...
...
Next Story

చికెన్ ధరలు పైపైకి....! సంక్రాంతి వేళ మరింత పెరిగే ఛాన్స్

హైదరాబాద్ తో సహా రాష్ట్రవ్యాప్తంగా చికెన్ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. కిలో కేజీ రూ. 300కిపైగా పలుకుతోంది. హైదరాబాద్ మార్కెట్‌లో కేజీ స్కిన్‌లెస్ చికెన్ ధర ఏకంగా రూ. 310 కి చేరుకుంది.

Published on: Jan 04, 2026 11:33 AM IST
Advertisement

చికెన్ ధరలు కొండెక్కాయి. డిసెంబర్ నుంచి క్రమంగా ధరలు పెరుగుతూనే వస్తున్నాయి. న్యూఇయర్ వేళ కూడా ఇదే మాదిరి ధరలు ఉండగా… తాజాగా మరికొంత పెరిగే దిశగా వెళ్తోంది. చలికాలం ప్రభావం, పెరిగిన డిమాండ్‌తో ఏకంగా కిలో కేజీ రూ. 300కి చేరిపోయింది.

మాంసప్రియులకు బ్యాడ్ న్యూస్- కొండెక్కిన చికెన్ ధరలు, కిలో రూ.300!
మాంసప్రియులకు బ్యాడ్ న్యూస్- కొండెక్కిన చికెన్ ధరలు, కిలో రూ.300!

హైదరాబాద్ మార్కెట్‌లో చికెన్ ధర కొంచెం ఎక్కువగానే ఉంది. ఇవాళ కేజీ (స్కిన్‌ లెస్) చికెన్ ధర ఏకంగా రూ. 300 దాటిపోయింది. కొన్ని ఏరియాలో కిలో కేజీ చికెన్ రూ. 310 వరకు ఉంది. ఈ సీజన్‌లో నమోదైన అత్యధిక ధర ఇదేనని వ్యాపారులు చెబుతున్నారు.

ధరలు పెరిగే ఛాన్స్…!

మరోవైపు సంక్రాంతి పండగ కూడా సమీపిస్తోంది. దీనికితోడు డిమాండ్ కు తగ్గ ఉత్పత్తి తక్కువగా ఉండటంతో…ధరలు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. హైదరాబాద్ మినహాయిస్తే… ఇతర ప్రాంతాల్లో గత వారంలో ఉన్న ధరలే అమల్లో ఉన్నాయి.

ఇతర జిల్లాల్లో కిలో చికెన్ రూ. 300 వరకు పలుకుతోంది. కొన్నిచోట్ల మాత్రమే రూ. 290 వరకు విక్రయిస్తారు. రాబోయే రోజుల్లో స్వల్పంగా ధరలు పెరిగే సూచనలున్నాయి.

నిజానికి గత కొద్దిరోజులుగా కోడిగుడ్లు, చికెన్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. కార్తీక మాసం ముగిసిన తర్వాత… చికెన్ కు డిమాండ్ కూడా పెరిగింది. దీనికితోడు వరుస పండగలు వస్తుండటంతో… ధరలు పైపైకి వెళ్తున్నాయి. పైగా డిమాండ్‌కు తగ్గట్లుగా పౌల్ట్రీ ఉత్పత్తి లేకపోవడంతో సరఫరా దెబ్బతిని ధరలు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఇదే పరిస్థితులు కొనసాగితే… కిలో చికెన్ రూ. 350 వరకు చేరవచ్చని చికెన్ వ్యాపారులు చెబుతున్నారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe