపేట నుంచి వచ్చి.. సిట్ విచారణకు వెళ్తు్న్నట్టుగా చెప్పారు.

డైవర్షన్ పాలిటిక్స్
'బిడ్డా నువ్వు ఎన్ని నోటీసులు పంపినా, ఎన్ని విచారణలకు పిలిచినా నిన్ను విడిచి పెట్టేది లేదు రేవంత్ రెడ్డి. ఎన్నికల ముందు అటెన్షన్ డైవర్షన్ కోసం చిల్లర రాజకీయాలు చేస్తున్నావు. మాకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. మేం తప్పు చేయలేదు. రాత్రి 9 గంటలకు నోటీసు ఇచ్చినా నేను సిద్దిపేట నుంచి వచ్చి హాజరవుతున్నా. దైర్యంగా వెళ్తున్నాం అడిగిన వాటికి బాజాప్తా సమాధానం చెబుతాం.' అని హరీశ్ రావు అన్నారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆల్రెడీ సుప్రీం కోర్టు చెంపచెల్లు మనేలా సమాధానం చెప్పిందని హరీశ్ రావు అన్నారు. నువ్వు ఎన్ని జిమ్మిక్కులు చేసినా నిన్ను వదిలి పెట్టమని, నీ కుంభకోణాలు బయట పెడుతూనే ఉంటామని వ్యాఖ్యానించారు. కేసీఆర్ నాయకత్వంలో రాటు దేలిన కార్యకర్తలం, ఉద్యమకారులమన్నారు. ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కేసులు పెట్టినా వదిలి పెట్టమన్నారు. ప్రజల కోసం, రాష్ట్రం కోసం మా పోరాటం జరుపుతూనే ఉంటామని అన్నారు.
ఈ కేసులో చేసిందేం ఉంది?
ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేసే దాకా వెంటపడుతూనే ఉంటామని హరీశ్ రావు ఈ సందర్భంగా చెప్పారు. మున్సిపల్ ఎన్నికల వేళ డ్రామాలు చేస్తున్నారని ఆరోపించారు. రెండేళ్లలో రేవంత్ రెడ్డి ఈ కేసులో చేసింది ఏముందని ప్రశ్నించారు. ఇంకా ఎన్ని రోజులు ఈ సీరియల్ నడుపుతారో చూస్తామన్నారు. ఇప్పటికే కాళేశ్వరం పేరుతో శ్వేతపత్రాలు, విచారణ, కమిషన్ అన్నారని గుర్తుచేశారు. చిల్లర రాజకీయాలు ఆపేసి.. ప్రజలకు కావాల్సింది రైతు బందు, పింఛన్, ఉద్యోగాలు, ఫీజు రీయింబర్స్ మెంట్, తులం బంగారమన్నారు.
బీఆర్ఎస్ భయపడదు
'ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయి, నామీద కేసులు పెడితే, అటెన్షన్ డైవర్ట్ చేస్తే తప్పించుకోలేవు. ఇంకా గట్టిగా నిలదీస్తం. మున్సిపల్ ఎన్నికల ఎజెండా నీ ఆరు గ్యారెంటీలు, నీ 420 హామీలు, రెండు లక్షల ఉద్యోగాలు. మున్సిపల్ ఎన్నికల్లో నైతికంగా దెబ్బ తీసే ప్రయత్నాలు సక్సెస్ కావు. నీ కేసులకు బీఆర్ఎస్ భయపడదు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో నీకు ప్రజలకు దిమ్మదిరిగే విధంగా జవాబు చెబుతారు చూస్కో రేవంత్ రెడ్డి.' అని హరీశ్ రావు అన్నారు.
మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయనే..
మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయనే బతుకమ్మ చీరెలు పంపిణీ చేస్తున్నారని హరీశ్ పేర్కొన్నారు. పట్టణాల్లో వడ్డీలేని రుణాలు ఇస్తున్నారన్నారు. తమకు నోటీసులు ఇచ్చి.. ప్రజలను ఎంగేజ్ చేస్తున్నాడని తెలిపారు. బీఆర్ఎస్ ఒత్తిడిని సీఎం రేవంత్ రెడ్డి తట్టుకోలేకపోతున్నారన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి అంచనాలు తప్పాయన్నారు. 40 శాతం స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధించిందన్నారు.
కిషన్ రెడ్డికి లేఖ
'బొగ్గు స్కామ్‌పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాస్తున్నాను. కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కయింది నిజం కాకపోతే సీబీఐ విచారణ చేయాలి. తన బామ్మర్దితో రేవంత్ రెడ్డి చేస్తున్న స్కామ్‌పై విచారణ జరిపించాలి. నైనీ బ్లాక్ ఒక్కటే కాదు. అన్ని టెండర్లను రద్దు చేయాలి. దీనిపై సీబీఐ విచారణ జరిపించాలి. సింగరేణి డబ్బులతో సీఎం రేవంత్ రెడ్డి ఫుట్‌బాల్ ఆడుతున్నారు. షోకుల కోసం సింగరేణి డబ్బులు ఖర్చు చేస్తుంటే.. కిషన్ రెడ్డి ఎందుకు మాట్లాడటం లేదు.' అని హరీశ్ రావు ప్రశ్నించారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


