పంట కొనుగోళ్లలో అప్రమత్తంగా ఉండాలి.. రైతులకు నష్టం జరగొద్దు : సీఎం రేవంత్ రెడ్డి

మెుంథా తుపాను నేపథ్యంలో వరి, పత్తి, మొక్కజొన్న సహా పంటల కొనుగోళ్లలో అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రైతులకు నష్టం జరగకుండా చూడాలని ఆదేశించారు.

Published on: Oct 28, 2025, 10:11:18 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మెుంథా తుపాను ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పంటల సేకరణలో అప్రమత్తంగా ఉండాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. వరి, పత్తి, మొక్కజొన్న సహా పంటల కొనుగోళ్ల సమయంలో అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. రైతులకు నష్టం జరగకుండా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు చేయాలన్నారు. పంట ఉత్పత్తులు కొనుగోలు కేంద్రాలకు వస్తున్నందున ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు. రైతులకు అన్ని విధాలుగా సహకరించాలని ఆదేశించారు.

సీఎం రేవంత్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి

మరోవైపు తెలంగాణ నీటిపారుదల, పౌర సరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు జిల్లా కలెక్టర్లతో సమన్వయం, అవసరమైన చర్యలకు సిద్ధంగా ఉండటంపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో వరి సేకరణ ప్రక్రియకు మెుంథా తుపాను అంతరాయం కలిగించకుండా చూసుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్ ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులు నష్టపోకూడదని చెప్పారు.

కొనుగోలు కేంద్రాల వద్ద ఇప్పటికే అందిన వరి ధాన్యాన్ని సురక్షితంగా ఉంచేందుకు, బియ్యం మిల్లులకు నిల్వలను త్వరగా రవాణా చేయడానికి టార్పాలిన్‌లను ఉపయోగించాలని ఉత్తమ్ అధికారులను ఆదేశించారు. సంబంధిత విభాగాలు తగిన రవాణా ఏర్పాట్లు చేసేలా చూడాలన్నారు. పంట నష్టాన్ని నివారించడానికి ప్రభావిత ప్రాంతాల్లో వరి కోతను తాత్కాలికంగా నిలిపివేయవచ్చని సూచించారు.

‘ఇప్పటివరకు రాష్ట్రం 22,433 మంది రైతుల నుండి 1,80,452 మెట్రిక్ టన్నుల వరిని సేకరించింది దీని విలువ రూ.431.09 కోట్లు. భారీ అకాల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున రాబోయే 30 నుండి 45 రోజులు సమన్వయంతో పనిచేయాలి.’ అని మంత్రి ఉత్తమ్ అధికారులను ఆదేశించారు.

తెలంగాణ ప్రభుత్వం 8,342 కొనుగోలు కేంద్రాలను కూడా ఆమోదించిందని, వాటిలో 4,428 ప్రస్తుతం పనిచేస్తున్నాయన్నారు ఉత్తమ్. కొనుగోలు ప్రక్రియలో అవినీతి లేదా అవకతవకలకు లేకుండా ముందుకు వెళ్లాలని హెచ్చరించారు. ఏవైనా ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పారదర్శకతను నిర్ధారించడానికి అధికారులు క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలన్నారు.

రాబోయే రోజుల్లో వరి, మొక్కజొన్న, పత్తి కోనుగోళ్లను నిశితంగా పరిశీలిస్తామని ఉత్తమ్ కుమార్ అన్నారు. సమన్వయం చేయడానికి అధికారులు 24×7 అందుబాటులో ఉంటారని చెప్పారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More