11 మున్సిపాలిటీల్లో ఛైర్‌పర్సన్ల ఎన్నిక వాయిదా.. మళ్ళీ ఎప్పుడు నిర్వహిస్తారంటే?
తెలంగాణ రాష్ట్రంలోని 11 మునిసిపాలిటీలకు ఛైర్ పర్సన్లు, వైస్ ఛైర్మన్ల పదవుల ఎన్నికను రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) వాయిదా వేసింది. పలు కారణాలతో ఎన్నికను వాయిదా వేశారు.
తెలంగాణ మున్సిపాలిటీల్లో కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేశారు. కార్పొరేషన్ల మేయర్లు, మున్సిపాలిటీల్లో ఛైర్ పర్సన్‌ల ఎంపికపై చాలా చోట్ల ఉత్కంఠ నెలకొంది. 11 మున్సిపాలిటీల్లో ఛైర్‌పర్సన్‌లు, వైస్ ఛైర్మన్ల ఎన్నిక వాయిదా పడింది.

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకారం.. 11 మున్సిపాలిటీల్లో ఛైర్ పర్సన్, వైస్ ఛైర్మన్ల పదవులకు పరోక్ష ఎన్నికలు మంగళవారం(ఫిబ్రవరి 17) జరుగుతాయి. ఎన్నిక వాయిదా పడిన మున్సిపాలిటీలు ఇవే..
- ఇల్లందు
- సుల్తానాబాద్
- ఇబ్రహీంపట్నం
- కాగజ్‌నగర్
- కేతనపల్లి
- ఖానాపూర్
- జహీరాబాద్
- ఇంద్రేశం
- డోర్నకల్
- తొర్రూర్
- జనగాం
మంగళవారం ఈ 11 మున్సిపాలిటీల్లో ఛైర్ పర్సన్, వైస్ ఛైర్మన్ల ఎన్నిక జరిగే అవకాశం ఉందని ఎన్నికల సంఘం అధికారి ఒకరు తెలిపారు. ఆలస్యానికి కారణాన్ని ఆయన ప్రస్తావించలేదు.
116 మునిసిపాలిటీలు, ఏడు మున్సిపల్ కార్పొరేషన్లలోని 2,996 వార్డులకు ఫిబ్రవరి 11, 2026న ఎన్నికలు జరిగాయి. ఓట్ల లెక్కింపు తర్వాత ఫిబ్రవరి 13న ఫలితాలు ప్రకటించారు. దీని తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్, డిప్యూటీ మేయర్లు, మునిసిపాలిటీల ఛైర్‌పర్సన్, వైస్ ఛైర్మన్లు ప్రమాణ స్వీకారోత్సవం, ఎన్నికలు జరిగాయి. తెలంగాణ మున్సిపాలిటీల చట్టం 2019 ప్రకారం, ఎన్నికైన సభ్యుని పదవీకాలం ఎన్నికల తర్వాత మునిసిపాలిటీ మొదటి సమావేశం తేదీ నుండి ఐదు సంవత్సరాలు ఉంటుంది.
ప్రజలు మునిసిపాలిటీల సంబంధిత వెబ్‌సైట్‌లలో మేయర్లు, కార్పొరేటర్లు, ఛైర్‌పర్సన్, వైస్ ఛైర్మన్లు, కౌన్సిలర్లు, ఇతరుల వివరాలను తెలుసుకోవచ్చు. వీటి లింక్‌లు కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ (CDMA) హోమ్‌పేజీలో ‘జిల్లా/ULB పోర్టల్స్’ కింద అందుబాటులో ఉన్నాయి.
ఛైర్ పర్సన్లుగా ఇండిపెండెంట్లు
కొన్ని మున్సిపాలిటీల్లో ఆసక్తికర సంఘటనలు జరిగాయి. అసలు రేసులోనే లేరు అనుకున్న స్వతంత్ర అభ్యర్థులు ఛైర్ పర్సన్లుగా ఎన్నికయ్యారు. బైంసా మున్సిపాలిటీలో బీజేపీ, ఎంఐఎం, కాంగ్రెస్, స్వతంత్రుల మద్దతుతో స్వతంత్ర అభ్యర్థి తూమెల్ల దత్తాత్రి ఛైర్మన్‌గా, ఖతుజా సిద్ధికి వైస్ ఛైర్ పర్సన్‌గా ఎన్నికయ్యారు.
కామారెడ్డిలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిచిన ఇప్ప ఉమారాణిని ఛైర్ పర్సన్‌గా ఎంపికయ్యారు. ఫలితాల తర్వాత ఉమారాణి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్ప ఉమారాణి ఛైర్ పర్సన్ పదవికి పోటీలో నిలిచి గెలిచారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కాంగ్రెస్ మద్దతుతో ఉమారాణి ఎన్నియ్యారు. వైస్ ఛైర్ పర్సన్‌గా బీఆర్ఎస్‌కు చెందిన కాసర్ల గోదావరిని ఎన్నుకున్నారు.
ఇక ఆదిలాబాద్‌లో 45వ వార్డు నుంచి స్వంతంత్ర అభ్యర్థిగా గెలిచిన అనూష బండారి ఛైర్ పర్సన్‌గా ఎన్నికయ్యారు. బీజేపీకి పీఠం దక్కకుండా కాంగ్రెస్ చేసిన ప్లాన్ వర్కౌట్ అయింది. బండారి అనూషకు 11 మంది కాంగ్రెస్, ఐదుగురు బీఆర్ఎస్, ఆరుగురు ఎంఐఎం, ఐదుగురు ఇండి పెండెంట్లు సపోర్ట్ చేశారు. 21 మంది కౌన్సిలర్లతో క్యాంపు నిర్వహించిన బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్‌కు షాక్ తగిలింది. ఇక్కడ అంచనాలు తలకిందుగా అయి.. అనూష ఛైర్ పర్సన్ అయ్యారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


