తెలంగాణలో ఆర్టీసీ కార్మిక లోకం అట్టుడుకుతోంది. వరంగల్ జిల్లా నర్సంపేట బస్ డిపో డ్రైవర్ శంకర్ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయడంతో మరింత ఆందోళన పెరిగింది. అయితే తమ సమస్యల పరిష్కారం కోసం పోరాట బాట పట్టిన కార్మికులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.

కేబినెట్ భేటీలో సీఎం రేవంత్‌రెడ్డి ఆర్టీసీ అంశంపై ప్రత్యేకంగా మాట్లాడారు. "కార్మికులు ఎవరూ తొందరపడి ప్రాణాలు తీసుకోవద్దు.. ఆత్మహత్యలు సమస్యకు పరిష్కారం కావు" అంటూ ఆయన విజ్ఞప్తి చేశారు. సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధితో ఉందని, ప్రతి కార్మికుడి శ్రేయస్సు తమకు ముఖ్యమని స్పష్టం చేశారు. ఈ మేరకు శుక్రవారం కార్మిక సంఘాలతో చర్చలు జరపాలని మంత్రులను ఆదేశించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలోని మంత్రుల బృందం కార్మికులతో ముఖాముఖి భేటీ కానుంది.
మరోవైపు, ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు తగ్గేదే లేదని ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. ఈయూ ఆఫీసులో సమావేశమైన జేఏసీ నేతలు వెంకన్న, థామస్‌రెడ్డి షెడ్యూల్‌ను విడుదల చేశారు:
24న: అన్ని డిపోల ముందు 'మౌన ప్రదర్శన'.
25న: డిపోల్లోనే 'వంటా-వార్పు'.
26న: జిల్లాల వారీగా 'కార్మిక కవాతు'.
27న: ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు.. మహిళా ఉద్యోగుల ఆధ్వర్యంలో 'బతుకమ్మ నిరసన'.
29న: డిపోల ముందు 'అర్ధనగ్న ప్రదర్శనలు'.
ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించడం ఒక సానుకూల పరిణామం అయితే.. జేఏసీ ప్రకటించిన వరుస నిరసనలు ఉత్కంఠను రేపుతున్నాయి. మంత్రుల కమిటీ చర్చల తర్వాత ఆర్టీసీలో సమ్మె నీడలు తొలగిపోతాయా? లేదా నిరసనలు మరింత కొనసాగుతాయా? అన్నది వేచి చూడాలి.
డ్రైవర్ ఆత్మహత్యాయత్నం
రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ 22వ తేదీ నుంచి సమ్మె నడుస్తోంది. బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. మరోవైపు ఆర్టీసీ ఉద్యోగులు చాలా చోట్ల నిరసనలు చేపట్టారు. అయితే నిరసనలో భాగంగా వరంగల్ జిల్లా నర్సంపేట ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్న కోలా శంకర్ గౌడ్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు.
{{/usCountry}}రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ 22వ తేదీ నుంచి సమ్మె నడుస్తోంది. బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. మరోవైపు ఆర్టీసీ ఉద్యోగులు చాలా చోట్ల నిరసనలు చేపట్టారు. అయితే నిరసనలో భాగంగా వరంగల్ జిల్లా నర్సంపేట ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్న కోలా శంకర్ గౌడ్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు.
{{/usCountry}}ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయకుండా కాలయాపన చేయడాన్ని నిరసిస్తూ.. నర్సంపేట బస్టాండ్ ఎదుట శంకర్ గౌడ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆయనను వరంగల్‌లోని ఆసుపత్రికి తరలించారు.
శంకర్ గౌడ్‌కు తీవ్రమైన కాలిన గాయాలవ్వడంతో వరంగల్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రభుత్వంలో విలీనాన్ని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ ఉద్యోగులు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడుతున్నారు. పలు డిపోల వద్ద ప్రదర్శనలు చేశారు.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్ఆర్టీసీ) యూనియన్లు, జాయింట్ యాక్షన్ కమిటీ(జేఏసీ) ఆధ్వర్యంలో ఏప్రిల్ 22 నుంచి రాష్ట్రవ్యాప్త సమ్మె కొనసాగుతోంది. దీంతో తెలంగాణ ప్రజా రవాణా వ్యవస్థలో అంతరాయం కలిగింది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదులపై ప్రభుత్వ యంత్రాంగంతో వారాల తరబడి జరిపిన చర్చలు విఫలమైన తర్వాత సమ్మెకు పిలుపునిచ్చారు. జేఏసీ 32 డిమాండ్లను ప్రవేశపెట్టింది. అయితే ప్రభుత్వం ఇందులో 29 డిమాండ్లు ఓకే.. మిగిలినవాటి గురించి చర్చిద్దామని చెబుతోంది.