తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలు - ఏ పార్టీకి ఎంత శాతం ఓట్లు వచ్చాయంటే…?

మున్సిపల్ ఎన్నికల్లో రాజకీయ పార్టీల ఓటింగ్‌ శాతాలపై ఈసీ ప్రకటన చేసింది.  కాంగ్రెస్‌ కు 39.8 శాతం, బీఆర్ఎస్‌ కు 28.7 శాతం, బీజేపీకి 15.6 శాతం ఓట్లు దక్కాయి. ఇక ఎంఐఎం 3.2 శాతం, AIFB 1.5 శాతం, సీపీఐ 1.3 శాతం, సీపీఎంకు 0.5 శాతం ఓట్లు వచ్చాయి.

Published on: Feb 14, 2026 7:22 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఈసీ కీలక ప్రకటన చేసింది. మున్సిపల్‌, కార్పొరేషన్ల పరిధిలో జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకి ఎంత శాతం మేర ఓట్లు వచ్చాయనే వివరాలను వెల్లడించింది.

తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలు (image from tsec.gov.in)
తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలు (image from tsec.gov.in)

ఏ పార్టీకి ఎంత శాతం..?

ఈ ఎన్నికల్లో మొత్తంగా కాంగ్రెస్‌కు 39.08 శాతం ఓట్లు పోలయ్యాయి. ఇక బీఆర్‌ఎస్‌కు 28.75 శాతం ఓట్లు రాగా… బీజేపీకి 15.67 శాతం దక్కాయి. స్వతంత్రులకు 8.30 శాతం, ఎంఐఎంకు 3.28 శాతం, ఫార్వర్డ్‌ బ్లాక్‌కు 1.5 శాతం, సీపీఐకి 1.3 శాతం, సీపీఎంకు 0.5 శాతం, జనసేనకు 0.3 శాతం ఓట్లు పోలయ్యాయి.

రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీల్లోని 2,582 వార్డుల్లో ఎన్నికలు జరిగగా…. వీటిలో కాంగ్రెస్‌ 1,347 వార్డుల్లో విజయం సాధించించింది. బీఆర్‌ఎస్‌ 717 వార్డుల్లో విజయం నమోదు చేయగా… బీజేపీ 261 వార్డుల్లో, స్వతంత్రులు 256 వార్డుల్లో గెలిచారు.

36 మున్సిపాలిటీల్లో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాకపోవడంతో హంగ్‌ ఏర్పడింది. ఇక్కడ ఎప్పటికప్పుడు సమీకరణాలు మారిపోతున్నాయి. స్వతంత్ర అభ్యర్థులు ప్రధాన పార్టీల వైపు చూస్తున్నారు. ఇప్పటికే ఆయా చోట్ల భారీగా క్యాంపు రాజకీయాలు నడుస్తున్నాయి.

ఇక 7 కార్పొరేషన్ల ఎన్నికల్లో రామగుండం, నల్గొండ, మంచిర్యాల కార్పొరేషన్లను హస్తం పార్టీ కైవసం చేసుకుంది. మిగతా చోట్ల హంగ్‌ ఏర్పడటంతో ఆయా కార్పొరేషన్ల ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. నిజామాబాద్ కార్పొరేషన్ లో అత్యధికంగా బీజేపీ సీట్లు గెలిచినప్పటికీ….. మ్యాజిక్ ఫిగర్ దాటలేకపోయింది. దీంతో ఇక్కడ కాంగ్రెస్ - ఎంఐఎం కలిసి మేయర్ పీఠాన్ని దక్కించుకునే అవకాశం ఉంది. కరీంనగర్ లో బీజేపీ మెజార్టీ స్థానాలను గెలుచుకుంది.

ఇక కొత్తగూడెంలో సీపీఐకి మద్దతు ఇస్తామని బీఆర్ఎస్ ప్రకటన చేసింది. అయితే కాంగ్రెస్ - సీపీఐ కలిసి మేయర్ పీఠాన్ని పంచుకునే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇక్కడి ఫలితంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More