TG SET Results : టీజీ సెట్ ఫలితాలు ఎప్పుడు..? అభ్యర్థుల ఎదురుచూపులు
టీజీ సెట్ - 2025 ఫలితాల కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. గతేడాది డిసెంబర్ లో పరీక్షలు పూర్తయ్యాయి. కానీ ఇప్పటివరకు ఫలితాలు ఇంకా విడుదల కాలేదు.
తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టీజీ సెట్ - 2025) ఫలితాలు ఇంకా విడుదల కాలేదు. పరీక్షలు నిర్వహించి 2 నెలలు దాటినప్పటికీ… ఇంకా రిజల్ట్స్ ప్రకటించలేదు. దీంతో అభ్యర్థులు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే చాలా ఆలస్యమైందని… వెంటనే ఫలితాలను ప్రకటించాలని పరీక్ష రాసిన అభ్యర్థులు కోరుతున్నారు.

అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా అర్హత సాధించేందుకు ఉస్మానియా యూనివర్సిటీ గతేడాది డిసెంబర్ 22, 23, 24 తేదీల్లో టీజీ సెట్ - 2025 పరీక్షలు నిర్వహించింది. మొత్తం 29 సబ్జెక్టులకు సంబంధించిన ఈ పరీక్షను 18 కేంద్రాల్లో వీటిని నిర్వహించగా… సుమారు 80 శాతం మంది పరీక్ష రాశారు.
టీజీ సెట్ పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక కీలతో పాటు మాస్టర్ క్వశ్చన్ పేపర్లను త్వరగానే ప్రకటించారు. జనవరి నెలలో వీటిని అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రాథమిక కీలపై అభ్యంతరాలను స్వీకరించారు. ఈ గడువు కూడా చాలా రోజుల కిందటే పూర్తి అయింది. ఈ ప్రాసెస్ అంతా పూర్తి అయినప్పటికీ…. ఇంకా ఫలితాలు రాకపోవటంపై అభ్యర్థులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఫలితాలు ఎప్పుడు..?
టీజీ సెట్ ఫలితాలకు సంబంధించి అన్ని ప్రక్రియలు పూర్తి అయినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఫలితాలను విడుదల చేసే అవకాశం ఉంది. ఈ మేరకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
అసిస్టెంట్ ప్రొఫెసర్లు, డిగ్రీ కాలేజీ లెక్చరర్ల ఉద్యోగాలకు అర్హత సాధించేందుకు టీజీ సెట్ పరీక్ష నిర్వహిస్తారు. పేపర్-1లో 50 ప్రశ్నలకు 100 మార్కులు, పేపర్-2లో 100 ప్రశ్నలకు 200 మార్కులంటాయి. వీటిలో అభ్యర్థులు సాధించే మెరిట్ మార్కుల ఆధారంగా ఫలితాలను ప్రకటిస్తారు. ఓపెన్ తో పాటు రిజర్వేషన్ల ఆధారంగా కటాఫ్ స్కోర్ ను నిర్ణయించి.. అర్హత సాధించిన వారికి మాత్రమే సెట్ పత్రాలను అందజేస్తారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

