మెుంథా తుపాను ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పంటల సేకరణలో అప్రమత్తంగా ఉండాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. వరి, పత్తి, మొక్కజొన్న సహా పంటల కొనుగోళ్ల సమయంలో అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. రైతులకు నష్టం జరగకుండా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు చేయాలన్నారు. పంట ఉత్పత్తులు కొనుగోలు కేంద్రాలకు వస్తున్నందున ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు. రైతులకు అన్ని విధాలుగా సహకరించాలని ఆదేశించారు.

మరోవైపు తెలంగాణ నీటిపారుదల, పౌర సరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు జిల్లా కలెక్టర్లతో సమన్వయం, అవసరమైన చర్యలకు సిద్ధంగా ఉండటంపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో వరి సేకరణ ప్రక్రియకు మెుంథా తుపాను అంతరాయం కలిగించకుండా చూసుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్ ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులు నష్టపోకూడదని చెప్పారు.
కొనుగోలు కేంద్రాల వద్ద ఇప్పటికే అందిన వరి ధాన్యాన్ని సురక్షితంగా ఉంచేందుకు, బియ్యం మిల్లులకు నిల్వలను త్వరగా రవాణా చేయడానికి టార్పాలిన్‌లను ఉపయోగించాలని ఉత్తమ్ అధికారులను ఆదేశించారు. సంబంధిత విభాగాలు తగిన రవాణా ఏర్పాట్లు చేసేలా చూడాలన్నారు. పంట నష్టాన్ని నివారించడానికి ప్రభావిత ప్రాంతాల్లో వరి కోతను తాత్కాలికంగా నిలిపివేయవచ్చని సూచించారు.
‘ఇప్పటివరకు రాష్ట్రం 22,433 మంది రైతుల నుండి 1,80,452 మెట్రిక్ టన్నుల వరిని సేకరించింది దీని విలువ రూ.431.09 కోట్లు. భారీ అకాల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున రాబోయే 30 నుండి 45 రోజులు సమన్వయంతో పనిచేయాలి.’ అని మంత్రి ఉత్తమ్ అధికారులను ఆదేశించారు.
తెలంగాణ ప్రభుత్వం 8,342 కొనుగోలు కేంద్రాలను కూడా ఆమోదించిందని, వాటిలో 4,428 ప్రస్తుతం పనిచేస్తున్నాయన్నారు ఉత్తమ్. కొనుగోలు ప్రక్రియలో అవినీతి లేదా అవకతవకలకు లేకుండా ముందుకు వెళ్లాలని హెచ్చరించారు. ఏవైనా ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పారదర్శకతను నిర్ధారించడానికి అధికారులు క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలన్నారు.
{{/usCountry}}తెలంగాణ ప్రభుత్వం 8,342 కొనుగోలు కేంద్రాలను కూడా ఆమోదించిందని, వాటిలో 4,428 ప్రస్తుతం పనిచేస్తున్నాయన్నారు ఉత్తమ్. కొనుగోలు ప్రక్రియలో అవినీతి లేదా అవకతవకలకు లేకుండా ముందుకు వెళ్లాలని హెచ్చరించారు. ఏవైనా ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పారదర్శకతను నిర్ధారించడానికి అధికారులు క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలన్నారు.
{{/usCountry}}రాబోయే రోజుల్లో వరి, మొక్కజొన్న, పత్తి కోనుగోళ్లను నిశితంగా పరిశీలిస్తామని ఉత్తమ్ కుమార్ అన్నారు. సమన్వయం చేయడానికి అధికారులు 24×7 అందుబాటులో ఉంటారని చెప్పారు.