...
...
Next Story

కొత్తగా 4.5 లక్షల పింఛన్లు - ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణలో 2034 నాటికి కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే తన జీవిత ఆశయమని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. కొత్తగా 4.5 లక్షల పింఛన్ల పంపిణీకి శ్రీకారం చుట్టారు.

Published on: Nov 8, 2026, 17:35:58 IST
Advertisement

ఆడపిల్లలు సమాజంలో ఉన్నతస్థాయికి చేరాలంటే విద్య అత్యంత కీలకమని సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. ప్రతీ మహిళా తమ పిల్లలను తప్పనిసరిగా చదివిస్తామని ప్రమాణం చేయాలని కోరారు. 2034 సంవత్సరం నాటికి రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా మార్చడమే తన ప్రధాన జీవిత లక్ష్యమని ఆయన ఘంటాపథంగా ప్రకటించారు.

పింఛన్ల పంపిణీకి శ్రీకారం

కొడంగల్ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి

దీపావళి పండుగ శుభవేళ రాష్ట్రంలోని వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులు, నేత మరియు గీత కార్మికులకు నూతనంగా 4.5 లక్షల పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించారు. అర్హులైన ప్రతీ ఒక్కరికీ సంతృప్తికర స్థాయిలో సంక్షేమ ఫలాలు అందించాలనే దృఢ సంకల్పంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

దీపావళి పండుగ వేళ తన పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని కొడంగల్ నియోజకవర్గ పరిధిలోని హకీంపేట్ ఇండస్ట్రియల్ హబ్‌లో స్వయం సహాయక సంఘాల మహిళలతో ఏర్పాటు చేసిన ముఖాముఖి కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.

మీరే నా కుటుంబం - సీఎం రేవంత్ భావోద్వేగం

ఈ సందర్భంగా మహిళలను ఉద్దేశించి సీఎం మాట్లాడుతూ.. "నా ఆడబిడ్డల ఆనందంలో తోడుగా ఉండాలని, ఒక తోడబుట్టిన సోదరుడిగా మీకు సేవ చేసే అమూల్యమైన అవకాశాన్ని భగవంతుడు నాకు అందించారు. ఆడబిడ్డల సర్వతోముఖాభివృద్ధికి నిరంతరం శ్రమిస్తాను. నా ఈ జన్మదినాన్ని రాష్ట్ర మహిళా శక్తికే అంకితం చేస్తున్నాను. తెలంగాణలో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దిన రోజే నా జన్మ ధన్యమవుతుంది. ఆడబిడ్డలను ఆర్థికంగా నిలబెడితే, ఇరు తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణను ఆర్థికంగా నిలబెట్టినట్టే," అని భావోద్వేగంగా పేర్కొన్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో 70 లక్షల మంది మహిళలు స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్నారని, 2034 నాటికి ఈ సంఖ్యను కోటికి పెంచి, వారందరినీ వ్యాపార దిగ్గజాలుగా మార్చడమే లక్ష్యమని తెలిపారు.

ఆడబిడ్డ ఆర్థికంగా నిలబడితేనే కుటుంబం నిలబడుతుందని నమ్మిన తమ ప్రభుత్వం, ప్రతీ సంక్షేమ పథకాన్ని మహిళల పేరిటే అమలు చేస్తోందని సీఎం వివరించారు.

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 25.5 లక్షల మంది పిల్లలకు కావలసిన రెండు జతల స్కూల్ యూనిఫాంలను కుట్టే బాధ్యతను మహిళా సంఘాలకే శిక్షణ ఇచ్చి అప్పగించామని గుర్తు చేశారు. మహిళా సంఘాలకు పెట్రోల్ బంకుల నిర్వహణ, సోలార్ విద్యుత్ ఉత్పత్తి రంగాలలో అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. సచివాలయంతో పాటు వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో 'ఇందిరమ్మ క్యాంటీన్లు' నిర్వహించే బాధ్యతను కూడా మహిళలకే ఇచ్చామని పేర్కొన్నారు.

నవంబర్ 19న ఇందిరమ్మ చీరల పంపిణీ

నవంబర్ 19న ఇందిరా గాంధీ జయంతిని పురస్కరించుకుని రాష్ట్రంలోని కోటి మంది ఆడబిడ్డలకు ప్రేమపూర్వక సారెగా 'ఇందిరమ్మ చీరలను' పంపిణీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్లు, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేరుకోవాలంటే మహిళలు కేవలం గృహిణులుగా కాకుండా పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని పిలుపునిచ్చారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks