రాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. ఓవైపు ప్రభుత్వం పోరాటం చేస్తున్న ప్రతిపక్ష బీఆర్ఎస్…. మరోవైపు క్షేత్రస్థాయిలో బలోపేతం అయ్యే దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవలే సీనియర్ నేత జీవన్ రెడ్డితో సంప్రదింపులు జరిపి… పార్టీలోకి తీసుకువచ్చేందుకు లైన్ క్లియర్ చేసింది. అయితే ఆయన సొంత నియోజకవర్గమైన జగిత్యాల గడ్డపై భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేసింది. ఇవాళ సాయంత్రం జరిగే ఈ సభకు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ హాజరవుతారు.
భారీగా జనసమీకరణ…!

ఉమ్మడి కరీంనగర్ జిల్లా మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా ఉంది. జగిత్యాల గడ్డపై నిర్వహించే ఈ సభలో పార్టీ అధినేత కేసీఆర్ స్వయంగా పాల్గొని ప్రసంగించనున్నారు. ప్రస్తుత రాష్ట్ర రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ వైఫల్యాలు, భవిష్యత్తు కార్యాచరణపై ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీ నాయకత్వం…. లక్షలాది మంది జన సమీకరణకు ప్రణాళికలు రచించింది.
ఈ సభకు జగిత్యాల జిల్లాతో పాటు ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్ తో పాటు ఇతర ప్రాంతాల నుంచి భారీగానే జనాలు వచ్చే అవకాశం ఉంది. సభ నేపథ్యంలో జగిత్యాల పట్టణం మొత్తం గులాబీ తోరణాలు, ఫ్లెక్సీలు, జెండాలతో నిండిపోయింది. నియోజకవర్గాల వారీగా ఇన్చార్జులు గ్రామగ్రామాన పర్యటించి కార్యకర్తలను సభకు తరలించే బాధ్యతలు తీసుకున్నారు. ముఖ్యంగా యువత, రైతాంగం పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉందని నేతలు చెబుతున్నారు.
కేసీఆర్ ప్రసంగంపై ఆసక్తి…!
ఈ సభ ద్వారా తెలంగాణ రాజకీయాల్లో తమ ఉనికిని, బలాన్ని మరోసారి చాటిచెప్పాలని గులాబీ పార్టీ భావిస్తోంది. సభ విజయవంతం కోసం మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా ముఖ్య నేతలు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు.
పార్టీ నిర్వహిస్తున్న ఈ సభకు దాదాపు ఏడాది కాలం తర్వాత కేసీఆర్ వస్తుండటంతో.. ఆయన ఏం మాట్లాడుతారనేది ఆసక్తికరంగా మారింది. కేసీఆర్ ప్రసంగం కోసం పార్టీ శ్రేణులు చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. దీంతో ఆయన స్పీచ్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది…!
{{/usCountry}}పార్టీ నిర్వహిస్తున్న ఈ సభకు దాదాపు ఏడాది కాలం తర్వాత కేసీఆర్ వస్తుండటంతో.. ఆయన ఏం మాట్లాడుతారనేది ఆసక్తికరంగా మారింది. కేసీఆర్ ప్రసంగం కోసం పార్టీ శ్రేణులు చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. దీంతో ఆయన స్పీచ్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది…!
{{/usCountry}}ఇక ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీమంత్రి జీవన్ రెడ్డి పెద్ద ఎత్తున తన అనుచరులతో కలిసి బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. సభ విజయవంతంపై దృష్టి పెట్టి పనిచేస్తున్నారు. జీవన్ రెడ్డి వర్గీయులు, సహచరులు పెద్ద సంఖ్యలో సభకు తరలివచ్చేందుకు, ఇతరులను తరలించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.