ఫైన్ లేకుండా ఏపీ సెట్ దరఖాస్తుకు ఈరోజే లాస్ట్ డే.. ఇదిగో మీకోసం డైరెక్ట్ లింక్ ఇక్కడ ఉంది
ఏపీ సెట్ 2025 రిజిస్ట్రేషన్ ఈరోజు(ఫిబ్రవరి 9)తో ముగుస్తుంది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్‌కు దరఖాస్తు చేసుకోవడానికి డైరెక్ట్ లింక్ మీకోసం ఇక్కడ ఉంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అర్హత పరీక్ష(AP SET) 2025 కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఫిబ్రవరి 9తో ముగుస్తుంది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ కు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు apset.net.in అధికారిక వెబ్‌సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. రూ.2000 ఆలస్య రుసుము ప్లస్ రిజిస్ట్రేషన్ ఫీజుతో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఫిబ్రవరి 25, 2026గా నిర్ణయించారు.

హాల్ టికెట్ మార్చి 19, 2026 నుండి డౌన్లోడ్ చేయడానికి అందుబాటులో ఉంటుంది. అభ్యర్థులు యూజీసీ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ లేదా తత్సమాన ఉత్తీర్ణత పూర్తి చేసి ఉండాలి. 55 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టులో మాస్టర్స్ డిగ్రీ చేసి ఉండాలి.
ఎలా దరఖాస్తు చేయాలి?
- AP SET అధికారిక వెబ్‌సైట్ apset.net.in సందర్శించండి.
- హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న AP SET 2025 రిజిస్ట్రేషన్ లింక్ పై క్లిక్ చేయండి.
- కొత్త పేజీ తెరుచుకుంటుంది, అక్కడ అభ్యర్థులు రిజిస్టర్ చేసుకోవాలి.
- రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత, దరఖాస్తు ఫారమ్ నింపండి.
- సబ్మిట్ పై క్లిక్ చేయండి, మీ దరఖాస్తు సబ్మిట్ అవుతుంది.
- ఆ తర్వాత పేజీని డౌన్‌లోడ్ చేసుకోండి, తదుపరి అవసరం కోసం దాని హార్డ్ కాపీని ఉంచుకోండి.
దరఖాస్తు ఫీజు
ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకు రూ.1600, బీసీ-ఏ, బీసీ-బీ, బీసీ-సీ-సీ, బీసీ-డీ, బీసీ-ఇ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులకు రూ. 1300, ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/ట్రాన్స్జెండర్ అభ్యర్థులకు రూ. 900. క్రెడిట్ కార్డు/డెబిట్ కార్డు (రూపే/వీసా/మాస్టర్ కార్డ్/మాస్ట్రో), ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఫీజు చెల్లించాలి.
పరీక్ష తేదీలు
2026 మార్చి 28, 29 తేదీల్లో ఈ పరీక్ష జరగనుంది. పరీక్షా కేంద్రాల్లో ప్రత్యేకంగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) విధానంలో ఏపీ సెట్ నిర్వహిస్తారు. ఆఫ్‌లైన్ లేదా పెన్-అండ్-పేపర్ మోడ్ అనుమతించరు. పరీక్షకు రెండు పేపర్లు ఉంటాయి. ఈ పరీక్షలో పేపర్ 1 టీచింగ్ అండ్ రీసెర్చ్ ఆప్టిట్యూడ్ 50 ప్రశ్నలకు 100 మార్కులు, పేపర్ 2 సబ్జెక్ట్ పేపర్ ఉంటాయి. 100 ప్రశ్నలకు 200 మార్కుల చొప్పున మొత్తం 300 మార్కులకు కేటాయించారు. పరీక్ష వ్యవధి మూడు గంటలుగా ఉంటుంది. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు ఏపీ సెట్ అధికారిక వెబ్‌సైట్‌ను చెక్ చేయవచ్చు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


