తెలంగాణ రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీస్‌లో ఖాళీగా ఉన్న 60 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది. అయితే తాజాగా పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు నుంచి మరో అప్డేట్ వచ్చింది. ధ్రువపత్రాల పరిశీలన (సర్టిఫికెట్ వెరిఫికేషన్) తేదీలను ప్రకటించింది.
ఈనెల 20 నుంచి వెరిఫికేషన్

{{^htLoading}} {{/htLoading}}
టీజీఎఫ్‌ఎస్‌ఎల్‌లోని పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించనున్నారు. ఈ ప్రక్రియ ఈనెల 20వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. జనవరి 31వ తేదీతో ప్రాసెస్ పూర్తవుతుంది. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్, గచ్చిబౌలి, హైదరాబాద్ లో ఈ ప్రక్రియ జరుగుతుందని రాష్ట్ర పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు(టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) ప్రకటించింది.
- ఇక అభ్యర్థులు ఇంటిమేషన్ లెటర్లను జనవరి 12వ తేదీ నుంచి అందుబాటులోకి వస్తాయి.
- ఉదయం 8 గంటల నుంచి జనవరి 19వ తేదీ వరకు ఇంటిమేషన్ లెటర్లను పొందవచ్చు.
- రాష్ట్ర పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు అధికారిక వెబ్ సైట్ www.tgprb.in నుంచి వీటిని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
- ఉదయం 9 గంటల నుంచే వెరిఫికేషన్ ప్రారంభమవుతుంది. ముందుగానే అభ్యర్థులు చేరుకోవాల్సి ఉంటుంది.
- ఏమైనా ఇబ్బందులు వస్తే support@tslprb.in కు మెయిల్ ద్వారా సమాచారం ఇవ్వొచ్చు.
- మరిన్ని వివరాలకు 9391005006 నంబరుకు కాల్ చేయవచ్చు.
- సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి అయిన తర్వాత అర్హులైన అభ్యర్థులకు ఫిబ్రవరి 3 లేదా 4వ వారంలో ఎగ్జామ్ నిర్వహిస్తారు.
అభ్యర్థి వద్ద ఉండాల్సిన పత్రాలు:
- ఇంటిమేషన్ లెటర్
- ఆధార్ కార్డు
- అప్లికేషన్ ఫారమ్ ప్రింట్ ఔట్
- టెన్త్ మెమో
- ఇంటర్ మెమో
- డిగ్రీ, పీజీ మార్కుల మెమో
- 1 నుంచి 7వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు
- రెసిడెన్స్ సర్టిఫికెట్
- ఇతర పత్రాలు
{{^htLoading}} {{/htLoading}}
ఈ లింక్ పై క్లిక్ చేసి ఇంటిమేషన్ లెటర్లకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు
Advertisement
{{/htLoading}}{{#usCountry}} {{/usCountry}}