కృష్ణా నదీ జలాల పంపిణీలో తెలంగాణ రక్షిత నీటి హక్కులను పరిరక్షించేందుకు, రాష్ట్రానికి రావాల్సిన న్యాయమైన వాటాను సాధించేందుకు సుప్రీంకోర్టులో అత్యంత సమర్థంగా వాదనలు వినిపించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌తో ఉన్న అన్ని రకాల జల వివాదాలపై పక్కా ఆధారాలు…. స్పష్టమైన గణాంకాలను అత్యున్నత న్యాయస్థానానికి సమర్పించాలని సూచించారు.
ఈనెల 18వ తేదీన విచారణ…

ఈ నెల 18వ తేదీ తర్వాత సుప్రీంకోర్టులో కృష్ణా జలాల వివాదంపై కీలక విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో డాక్టర్ ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో నీటిపారుదల శాఖపై ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. అంతకుముందు న్యాయ నిపుణులతో ఆయన సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమీక్షలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సి.ఎస్. వైద్యనాథన్, అడ్వకేట్ జనరల్ ఎ. సుదర్శన్ రెడ్డి, నీటిపారుదల శాఖ సలహాదారుతో పాటు శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
మరోవైపు పాలమూరు పరిధిలోని డిండి, అచ్చంపేట ఎత్తిపోతల పథకాల పనులను వేగవంతం చేయాలని ఇంజినీర్లను సీఎం ఆదేశించారు. గతంలో నిర్ణయించిన ప్రణాళిక ప్రకారమే ఏదుల రిజర్వాయర్ నుంచి డిండి, అచ్చంపేట పథకాలకు సాగునీరు అందించాలని స్పష్టం చేశారు. ఈ రెండు ప్రాజెక్టుల నిర్వహణకు అవసరమైన 0.6 టీఎంసీల నీటిని నార్లపూర్ నుంచి ఏదుల వరకు ఎలాంటి అడ్డంకులు లేకుండా తరలించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ఎక్కడ టన్నెల్ నిర్మించాలి, ఎక్కడ కాలువ తవ్వాలనే అంశాలపై సమగ్ర అధ్యయనం చేసి తక్షణమే సమగ్ర ప్రాజెక్టు నివేదిక (DPR) సిద్ధం చేయాలని, దానికి అనుగుణంగా పనులు ప్రారంభించాలని స్పష్టం చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టు అదనపు టీఎంసీ పనుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని అధికారులను ముఖ్యమంత్రి గట్టిగా హెచ్చరించారు. "గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులు మళ్లీ పునరావృతం కాకూడదు, ప్రతి విషయంలో అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలి" అని సూచించారు.
{{/usCountry}}కాళేశ్వరం ప్రాజెక్టు అదనపు టీఎంసీ పనుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని అధికారులను ముఖ్యమంత్రి గట్టిగా హెచ్చరించారు. "గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులు మళ్లీ పునరావృతం కాకూడదు, ప్రతి విషయంలో అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలి" అని సూచించారు.
{{/usCountry}}ప్రస్తుతం అందుబాటులో ఉన్న రెండు టీఎంసీల నీటినే పూర్తిగా తరలించలేని పరిస్థితి నెలకొన్నందున….. అదనపు టీఎంసీ పనులపై బాధ్యతాయుతంగా ముందడుగు వేయాలని స్పష్టం చేశారు. ముందుగా సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న వివిధ కేసుల పురోగతిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే భూసేకరణ ప్రక్రియ చేపట్టాలని ఆదేశించారు. అలాగే కేంద్ర జల సంఘం నుంచి అవసరమైన అన్ని రకాల చట్టబద్ధమైన అనుమతులు సాధించడంతో పాటు పక్కాగా డీపీఆర్ సిద్ధం చేసుకోవాలని స్పష్టం చేశారు.