ఫ్యూచర్‌ సిటీ పోలీస్ కమిషనరేట్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

సీఎం రేవంత్ రెడ్డి భారత్ ఫ్యూచర్‌ సిటీలో పర్యటించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనరేట్ ప్రారంభించారు. అంతేకాదు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని సందర్శించారు.

Published on: Oct 19, 2026, 22:06:30 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

భారత్ ఫ్యూచర్ సిటీ పర్యటనలో భాగంగా ఇబ్రహీంపట్నంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం పోలీస్ కమిషనర్ తరుణ్ జోషీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఫ్యూచర్ సిటీ సీపీ తరుణ్ జోషిని వేదమంత్రాల నడుమ కుర్చీలో కూర్చోబెట్టారు.

ఫ్యూచర్‌ సిటీ పోలీస్ కమిషనరేట్‌ ప్రారంభం
ఫ్యూచర్‌ సిటీ పోలీస్ కమిషనరేట్‌ ప్రారంభం

ఈ కార్యక్రమంలో ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, శాసనసభ్యులు మల్‌రెడ్డి రంగారెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు, డీజీపీ సీవీ ఆనంద్, ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ జోషీతో పాటు ఇతర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అర్బన్‌ మేనేజ్‌మెంట్

భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్మించనున్న నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అర్బన్‌ మేనేజ్‌మెంట్ (NIUM) నూతన ప్రాంగణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. రూ. 200 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న ఈ ప్రాంగణం కోసం ప్రభుత్వం ఫ్యూచర్ సిటీలో 20 ఎకరాల భూమి కేటాయించింది.

2009లో జవహర్‌లాల్ నెహ్రూ జాతీయ పట్టణ పునరుద్ధరణ మిషన్(JNNURM) కింద ఎంపికైనప్పటికీ NIUM హైదరాబాద్‌కు రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించని కారణంగా ఇంతకాలం వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా ప్రభుత్వం ఫ్యూచర్ సిటీలో 20 ఎకరాలు కేటాయించింది.

తెలంగాణలో పట్టణ విధానాల రూపకల్పనకు, కార్యాచరణ ఆధారిత పరిశోధన సంస్థగా ఎన్ఐయూఎం కీలకంగా పనిచేస్తుంది. 2028 జూన్ 2 నాటికి ప్రాంగణ నిర్మాణాన్ని పూర్తి చేసి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున ప్రారంభించుకోవాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ(FCDA) ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

అంతకుముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ భవనాల నిర్మాణాలు, పరిసర ప్రాంతాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More