తెలంగాణ ప్రభుత్వం జూన్ 2 నుంచి చేయూత పెన్షన్ పథకం తీసుకువస్తుంది. దీనిద్వారా కొత్తగా రెండు లక్షల మందికి పెన్షన్ పంపిణీ చేయనున్నారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు చేయూత పథకం ద్వారా ప్రభుత్వం అండగా నిలుస్తుంది. అర్హులైన వారు ఎలాంటి ఆలస్యం లేకుండా వివిధ పత్రాలను రెడీ చేసుకోవాలి. మూడు సంవత్సరాలుగా కొత్త పెన్షన్లు లేవు. దీంతో చాలా మంది దరఖాస్తులు చేసుకుంటున్నారు. గ్రామ పంచాయతీల్లో డాక్యుమెంట్లను ఇస్తున్నారు. అయితే ఈ పెన్షన్ల కోసం ఎలాంటి పత్రాలు కావాలో తెలుసుకోండి.

తెలంగాణలో కొత్తగా పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి క్రింది పత్రాలు తప్పనిసరిగా అవసరమవుతాయి. మీరు దరఖాస్తు చేసుకునే పెన్షన్ రకాన్ని బట్టి (వృద్ధాప్యం, వితంతువు, దివ్యాంగులు, గీత కార్మికులు మొదలైనవి) కావాల్సిన పత్రాలు కొద్దిగా మారుతుంటాయి.
సాధారణ పత్రాలు
అందరికీ కావలసిన సాధారణ పత్రాలు.. దరఖాస్తుదారుడి ఆధార్ కార్డు తప్పనిసరి, తెల్ల రేషన్ కార్డు నకలు వయస్సు ధృవీకరణ పత్రాలు(ముఖ్యంగా వృద్ధాప్య పెన్షన్ కోసం), ఓటర్ ఐడీ కార్డ్ లేదా పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాల సర్టిఫికేట్ (SSC Memo), బ్యాంక్ ఖాతా పుస్తకం జిరాక్స్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, స్థానికత/నివాస ధృవీకరణ(ఓటర్ కార్డ్ లేదా విద్యుత్ బిల్లు) ఉండాలి.
పెన్షన్ రకాన్ని బట్టి అదనంగా కావాల్సిన పత్రాలు
మీరు ఏ కేటగిరీ కింద అప్లై చేస్తున్నారో, దానికి సంబంధించిన ఈ క్రింది సర్టిఫికేట్లు జత చేయాలి. వితంతు పెన్షన్‌కి అప్లై చేస్తే పైన చెప్పిన డాక్యుమెంట్స్‌తోపాటుగా భర్త మరణ ధృవీకరణ పత్రం, దివ్యాంగుల పెన్షన్‌కు కనీసం 40 శాతం వైకల్యం ఉన్నట్లు తెలిపే సదరం సర్టిఫికేట్ ఉండాలి. నేత కార్మికులు చేనేత కార్మిక సంఘంలో రిజిస్ట్రేషన్ కలిగి ఉన్నట్లు పత్రం కావాలి. గీత కార్మికులకు గీత కార్మిక సహకార సంఘంలో సభ్యత్వ సర్టిఫికేట్ ఉండాలి. ఒంటరి మహిళలైతే.. వివాహం కాకుండా ఒంటరిగా ఉంటున్నట్లు లేదా భర్త వదిలేసినట్లు స్థానిక తహశీల్దార్ ఇచ్చిన సర్టిఫికేట్ కావాలి. బిడీ కార్మికులు గుర్తింపు కార్డ్(PF Account లేదా జీవనోపాధి సర్టిఫికేట్), ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులైతే యాంటీ రిట్రోవైరల్ థెరపీ (ART) కేంద్రం జారీ చేసిన మెడికల్ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలి.
పైన పేర్కొన్న పత్రాలతో పాటు పూర్తి చేసిన పెన్షన్ దరఖాస్తు ఫారమ్‌ను తీసుకుని సమీపంలోని మీసేవ కేంద్రం ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా మీ పరిధిలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో (సర్పంచ్/సెక్రటరీ) లేదా మున్సిపల్ వార్డు ఆఫీసులో దరఖాస్తును సమర్పించవచ్చు.
{{/usCountry}}పైన పేర్కొన్న పత్రాలతో పాటు పూర్తి చేసిన పెన్షన్ దరఖాస్తు ఫారమ్‌ను తీసుకుని సమీపంలోని మీసేవ కేంద్రం ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా మీ పరిధిలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో (సర్పంచ్/సెక్రటరీ) లేదా మున్సిపల్ వార్డు ఆఫీసులో దరఖాస్తును సమర్పించవచ్చు.
{{/usCountry}}