...
...
Next Story

దావోస్‌లో మన ప్రణాళికలను ప్రపంచానికి పరిచయం చేయండి - సీఎం రేవంత్ రెడ్డి

రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి దోహదపడే పెట్టుబడులను సాధించడమే లక్ష్యంగా దావోస్ పర్యటన ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తెలంగాణ రైజింగ్ విజన్ 2047 తో పాటు సంబంధిత ప్రణాళికలను ప్రపంచానికి పరిచయం చేయాలని సూచించారు.

Published on: Jan 10, 2026, 15:02:42 IST
Advertisement

రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి దోహదపడే పెట్టుబడులను సాధించడమే ధ్యేయంగా దావోస్‌ పర్యటన ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం (ప్రపంచ ఆర్థిక సదస్సు)–2026 సదస్సులో తెలంగాణ రైజింగ్ 2047 విజన్‌ను, దానికి అనుగుణంగా రూపొందించిన క్యూర్ (CURE), ప్యూర్ (PURE), రేర్ (RARE) ప్రణాళికలను ప్రపంచానికి పరిచయం చేయాలని అధికారులకు నిర్దేశించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 3 ట్రిలియన్ డాలర్ల స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో ప్రభుత్వం పూర్తి నిబద్ధతతో ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గడిచిన రెండేళ్లలో దావోస్‌ ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా రాష్ట్రానికి లభించిన పెట్టుబడి హామీలు, ప్రతిపాదనల పురోగతితో పాటు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్–2025లో ఆకర్షించిన పెట్టుబడులు ఇప్పటివరకు ఏ స్థాయిలో అమలయ్యాయనే అంశాలను ముఖ్యమంత్రి సమీక్షించారు.

మన సామర్థ్యాలను వినియోగించుకోండి - సీఎం రేవంత్

పెట్టుబడుల ఆకర్షణలో తెలంగాణకు ఇప్పటికే ఉన్న బలాలు, సామర్థ్యాలను మరింతగా వినియోగించుకోవాలన్నారు. మూడంచెల ఆర్థిక వృద్ధిని వేగవంతం చేసేలా రూపొందించిన క్యూర్ , ప్యూర్ , రేర్ ప్రణాళికలను తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం దావోస్ వేదికగా ప్రపంచానికి వివరిస్తుందని పేర్కొన్నారు.

“స్పిరిట్ ఆఫ్ డైలాగ్” అనే థీమ్‌తో వరల్డ్ ఎకనామిక్ ఫోరం–2026 సమ్మిట్ జనవరి 19 నుంచి 23 వరకు దావోస్‌లో జరగనుంది. గతంలో పెట్టుబడిదారులతో చేసుకున్న ఒప్పందాలను పునఃసమీక్షించి… వాటి అమలుపై ఫాలోఅప్ చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇన్వెస్ట్మెంట్ గ్రౌండింగ్‌లో ఏవైనా సమస్యలు లేదా అడ్డంకులు ఉంటే వాటిని వెంటనే పరిష్కరించాలని సూచించారు.

మరోవైపు ఈ నెల 19 నుంచి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలోని బృందం స్విట్జర్లాండ్‌లోని దావోస్‌ వెళ్లనుంది. అక్కడ ఈ నెల 23 వరకు జరగనున్న ‘ప్రపంచ ఆర్థిక వేదిక’ వార్షిక సదస్సులో వివిధ వాణిజ్య సంస్థలతో జరిగే సమావేశాలు, చర్చల్లో ముఖ్యమంత్రి పాల్గొంటారు.

తెలంగాణ ఆర్థికాభివృద్ధికి, ఉద్యోగ, ఉపాధి కల్పనకు దోహదపడేలా పెట్టుబడులను తీసుకురావడం, వ్యూహాత్మక భాగస్వామ్యాలను చేసుకోవడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన కొనసాగనుంది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks