జూన్ 8న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో చేప ప్రసాదం పంపిణీ.. ప్రత్యేక బస్సు సర్వీసులు!

జూన్ 8న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇందుకోసం ఆర్టీసీ బస్టాండ్లు, మెట్రో, రైల్వేస్టేషన్ల నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులు నడపాలన్నారు.

Published on: May 14, 2026 5:55 PM IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

జూన్ 8న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో చేపట్టే చేప ప్రసాదం పంపిణీపై హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో ఇంచార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో మంత్రులు వాకిటి శ్రీహరి, అజారుద్దీన్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ఫిషరీస్ కార్పొరేషన్ ఛైర్మన్ మెట్టు సాయి కుమార్, జిల్లా కలెక్టర్ ప్రియాంక, వివిధ విభాగాల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

మంత్రి పొన్నం ప్రభాకర్(ఫైల్ ఫొటో)
మంత్రి పొన్నం ప్రభాకర్(ఫైల్ ఫొటో)

జూన్ 8 మృగశిర కార్తె సందర్భంగా ప్రతి సంవత్సరం మాదిరి ఈసారి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం జరగనుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. వందల సంవత్సరాలుగా మృగశిర రోజు చేప ప్రసాదం పంపిణీ.. ప్రజల విశ్వాసాలకు అనుగుణంగా బత్తిని కుటుంబం చేస్తుందన్నారు. చేప ప్రసాదం పంపిణీకి ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు.

'పోలీస్, ట్రాఫిక్, రెవెన్యూ, జీహెచ్ఎంసీ, ఆర్అండ్‌బీ విభాగాలు కలిసి పనిచేయాలి. శానిటేషన్, బారికేడ్లను ఏర్పాటు చేయడం, విద్యుత్ ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి, తాగునీటి సరఫరా చేయాలి. ప్రభుత్వ విభాగాల అధికారులు చేసే ఏర్పాట్లతోపాటు ప్రతి సంవత్సరం అక్కడికి వచ్చే వారికి అగర్వాల్ సమాజ్, జైస్వాల్ సమాజ్, బత్తిని ట్రస్ట్‌లు ఆహారాన్ని అందించడం చేస్తున్నారు. ఈసారి వారి కార్యక్రమాలు కొనసాగించాలి.' అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.

చేప ప్రసాదం కోసం తెలంగాణ నలుమూలల జిల్లాల నుండి మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాలు విదేశాల నుండి కూడా చేప ప్రసాదం కోసం వస్తారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శాంతి భద్రతల సమస్య లేకుండా, క్యూలైన్‌లలో రద్దీ తోపులాట లేకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూసుకోవాలన్నారు. ఆర్టీసీ, మెట్రో ప్రధాన బస్ స్టేషన్‌లు, రైల్వే స్టేషన్ల నుండి ప్రత్యేక సర్వీసులు నడిపించాలన్నారు.

'రాత్రి పూట ఇబ్బందులు లేకుండా లైటింగ్ ఏర్పాటు చేయాలి. మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయాలి. స్టేజి, బ్యారికేడ్స్ ఏర్పాటు చేయాలి. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌తో పాటు పరిసరాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. గత సంవత్సరం చేసిన ఏర్పాట్లకు మించి చేయాలి. ఎన్ని చేపలు అవసరం ఉన్నాయో ఫిషరీస్ డిపార్ట్మెంట్ సిద్ధంగా ఉంచుకోవాలి.' అని పొన్నం ప్రబాకర్ అన్నారు.

ఈసారి లక్ష 25 వేల చేప పిల్లలు అందుబాటులో ఉంచుకున్నారని, అదనంగా కూడా అందుబాటులో ఉంచుకోవాలని అధికారులను ఆదేశించారు మంత్రి పొన్నం. 35 కౌంటర్లు ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు వేయాలన్నారు. ఐఅండ్‌ పీఆర్ సమాచార శాఖ అవసరమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందిస్తుండాలన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో గతంలో 3 ఫైర్ ఇంజన్లు పెట్టారని, అదనంగా కూడా అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More