కేవలం 2 గంటల్లోనే హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లవచ్చు : అశ్వినీ వైష్ణవ్

హైస్పీడ్ రైళ్లతో దక్షిణ భారతదేశంలో ప్రయాణ సమయం తగ్గుతుందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ అన్నారు. తెలంగాణ రైల్వే అభివృద్ధి పనులకు రూ.5454 కోట్లు కేటాయించినట్టుగా వెల్లడించారు.

Published on: Feb 2, 2026, 22:15:35 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కేంద్ర బడ్జెట్ సమర్పించిన ఒక రోజు తర్వాత న్యూఢిల్లీ నుండి వర్చువల్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ మాట్లాడారు. రాష్ట్రాల వారీగా కేటాయింపులు, కీలక రైల్వే ప్రాజెక్టులను వివరించారు. బెంగళూరును హైదరాబాద్, చెన్నైతో కలిపే ప్రతిపాదిత హై-స్పీడ్ రైలు కారిడార్‌లను ప్రధాన గేమ్ ఛేంజర్‌లుగా వ్యాఖ్యానించారు. కేంద్ర బడ్జెట్ 2026-27ను కర్ణాటకకు రికార్డ్ బడ్జెట్‌గా అభివర్ణించారు. రూ.7,748 కోట్ల రైల్వే కేటాయింపులు, రాష్ట్రంలో రూ.52,950 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రకటించారు.

కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌
కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌

బడ్జెట్‌లో ప్రకటించిన హై-స్పీడ్ రైలు ప్రాజెక్టులు దక్షిణ భారతదేశంలో అంతర్ నగర ప్రయాణాన్ని గణనీయంగా మారుస్తాయని వైష్ణవ్ అన్నారు. బెంగళూరు-చెన్నై-హైదరాబాద్ హై-స్పీడ్ రైలు కారిడార్‌ను డైమండ్ ప్రాజెక్ట్‌గా అభివృద్ధి చేస్తామన్నారు. హైస్పీడ్ కారిడార్‌తో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మధ్య ఆర్థిక, హెల్త్ టూరిజం అభివృద్ధి చెందుతుందని తెలిపారు.

ఈ బడ్జెట్‌లో కర్ణాటకకు బుల్లెట్ రైలు ప్రతిపాదనలు అత్యంత ముఖ్యమైన ప్రయోజనాల్లో ఒకటిగా మంత్రి అశ్వినీ వైష్ణవ్ అన్నారు. బెంగళూరు-చెన్నై కారిడార్ ప్రయాణ సమయాన్ని కేవలం ఒక గంట 13 నిమిషాలకు తగ్గిస్తుందని అన్నారు. 'బెంగళూరు-చెన్నై ఒక విధంగా రెండు విలీన నగరాలుగా మారతాయి. రోజులో ఏ సమయంలోనైనా వెళ్లి రావొచ్చు. చెన్నైలో పని పూర్తి చేసి అదే రోజు బెంగళూరుకు తిరిగి రావచ్చు. అదేవిధంగా బెంగళూరు-హైదరాబాద్ హై-స్పీడ్ రైలు మార్గం ప్రయాణ సమయం దాదాపు రెండు గంటలు మాత్రమే అవుతుంది.' అని మంత్రి అశ్వినీ వైష్ణవ్ అన్నారు.

వేగవంతమైన కనెక్టివిటీతో తయారీ, డిజైన్, ఐటీ సేవలకు పెద్ద ప్రోత్సాహాన్ని అందిస్తుందని కేంద్రమంత్రి పేర్కొన్నారు. ముఖ్యంగా టెక్నాలజీ, ఇన్నోవేషన్ హబ్‌గా బెంగళూరు పాత్రకు ప్రయోజనం చేకూరుస్తుందన్నారు.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో దేశవ్యాప్తంగా ఏడు హై-స్పీడ్ రైలు కారిడార్‌లను ప్రతిపాదించారు. వీటిలో, హైదరాబాద్-బెంగళూరు, చెన్నై-బెంగళూరు కారిడార్లు, బెంగళూరును తెలంగాణ, తమిళనాడు రాజధానులతో నేరుగా కనెక్ట్ చేస్తాయని భావిస్తున్నారు. ఇతర ప్రతిపాదిత హై-స్పీడ్ రైలు మార్గాలలో ముంబై-పుణే, పూణే-హైదరాబాద్, హైదరాబాద్-చెన్నై, ఢిల్లీ-వారణాసి, వారణాసి-సిలిగురి ఉన్నాయి.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More