కవిత ఇంటికి సీబీఐ అధికారులు.. దిల్లీ లిక్కర్ కేసులో మళ్లీ నోటీసులు!
Delhi Liquor Case : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఇంటికి సీబీఐ అధికారులు వెళ్లారు. దిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన అంశంలో నోటీసులు ఇచ్చారు.
దిల్లీ మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితకు గురువారం సీబీఐ అధికారులు నోటీసులు అందజేశారు. బంజారాహిల్స్‌లోని ఆమె నివాసానికి సీబీఐ అధికారుల బృందం వచ్చి సమన్లు జారీ చేసింది. కవితతో పాటు వ్యాపారవేత్తలు అరుణ్ రామచంద్ర పిళ్లై, అభిషేక్ బోయిన్‌పల్లి, శరత్ రెడ్డి, మాజీ ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డికి సమన్లు అందాయి.

దిల్లీ మద్యం కేసులో సీబీఐ అభియోగాలు నిరాధారంగా ఉన్నాయని కొన్ని రోజుల కిందట రౌజ్ అవెన్యూ కోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. కోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ సీబీఐ దిల్లీ హైకోర్టులో అప్పిల్ చేసింది. దీంతో దిల్లీ లిక్కర్ స్కామ్ కేసు నుండి విడుదలైన అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, కల్వకుంట్ల కవిత సహా 23 మందికి నోటీసులు జారీ చేసింది.
దీనిపై కల్వకుంట్ల కవిత ఎక్స్‌లో పోస్ట్ చేశారు. 'ఈరోజు మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో సీబీఐ నాకు నోటీసు అందజేసింది. మార్చి 16, 2026న హైకోర్టులో ఈ కేసుకు సంబంధించి విచారణ ఉంది. నేను నా న్యాయ బృందంతో సంప్రదింపులు జరుపుతున్నాను. అధికారిక మార్గాల ద్వారా తగిన విధంగా స్పందిస్తాను. నిజం గెలుస్తుందని నమ్మకం ఉన్న వ్యక్తిగా, నేను అధికారులకు పూర్తిగా సహకరిస్తాను. దర్యాప్తు సంస్థ ఉన్నత న్యాయస్థానంలో అప్పీలు దాఖలు చేసినప్పుడు నోటీసు అందజేయడం నిర్దేశించిన చట్టపరమైన విధానం. అదే విధంగా దీనిని తప్పుగా అర్థం చేసుకోవద్దని నేను అభ్యర్థిస్తున్నాను.' అని కవిత అన్నారు.
దిల్లీ లిక్కర్ స్కామ్ కేసు ఏంటి?
అరవింద్ కేజ్రీవాల్ సీఎంగా ఉన్నప్పుడు దిల్లీ ప్రభుత్వం 2021 నవంబర్‌లో కొత్త మద్యం పాలసీని అమల్లోకి తెచ్చింది. ఈ విధానంలో అవకతవకలు, స్కామ్ జరిగిందని ఆరోపణలు వచ్చాయి. పెద్ద ఎత్తున విమర్శల పాలైంది ప్రభుత్వం. దీంతో దిల్లీ సర్కార్ 2022 సెప్టెంబర్‌లో పాలసీని వెనక్కు తీసుకుంది. కానీ అప్పటికే లైసెన్సుల కేటాయింపులు, ఎక్సైజ్ పాలసీ సవరణలో భారీ అక్రమాలు జరిగాయని, ఆప్ నేతలు, మరికొందరు మనీలాండరింగ్‌కు పాల్పడినట్టుగా సీబీఐ, ఈడీ ఆరోపణలు చేశాయి.
లైసెన్స్‌దారులకు నిబంధనలకు విరుద్ధంగా ప్రయోజనం చేకూర్చినట్టుగా ఆరోపణలు వచ్చాయి. ఇందుకోసం నిందితులు భారీగా డబ్బులు తీసుకున్నారని సీబీఐ, ఈడీ ఆరోపించింది. ఇందులో భాగంగా అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, ఇతర ఆప్ నేతలతోపాటుగా కల్వకుంట్ల కవితను కూడా అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసు అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆ తర్వాత జైలు శిక్ష, బెయిల్ మీద విడుదల అయ్యారు. ఇటీవలే ఈ కేసులో 23 మందికి క్లీన్ చిట్ ఇచ్చింది రౌజ్ అవెన్యూ కోర్టు. కానీ సీబీఐ హైకోర్టులో అప్పీల్ చేసింది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


