CCMB హైదరాబాద్ లో 50 ఉద్యోగ ఖాళీలు - మంచి జీతం..! ఈ లింక్ తో అప్లయ్ చేసుకోండి
హైదరాబాద్ లోని CSIR-CCMB నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. 50 టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేస్తారు. అర్హత గల అభ్యర్థులు ఫిబ్రవరి 23వ తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. https://www.ccmb.res.in/ వెబ్ సైట్ లో వివివరాలను చెక్ చేసుకోవచ్చు.
హైదరాబాద్ లోని సీఎస్ఐఆర్- సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (CSIR-CCMB) నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా 50 టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేస్తారు.

అర్హత గల అభ్యర్థులు ఫిబ్రవరి 23వ తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ పూర్తి అయిన అప్లికేషన్ ఫారమ్ తో పాటు సంబంధిత పత్రాలతో కూడిన హార్డ్ కాపీని మార్చి 2వ తేదీలోపు సమర్పించాల్సి ఉంటుంది.
CSIR-CCMB ఉద్యోగ నోటిఫికేషన్ - వివరాలు
- ఉద్యోగ ప్రకటన - సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ, హైదరాబాద్
- ఉద్యోగాలు - టెక్నీషియన్(1)/గ్రేడ్-II(1)
- మొత్తం ఖాళీలు - 50
- 50శాతం మార్కులతో సైన్స్ సబ్జెక్టుతో టెన్త్ లేదా తత్సమాన విద్యార్హత సంబంధిత విభాగంలో ఐటీఐ సర్టిఫికేట్ లేదా నేషనల్/స్టేట్ ట్రేడ్ సర్టిఫికేట్, టెక్నికల్ అసిస్టెంట్, ఆఫీసర్ పోస్టులకు సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఈ/బీటెక్, బీఎస్సీ, ఎంఎస్సీ ఉత్తీర్ణత ఉండాలి. పని చేసిన అనుభవం ఉండాలి. పూర్తిస్థాయి నోటిఫికేషన్ లో వివరాలను పొందుపరిచారు.
- గరిష్ఠ వయోపరిమితి: 28 ఏళ్లు మించకూడదు.
- నెల జీతం : రూ.39,545.
- దరఖాస్తు విధానం - ఆన్ లైన్
- దరఖాస్తు ఫీజు - జనరల్ అభ్యర్థులకు రూ. 500, ఎస్సీ, ఎస్టీ, మహిళలు, దివ్యాంగ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు
- దరఖాస్తులకు చివరి తేదీ - 23 ఫిబ్రవరి 2026
- హార్డ్‌కాపీ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ -2 మార్చి 2026.
- హార్డ్ కాపీ పంపాల్సిన అడ్రస్ - సెక్షన్ ఆఫీసర్(రిక్రూట్ మెంట్ సెల్), సీసీఎంబీ, ఉప్పల్ రోడ్, హబ్సీగూడ, హైదరాబాద్ - 500007 చిరునామాకు పంపాలి.
- ఎంపిక విధానం- ముందుగా ట్రేడ్ టేస్ట్ ఉంటుంది. ఆ తర్వాత రాత పరీక్షను నిర్వహిస్తారు. మెరిట్ లిస్ట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
- 150 మార్కులకు రాత పరీక్ష ఉంటుంది. 2.30 గంటల సమయం ఉంటుంది. మల్టీపుల్ ఛాయిస్ ప్రశ్నలు అడుగుతారు.
- అధికారిక వెబ్ సైట్ - https://www.ccmb.res.in/
ఈ లింక్ పై క్లిక్ చేసి ఈ ఉద్యోగాలకు నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

