...
...
Next Story

Konda Surekha : గవర్నర్ కార్యాలయానికి లేఖ..! కేబినెట్ నుంచి కొండా సురేఖ బర్తరఫ్...?

తెలంగాణ మంత్రివర్గం నుంచి కొండా సురేఖ బర్తరఫ్ కు రంగం సిద్ధమైంది. సీఎం ఆఫీస్ నుంచి గవర్నర్‌కు అధికారికంగా సిఫార్సు లేఖ పంపడంతో లోక్ భవన్ నుంచి ఈ నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.

Published on: Sep 3, 2026, 15:07:59 IST
Advertisement

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న కొండ సురేఖపై వేటుకు లైన్ క్లియర్ అయింది. ఏఐసీసీ నుంచి గ్రీన్ సిగ్నల్ రావటంతో…. ఆమెను రాష్ట్ర మంత్రివర్గం నుంచి తక్షణమే తొలగించాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డి లోక్ భవన్ (గవర్నర్ కార్యాలయం) కు లేఖ రాసినట్లు సమాచారం. ఈ లేఖ లోక్ భవన్ కార్యాలయానికి చేరటంతో… గవర్నర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అధికారికంగా బర్తరఫ్ చేస్తూ ఉత్తర్వులు రావాల్సి ఉంటుంది.

కొండా సురేఖ
కొండా సురేఖ

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పలువురిని ఉద్దేశించి మంత్రి కొండా సురేఖ, ఆమె కుటుంబ సభ్యులు చేసిన తీవ్ర వ్యాఖ్యలు, వివాదాస్పద వ్యవహారాల నేపథ్యంలో ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారన్న కారణంతో కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సీఎం రేవంత్ రెడ్డి ఈ చర్యకు ఉపక్రమించారు.

చిన్నారెడ్డిపై వేటు…

ఈ బర్తరఫ్ వేటుతో పాటు ప్రభుత్వ పరిపాలనా యంత్రాంగంలోనూ రేవంత్ రెడ్డి సర్కార్ కీలక మార్పులు చేసింది. తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా మండలి ఉపాధ్యక్షుడిగా సేవలు అందిస్తున్న డాక్టర్ జి. చిన్నారెడ్డి నియామకాన్ని ప్రభుత్వం తక్షణమే రద్దు చేసింది. ఆయనపై కూడా క్రమశిక్షణ కమిటీ నివేదికను పరిశీలించిన అధినాయకత్వం… వేటు వేసేందుకు మొగ్గు చూపింది. దీంతో ఆయన స్థానంలో జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్ గద్వాల విజయలక్ష్మిని ప్రణాళికా మండలి నూతన ఉపాధ్యక్షురాలిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

మరోవైపు వరంగల్ ప్రాంతంలో అత్యంత కీలకమైన కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (KUDA) ఛైర్‌పర్సన్‌గా మాజీ రాజ్యసభ సభ్యురాలు జి. సుధారాణిని ప్రభుత్వం నియమించింది. ఇక రాష్ట్ర మహిళా కమిషన్ నూతన ఛైర్‌పర్సన్‌గా నేరెళ్ల శారదను నియమించారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe