రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ నాగర్ కర్నూల్ జిల్లా పర్యటించారు. ఈ పర్యటనలో నాగర్ కర్నూల్ పట్టణంలోని ఎండబెట్ల దగ్గర ఉన్న కేసరి సముద్రం మీద హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం కోసం 10 కోట్ల రూపాయలతో శంకుస్థాపన పనులను మంత్రి దామోదర రాజనర్సింహ స్థానిక శాసన సభ్యుడు డా. రాజేష్ రెడ్డి , శాసన మండలి సభ్యుడు దామోదర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు.

నాగర్ కర్నూల్ మున్సిపల్ పరిథిలోని వివిధ వార్డులలో సీసీ రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థల నిర్మాణ పనుల కోసం రూ. లు 20 కోట్లతో శంకుస్థాపన చేశారు. 9 కోట్ల రూపాయలతో పట్టణంలోని జూనియర్ కాలేజీ నూతన కళాశాల భవన నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం నాగర్ కర్నూల్ పట్టణంలో 245 మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలను ఇందిరా మహిళా శక్తి పథకం 70,80,324 రూపాయల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ పర్యటనలో భాగంగా మెుత్తం 40 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు వైద్యారోగ్య శాఖ మంత్రి.
కీమోథెరపీ సెంటర్లు
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడారు. రాష్ట్రంలో 109 ట్రామా కేర్ సెంటర్లు ఏర్పాటు చేసినట్టుగా చెప్పారు. రాష్ట్రంలోని ప్రతీ ఆసుపత్రిలో క్యాన్సర్ రోగుల కోసం కీమోథెరపీ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్టుగా తెలిపారు. సభకు వచ్చిన విద్యార్థుల గురించి మంత్రి మాట్లాడారు.
'సమసమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలి. నైపుణ్యంతో కూడిన విద్యను అభ్యసించాలి. విద్యార్థుల చదువు సమాజ అభివృద్ధికి దోహదపడాలి. రాష్ట్రంలో 105 ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నాం.' అని మంత్రి దామోదర రాజనర్సింహ చెప్పారు.
100 శాతం ఉచిత వైద్యం
అంతకుముందు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు మంత్రి దామోదర రాజనర్సింహ. 'పేదోడికి కొండంత అండగా నిలిచే విప్లవాత్మక నిర్ణయం. ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వానికి ప్రధాన బాధ్యతగా 100 శాతం ఉచిత వైద్యం అందించే దిశగా త్వరలో సమగ్ర హెల్త్ పాలసీ అమలులోకి తీసుకురానున్నాం. ప్రతి కుటుంబానికి నాణ్యమైన వైద్య సేవలు.. ప్రతి పౌరుడికి ఆరోగ్య భద్రత.. ఇదే ప్రజా ప్రభుత్వ సంకల్పం.' అని మంత్రి పోస్ట్ చేశారు.
{{/usCountry}}అంతకుముందు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు మంత్రి దామోదర రాజనర్సింహ. 'పేదోడికి కొండంత అండగా నిలిచే విప్లవాత్మక నిర్ణయం. ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వానికి ప్రధాన బాధ్యతగా 100 శాతం ఉచిత వైద్యం అందించే దిశగా త్వరలో సమగ్ర హెల్త్ పాలసీ అమలులోకి తీసుకురానున్నాం. ప్రతి కుటుంబానికి నాణ్యమైన వైద్య సేవలు.. ప్రతి పౌరుడికి ఆరోగ్య భద్రత.. ఇదే ప్రజా ప్రభుత్వ సంకల్పం.' అని మంత్రి పోస్ట్ చేశారు.
{{/usCountry}}