రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే చాలా మంది ఈ కార్డులు పొందారు. మరికొందరూ దరఖాస్తు చేసుకోగా… పరిశీలన దశలో ఉన్నాయి. ఇక పాత కార్డులో కూడా పేర్ల నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. మీ-సేవా ద్వారా ఈ ప్రాసెస్ పూర్తి చేసుకుంటున్నారు.

కొత్తగా కార్డు పొందినవారితో పాటు పేర్లు ఎక్కిన వాళ్లు ప్రతి నెలా రేషన్ తీసుకుంటున్నారు. అయితే కొత్తగా పేర్లు నమోదు చేసుకున్నవారిలో చాలా మంది ఈకేవైసీ పూర్తి చేసుకోలేదు. అయితే ఈ విషయంపై ఇప్పటికే పలుమార్లు పౌరసరఫరాలశాఖ అధికారులు ప్రకటనలు కూడా చేశారు. రేషన్ కార్డు దారులందరూ ఈ-కేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలని సూచించారు.
ఇటీవలే రేషన్ కార్డు ఈకేవైసీకి సంబంధించి కొన్ని వార్తలు వైరల్ గా మారాయి. ఈకేవైసీ చేసుకోకపోతే జనవరి నుంచి రేషన్ కట్ చేస్తారని ఇందులో ఉంది. ఇదే అంశంపై పౌరసరఫరాలశాఖ క్లారిటీ ఇచ్చింది. ఈ-కేవైసీ చేసుకోకుంటే రేషన్ బియ్యం నిలిపివేస్తారని… కార్డులు రద్దు అవుతాయని వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది. ఈ విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని సూచించింది.
తప్పనిసరిగా చేసుకోవాల్సిందే…!
ఈకేవైసీ కోసం గడువంటూ ఏం లేకపోయినప్పటికీ తప్పకుండా ఈ ప్రాసెస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ చేసుకోవడం మాత్రం తప్పనిసరి అని అధికారులు గుర్తు చేస్తున్నారు. ఈ విషయంలో నిర్లక్ష్యం వహించకుండా… సమీపంలోని రేషన్ షాపు వద్దకు వెళ్లి ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నారు.
వేలిముద్రల విషయంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే… అలాంటి వారు ముందుగా ఆధార్ కేంద్రానికి వెళ్లి తమ బయోమెట్రిక్ వివరాలను, ఫోన్ నంబర్‌ను అప్డేట్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. వేలిముద్రలు అస్సలు పడని పక్షంలో, ఐరిష్ ఆధారంగా కేవైసీ పూర్తి చేసే సదుపాయం కూడా అందుబాటులో ఉంది.
{{/usCountry}}వేలిముద్రల విషయంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే… అలాంటి వారు ముందుగా ఆధార్ కేంద్రానికి వెళ్లి తమ బయోమెట్రిక్ వివరాలను, ఫోన్ నంబర్‌ను అప్డేట్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. వేలిముద్రలు అస్సలు పడని పక్షంలో, ఐరిష్ ఆధారంగా కేవైసీ పూర్తి చేసే సదుపాయం కూడా అందుబాటులో ఉంది.
{{/usCountry}}ఈ–కేవైసీ ప్రక్రియను చేపట్టడం వెనక చాలా కారణాలున్నాయి. నిజమైన లబ్ధిదారులకు మాత్రమే రేషన్ బియ్యం అందే అవకాశం ఉంటుంది. అక్రమాలకు దాదాపుగా అడ్డుకట్ట పడుతుంది. కాబట్టి…ఈ విషయంపై పౌరసరఫరాలశాఖ అధికారులు పదే పదే అవగాహన కల్పిస్తున్నారు.