Kondagattu Anjaneya Swamy Chandanotsavam : రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం, భక్తుల కోరికలు తీర్చే కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఒక అత్యంత అరుదైన, ఆధ్యాత్మిక ఘట్టానికి ఆలయ అధికారులు, అర్చక బృందం శ్రీకారం చుడుతున్నారు. అత్యంత పవిత్రమైన 'చందనోత్సవం' వేడుకను నిర్వహించేందుకు పూర్తిస్థాయిలో సన్నాహాలు చేస్తున్నారు. 60 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే నిర్వహించే ఈ మహాఘట్టం అనంతరం, భక్తులకు స్వామివారు తమ నిజరూపంలో దర్శనమివ్వనున్నారు.
ఈనెల 15 నుంచి చందనోత్సవం

ఈ నెల (నవంబర్) 15వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఐదు రోజుల పాటు ఆలయంలో చందనోత్సవం మరియు మహాసంప్రోక్షణ కార్యక్రమాలను వైభవంగా నిర్వహించనున్నారు.
కొండగట్టులో స్వయంభూగా వెలసిన ఆంజనేయ స్వామివారి గర్భగుడిలోని మూలవిరాట్‌కు గత 60 ఏళ్లుగా ప్రతి మంగళవారం, శనివారాల్లో నియమనిష్టలతో చందనం పూస్తూ వస్తున్నారు. ఈ సుదీర్ఘ కాలక్రమంలో స్వామివారి విగ్రహంపై చందనం సుమారు 7 అంగుళాల మందంలో పేరుకుపోయింది. దీనివల్ల స్వామివారి నిజరూప పరిపూర్ణ దర్శనం భక్తులకు కలగడం లేదు.
ఈ నేపథ్యంలోనే ఆలయ అధికారులు, వేద పండితులు మరియు అర్చకులు చర్చించి మూలవిరాట్టుపై పేరుకుపోయిన ఈ చందనాన్ని తొలగించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. దీనినే 'చందనోత్సవం' అని పిలుస్తారు.
ఆర్జిత సేవలు రద్దు
నవంబర్ 15 నుంచి 20 వరకు జరిగే ఈ పవిత్ర చందనోత్సవ ప్రక్రియ సాధారణంగా జరిగే పూజ కాదు. దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన దశమహావిద్యల సాధకులు, తాంత్రిక గురువులు, వేద రుత్వికులు, వివిధ పీఠాధిపతుల ప్రత్యక్ష ఆధ్వర్యంలో మరియు వారి శాస్త్రోక్త మంత్రోచ్ఛారణల మధ్య ఈ క్రతువు జరుగుతుంది. ఈ నేపథ్యంలో పలు రకాల ఆర్జిత సేవలు రద్దవుతాయి.
ఈ ఐదు రోజుల వ్యవధిలో గర్భగుడిలోని మూలవిరాట్ స్వామివారి దర్శనం ఎవరికీ లభించదు. ఎంతటి ప్రముఖులకైనా అంతరాలయ దర్శనాన్ని పూర్తిగా నిలిపివేస్తారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసే బాలాలయంలోనే స్వామివారి దర్శన భాగ్యం కల్పిస్తారు.
నిజరూప దర్శనం!
{{/usCountry}}ఈ ఐదు రోజుల వ్యవధిలో గర్భగుడిలోని మూలవిరాట్ స్వామివారి దర్శనం ఎవరికీ లభించదు. ఎంతటి ప్రముఖులకైనా అంతరాలయ దర్శనాన్ని పూర్తిగా నిలిపివేస్తారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసే బాలాలయంలోనే స్వామివారి దర్శన భాగ్యం కల్పిస్తారు.
నిజరూప దర్శనం!
{{/usCountry}}చందనోత్సవం, విశేష పూజలు మరియు మహాసంప్రోక్షణ ముగిసిన అనంతరం.. నవంబర్ 21వ తేదీ నుంచి భక్తులకు అంజన్న నిజరూప దర్శనం కలగనుంది. డిసెంబర్ 20వ తేదీ వరకు మాత్రమే భక్తులు ఆంజనేయ స్వామివారి నిజరూపాన్ని కళ్లారా చూసి తరించే అరుదైన అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మళ్లీ ఎప్పటిలాగే స్వామివారికి చందన సమర్పణ ప్రక్రియ ప్రారంభమవుతుంది.
"బాల్యదశలో ఈ చందనోత్సవాన్ని కనులారా చూసినవారు, మళ్లీ తమ జీవిత మలిదశలోనే ఈ భాగ్యాన్ని పొందుతారు. ఇది ఈ జన్మలో లభించే గొప్ప అదృష్టం," అని ఆలయ అర్చకులు వెల్లడించారు.
స్వామివారి నిజరూప దర్శనానికి భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉంది. ఈ మేరకు ఆలయంలో ఏర్పాట్లు చేస్తున్నారు. చందనోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు.