...
...
Next Story

Census Self Enumeration Video : ఇంటి నుంచే సెల్ఫ్‌ ఎన్యుమరేషన్‌ చేసుకోవటం ఎలా...? స్టెప్ బై స్టెప్ ఇక్కడ తెలుసుకోండి

Self Enumeration Process : తెలంగాణలో జనగణన 2027 ప్రక్రియ ప్రారంభమైంది. సెల్ఫ్ ఎన్యుమరేషన్ (SE) ద్వారా ప్రజలు తమ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి…..

Published on: Apr 27, 2026, 09:48:54 IST
Advertisement

Self Enumeration Process : రాష్ట్రంలో జనగణన 2027 ప్రక్రియ ప్రారంభమైంది. గతంలో ఎన్యుమరేటర్లు ఇంటికి వచ్చి వివరాలు అడిగి వెళ్లేవారు, కానీ ఈసారి పౌరులే స్వయంగా తమ వివరాలను నమోదు చేసుకునే 'సెల్ఫ్ ఎన్యుమరేషన్' (SE) విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఈ డిజిటల్ ప్రక్రియను ప్రజలు సులభంగా పూర్తి చేసేలా నాలుగు ప్రధాన దశల్లో పోర్టల్‌ను రూపొందించారు. ఇంటి వద్ద నుంచే చాలా సులభంగా ఈ ప్రక్రియను ఎలా పూర్తి చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి…..

మొదటి దశ: రిజిస్ట్రేషన్, లాగిన్

సెల్ఫ్ ఎన్యుమరేషన్ చేసుకోవటం ఎలా...?
సెల్ఫ్ ఎన్యుమరేషన్ చేసుకోవటం ఎలా...?

ముందుగా పౌరులు అధికారిక సెన్సస్ పోర్టల్ (https://se.census.gov.in) లోకి వెళ్లాలి. అక్కడ తమ రాష్ట్రాన్ని (తెలంగాణ) ఎంచుకుని, స్క్రీన్‌పై కనిపించే క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. అనంతరం 'హౌస్‌హోల్డ్ రిజిస్ట్రేషన్' విభాగంలో ఇంటి యజమాని పేరు, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి వివరాలను నమోదు చేయాలి. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే…. ఒక మొబైల్ నంబర్‌తో ఒక కుటుంబం వివరాలు మాత్రమే నమోదు చేయగలరు.

రెండవ దశ : ధ్రువీకరణ, స్థల గుర్తింపు

నమోదు చేసిన మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీ (OTP) ద్వారా లాగిన్ అవ్వాలి. ఇక్కడ మీకు నచ్చిన భాషను (తెలుగు, ఇంగ్లీష్, హిందీ లేదా ఉర్దూ) ఎంచుకునే వెసులుబాటు ఉంది. భాషను ఎంచుకున్న తర్వాత మీ జిల్లా, పిన్ కోడ్, గ్రామం లేదా పట్టణం వంటి వివరాలను పూరించాలి. చివరగా మ్యాప్‌లో మీ ఇంటి ఖచ్చితమైన లొకేషన్‌ను రెడ్ మార్కర్ ద్వారా గుర్తించాల్సి ఉంటుంది.

మూడవ దశ: వివరాల నమోదు - సబ్మిషన్

ఈ దశలో హౌస్‌లిస్టింగ్, హౌసింగ్ సెన్సస్ అనే రెండు రకాల ప్రశ్నపత్రాలను పూర్తి చేయాలి. కుటుంబ సభ్యుల వివరాలు, ఇంటి వసతులు వంటి సమాచారాన్ని నమోదు చేసిన తర్వాత, అన్ని వివరాలను ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవాలి. సమాచారం సరైనదని నిర్ధారించుకున్నాక తర్వాత…… 'ఫైనల్ సబ్మిట్' బటన్ నొక్కాలి. వెంటనే మీకు 11 అంకెలతో కూడిన 'SE ID' (ఉదాహరణకు: H12345678990) మొబైల్ లేదా ఈమెయిల్‌కు వస్తుంది.

నాలుగవ దశ: ఫీల్డ్ వాలిడేషన్

వివరాలు నమోదు చేసేటప్పుడు మొబైల్ ఫోన్ దగ్గర ఉంచుకోవాలి. మీరు ఇచ్చే సమాచారం అత్యంత సురక్షితంగా ఉంటుందని, ఇది కేవలం జనగణన ప్రయోజనాల కోసమే ఉపయోగిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.

వీడియో ఇక్కడ చూడండి…

ప్రజలు తమ వ్యక్తిగత, కుటుంబ వివరాలను ఎవరికి వారే నేరుగా పోర్టల్‌లో నమోదు చేసుకోవచ్చు. https://se.census.gov.in వెబ్‌సైట్‌ లో ఈ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవాలి. ఈ ప్రక్రియ ఎలాంటి ప్రశ్నలు ఉంటాయి…? వివరాలు ఎలా నమోదు చేయాలి..? వంటి వివరాలను కింద ఇచ్చిన వీడియోలో చూడండి…..

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe