జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో మూడు రోజుల హనుమాన్ చిన్న జయంతి జాతర బుధవారం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ వేడుకకు సుమారు 3 లక్షల మంది భక్తులు పాల్గొనే అవకాశం ఉంది. దీనికోసం విస్తృత ఏర్పాట్లు చేశారు. హనుమాన్ దీక్ష తీసుకున్న భక్తులు కొన్ని రోజుల కిందటి నుంచే ఆలయానికి చేరుకోవడం ప్రారంభించారు, పాదయాత్రగా కూడా కొందరు వస్తున్నారు.

ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్, ఇతర జిల్లాల నుండి భారీ సంఖ్యలో భక్తులు ఆలయాన్ని సందర్శించుంకుంటున్నారు. క్యూ లైన్లు హనుమాన్ దీక్షా స్వాములతో నిండిపోయాయి. జయంతి సందర్భంగా హనుమాన్ మాల విరమణలు కూడా జరుగుతున్నాయి.
41 రోజులపాటు కఠిన దీక్షలు చేపట్టిన స్వాములు కొండగట్టుకు చేరుకుని.. అంజన్నకు ఇరుముడులు సమర్పిస్తున్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూ లైన్లలో నిల్చుంటున్నారు. జైశ్రీరామ్, జై హనుమాన్ అనే నామస్మరణతో కొండగట్టు మార్మోగుతోంది. కొండగట్టు లో వెలసిన అంజన్నా.. నీ అండా దండా మాకుండాలని, పూలూ పండ్లు కొబ్బరికాయలు పలహారాలు నీకు తెస్తిమయ్యా అంటూ స్వాములు పాటలు పాడుతున్నారు. కొండగట్టు కేసరి వర్ణంగా మారిపోయింది.
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని.. కొండగట్టుపై వాహనాల రాకపోకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. ఘాట్ రోడ్లలో ప్రమాదాలు జరక్కుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. నిరంతరం నిఘా పెడుతున్నారు.
మరోవైపు బుధవారం కోనేరు సమీపంలోని కళ్యాణకట్ట వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక పందిరి కూలిపోవడంతో కొందరు భక్తులు గాయపడ్డారు. నాసిరకం పనుల కారణంగానే పందిరి కూలిపోయిందని భక్తులు ఆరోపించారు.
భారీ గాలుల కారణంగా పందిరిలో కొంత భాగం ఒరిగిపోయిందని, అయితే ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని ఆలయ కార్యనిర్వాహక అధికారి అంజనా రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జాతరను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు 1000 మంది పోలీసు సిబ్బందిని మోహరించి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
{{/usCountry}}భారీ గాలుల కారణంగా పందిరిలో కొంత భాగం ఒరిగిపోయిందని, అయితే ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని ఆలయ కార్యనిర్వాహక అధికారి అంజనా రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జాతరను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు 1000 మంది పోలీసు సిబ్బందిని మోహరించి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
{{/usCountry}}ప్రధాన ద్వారం, పార్కింగ్ స్థలాలు, ఇతర ప్రాంతాలతో సహా ఆలయ ప్రాంగణంలో బాంబు, డాగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీలు నిర్వహించాయి.