Bandi Bhagirath POCSO Case : కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడిపై నమోదైన పోక్సో కేసుపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో బండి భగీరథ్‌పై నమోదైన కేసుపై తక్షణమే దర్యాప్తు ప్రారంభించాలని డీజీపీ సీవీ ఆనంద్‌ను ఆదేశించారు. ఈ నెల 8వ తేదీనే ఫిర్యాదు అందినప్పటికీ…. నిందితుడిపై చర్యలు తీసుకోవడంలో జాప్యం జరగడంపై ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేశారు.

డీజీపీ సీవీ ఆనంద్ ఈ కేసులోని పూర్వాపరాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వివరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో పోలీసు బలగాలన్నీ భద్రతా ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నాయని…. ఆ కారణం చేతనే కేసు దర్యాప్తులో కొంత జాప్యం జరిగిందని డీజీపీ ముఖ్యమంత్రికి వివరణ ఇచ్చారు.
అయితే ఈ వివరణపై స్పందించిన ముఖ్యమంత్రి…. కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకుని సమగ్ర విచారణ కోసం ప్రత్యేక బృందాలను (Special Teams) ఏర్పాటు చేయాలని ఆదేశించారు. చట్టం ముందు అందరూ సమానమేనని… ఎటువంటి పక్షపాతం లేకుండా విచారణ జరిపి నివేదిక సమర్పించాలని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో… బండి భగీరథ్ కేసు విచారణ వేగవంతం కానుంది. ప్రత్యేక బృందాలు ఈ కేసులోని సాక్ష్యాధారాలను సేకరించి, నిందితులపై తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
ఆరోపణలు ఏంటి..?
ఈ కేసులో ఫిర్యాదు చేసిన 17 ఏళ్ల మైనర్ బాలిక కథనం ప్రకారం.. గతేడాది డిసెంబర్ 31వ తేదీన మొయినాబాద్‌లోని ఒక ఫామ్‌హౌస్‌లో భగీరథ్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలు 10వ తరగతి మధ్యలోనే ఆపేసిన విద్యార్థినిగా గుర్తించారు. ఆమె కుటుంబ సభ్యులు పెట్‌బషీరాబాద్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయడంతో.. బాలిక వయస్సును ధృువీకరించుకున్న పోలీసులు… పోక్సో చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు బుక్ చేశారు.
మరోవైపు ఈ కేసులో ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. ఈ పోక్సో కేసు నమోదు కావడానికి ఒక రోజు ముందే బండి భగీరథ్ కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో సదరు బాలిక కుటుంబంపై ఫిర్యాదు చేశారు. తనను స్నేహం పేరుతో ట్రాప్ చేసి…. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చారని పేర్కొన్నాడు. తాను నిరాకరించడంతో రూ. 5 కోట్లు ఇవ్వాలని బ్లాక్మెయిల్ చేస్తున్నారని తన ఫిర్యాదులో ప్రస్తావించాడు.
{{/usCountry}}మరోవైపు ఈ కేసులో ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. ఈ పోక్సో కేసు నమోదు కావడానికి ఒక రోజు ముందే బండి భగీరథ్ కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో సదరు బాలిక కుటుంబంపై ఫిర్యాదు చేశారు. తనను స్నేహం పేరుతో ట్రాప్ చేసి…. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చారని పేర్కొన్నాడు. తాను నిరాకరించడంతో రూ. 5 కోట్లు ఇవ్వాలని బ్లాక్మెయిల్ చేస్తున్నారని తన ఫిర్యాదులో ప్రస్తావించాడు.
{{/usCountry}}ప్రస్తుతానికి పోలీసులు రెండు ఫిర్యాదులను వేర్వేరుగా దర్యాప్తు చేస్తున్నారు. పెట్‌బషీరాబాద్ పోలీసులు లైంగిక దాడి ఆరోపణలపై విచారణ జరుపుతున్నారు. ఇదే సమయంలో కరీంనగర్ టూ టౌన్ పోలీసులు కూడా రంగంలోకి దిగారు.
ఇదిలా ఉంటే కేంద్రమంత్రి సంజయ్ కుమారుడు భగీరథ్ ను కాపాడేందుకు కాంగ్రెస్ సర్కార్ ప్రయత్నిస్తోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఈ కేసులోని నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తోంది. కేసు నమోదైనప్పటికీ… ఇప్పటి వరకు నిందితుడిని ఎందుకు అదుపులోకి తీసుకోలేదని ప్రశ్నిస్తోంది. బాధితులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని… అవసరమైతే న్యాయపోరాటం చేస్తామని కూడా ఆ పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు.