...
...
Next Story

బీటెక్ విద్యార్థినిపై క్లాస్‌రూమ్‌లోనే అత్యాచారం.. ఓయోకు తీసుకెళ్లి మత్తు ఇచ్చి వీడియోలు, ఫొటోలు!

Hyderabad : హైదరాబాద్ బాచుపల్లిలో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థినిపై ఓ యువకుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా బయటకు వచ్చింది. అంతేకాదు మరో యువకుడు సైతం ఆమెను ఇబ్బందిపెట్టాడు.

Published on: Mar 4, 2026, 12:10:08 IST
Advertisement

హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలో ఘోరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. బీటెక్ విద్యార్థినిపై క్లాస్ రూమ్‌లోనే ఓ విద్యార్థి అత్యాచారం చేశాడు. అంతేకాదు వీడియోలు, ఫొటోలు తీసి.. పలుమార్లు బెదిరిస్తూ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. స్నేహితుడితో కూడా అఘాయిత్యం చేయించేందుకు ట్రై చేశాడు. బాధితురాలి ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

యువతిపై అత్యాచారం
యువతిపై అత్యాచారం

పోలీసులు, బాధితురాలు చెప్పిన వివరాల ప్రకారం.. నిజాంపేటకు చెందిన ఒక యువతి.. బాచుపల్లిలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. ఆశిష్ అనే యువకుడు అదే కాలేజీలో చదువుతున్నాడు. ఆ తర్వాత ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యారు. కొన్ని రోజులకు యువతికి ఆశిష్ ప్రపోజ్ చేశాడు.

2023లో బెదిరించి కాలేజీలోనే ఒక క్లాస్ రూమ్‌లో అత్యాచారం చేసినట్టుగా బాధితురాలి ఫిర్యాదులో పేర్కొంది. ఈ సమయంలో కాలేజీ సిబ్బంది యువకుడిని పట్టుకున్నా.. చర్యలు తీసుకోకుండా వదిలేశారని బాధితురాలు వెల్లడించింది. ఆ తర్వాత తనను బెదిరిస్తూ అనేకసార్లు అత్యాచారం చేసినట్టుగా వివరించింది. అంతేకాదు ఓయో రూమ్‌కి తీసుకెళ్లి మత్తు పదార్థాలు ఇచ్చి, స్పృహ కోల్పోయాక దుస్తులు లేకుండా.. వీడియోలు, ఫొటోలు తీసినట్టుగా తెలిపింది. వాటిని డార్క్ వెబ్‌లో పెడతానని బెదిరించినట్టుగా ఫిర్యాదు చేసింది.

ఓ వైపు ఇదంతా జరుగుతుండగానే.. ప్రవీణ్ అనే యువకుడిని యువతికి ఆశిష్ పరిచయం చేశాడు. ప్రేమ పేరుతో ఆశిష్ తనను మోసం చేసినట్టుగా విషయాన్ని ప్రవీణ్‌తో చెప్పింది యువతి. ప్రవీణ్ కూడా ఆమెపై అఘాయిత్యానికి పాల్పడేందుకు కూడా ప్రయత్నించాడు. తప్పించుకుని బయటపడింది.

ఫిబ్రవరి 28వ తేదీన బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధితురాలు. పోలీసులు ఆశిష్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న మరో నిందితుడు ప్రవీణ్ కోసం గాలిస్తున్నారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe