దేశ రాజధాని న్యూఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులు, యువతపై పోలీసులు జరిపిన అణచివేత చర్యలను నిరసిస్తూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. భారతీయ యువత శక్తివంతమైన గొంతుకను, వారి ఆకాంక్షలను పోలీసు బలగాల ప్రయోగంతో నొక్కేయడం ఎవరికీ సాధ్యం కాదని స్పష్టం చేశారు.

ఈ మేరకు ఆయన తన అధికారిక సోషల్ మీడియా వేదిక (X) ద్వారా ఒక ప్రకటన విడుదల చేశారు. ఢిల్లీలో విద్యార్థి లోకం ఎదుర్కొంటున్న దాష్టీకానికి వ్యతిరేకంగా, వారికి సంఘీభావం తెలపడానికి బీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం (BRSV) ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద భారీ నిరసన కార్యక్రమం నిర్వహించనున్నారు.
జులై 24 ఉదయం 10 గంటలకు ఇందిరా పార్క్‌లో ధర్నా ఉండనుంది. ఈ ఆందోళన కార్యక్రమంలో నేరుగా పాల్గొననున్నట్లు కేటీఆర్ స్వయంగా ప్రకటించారు. 'జులై 24న ఉదయం 10:00 గంటలకు ఇందిరా పార్క్ వద్ద బీఆర్‌ఎస్‌వీ చేపట్టే మహా ధర్నాలో నేను కూడా పాల్గొంటున్నాను.' అని కేటీఆర్ వెల్లడించారు.
ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులపై నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరూ ఈ నిరసనలో భాగస్వాములు కావాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. "నిరసన తెలిపే రాజ్యాంగబద్ధమైన హక్కును కాపాడుకోవడానికి విద్యార్థులు, యువత, ప్రజాస్వామ్యవాదులంతా కలిసికట్టుగా ముందుకు రావాలి. మన నిరసన గళాన్ని బలంగా వినిపిద్దాం." అని ఆయన పేర్కొన్నారు.
ఇటీవలి కాలంలో విద్యా రంగానికి సంబంధించిన సమస్యలు, నిరుద్యోగం, పరీక్షల నిర్వహణలో అక్రమాలపై దేశ రాజధాని ఢిల్లీలో విద్యార్థులు వినూత్న రీతిలో నిరసనలు నిర్వహిస్తున్నారు. నీట్ పేపర్ లీకేజీల వ్యవహారంపై విద్యా మంద్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. అయితే ఆ ఆందోళనల సమయంలో విద్యార్థులపై పోలీసులు దాడి చేశారని తీవ్ర విమర్శలు వచ్చాయి.
భారతదేశంలో జెన్-జీ, యువత నుంచి తీవ్ర నిరసన జ్వాలలు వ్యక్తమయ్యే అవకాశముందని, ప్రభుత్వం వెంటనే వారి సమస్యలను పరిష్కరించాలని కేటీఆర్ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ ఘటనల నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా విద్యార్థులు, యువకులు ఇందిరా పార్క్ ధర్నాకు తరలిరావాలని బీఆర్ఎస్వీ నాయకులు కూడా కోరారు.
విద్యా సంస్థలు బంద్
{{/usCountry}}భారతదేశంలో జెన్-జీ, యువత నుంచి తీవ్ర నిరసన జ్వాలలు వ్యక్తమయ్యే అవకాశముందని, ప్రభుత్వం వెంటనే వారి సమస్యలను పరిష్కరించాలని కేటీఆర్ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ ఘటనల నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా విద్యార్థులు, యువకులు ఇందిరా పార్క్ ధర్నాకు తరలిరావాలని బీఆర్ఎస్వీ నాయకులు కూడా కోరారు.
విద్యా సంస్థలు బంద్
{{/usCountry}}కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరికి, పోలీసుల దౌర్జన్యానికి వ్యతిరేకంగా జులై 24వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు, ధర్నాలు నిర్వహించనున్నట్లు విద్యార్థి నాయకులు సంయుక్త ప్రకటనలో వెల్లడించారు. విద్యా హక్కులు, విద్యార్థుల సమస్యలపై పోరాడుతున్న వారిపై దాడులు చేయడం ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేయడమేనని వామపక్ష విద్యార్థి సంఘాల (AISF, SFI, PDSU తదితర) నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం విద్యార్థుల గొంతు నొక్కేందుకు ప్రయత్నిస్తోందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ఢిల్లీలో విద్యార్థులపై దాడికి పాల్పడిన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని వామపక్ష విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. కేంద్ర విద్యాశాఖ విద్యార్థుల భద్రతను, భవిష్యత్తును గాలికి వదిలేసిందని ఆరోపిస్తూ కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మల దహన కార్యక్రమాలు చేపట్టనున్నారు.
హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం (OU)తో పాటు కేయూ (KU), పాలమూరు, శాతవాహన యూనివర్సిటీల్లో భారీ ర్యాలీలు నిర్వహించనున్నారు. జులై 24న జరగబోయే ఈ రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్‌లో ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కాలేజీలు, డిగ్రీ, ఇంజనీరింగ్ కాలేజీలతో పాటు యూనివర్సిటీల విద్యార్థులు, అధ్యాపకులు, విద్యాసంస్థల యాజమాన్యాలు పాల్గొని విజయవంతం చేయాలని సంఘాల నాయకులు విజ్ఞప్తి చేశారు.