CM Revanth Reddy : ఆగస్టు 3 వరకు ఎవరూ గాంధీభవన్‌కు రావొద్దు - నేతలకు సీఎం రేవంత్ వార్నింగ్..!

ఓటర్ల జాబితా సవరణ (SIR) కార్యక్రమంపై సీఎం రేవంత్ రెడ్డి పార్టీ నేతలతో వర్చువల్ సమీక్ష నిర్వహించారు. ఈ ప్రక్రియలో చురుగ్గా పాల్గొనని నాయకులకు కార్పొరేషన్ చైర్మన్ పదవులు లేదా నామినేటెడ్ పోస్టులు ఇచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఆగస్టు 3వ తేదీ వరకు నేతలెవరూ గాంధీ భవన్‌కు రావొద్దని ఆదేశించారు.

Published on: Jul 20, 2026, 07:13:39 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

CM Revanth Reddy Review On SIR : తెలంగాణలో సాగుతున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (SIR) కార్యక్రమంపై పార్టీ నేతలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు. ఆదివారం జరిగిన వర్చువల్ సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రక్రియలో జిల్లాల నేతలు చురుగ్గా పాల్గొనకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో నిర్లక్ష్యంగా వ్యవహరించే కాంగ్రెస్ నాయకులకు భవిష్యత్తులో కార్పొరేషన్ చైర్మన్ పదవులు లేదా ఇతర నామినేటెడ్ పోస్టులు దక్కవని తేల్చి చెప్పారు.

సీఎం రేవంత్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి

ఈ ఉన్నత స్థాయి సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షీ నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్‌తో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు నియోజకవర్గ ఇన్‌చార్జులు పాల్గొన్నారు.

గాంధీ భవన్‌కు రావొద్దు.. క్షేత్రస్థాయికి వెళ్లండి - సీఎం

దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ అయిన ఆగస్టు 3వ తేదీ వరకు పార్టీ నాయకులు ఎవరూ హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌కు రావద్దని, అంతా క్షేత్రస్థాయిలోనే అందుబాటులో ఉండాలని సీఎం ఆదేశించారు. ఇన్‌చార్జులుగా నియమితులైన నియోజకవర్గాల్లో సరిగ్గా బాధ్యతలు నిర్వర్తించని ఎంపీలపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

పార్లమెంట్ సమావేశాలకు హాజరవుతూనే…. తమ నియోజకవర్గాల్లో క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహించాలని సూచించారు. జూలై 20న 10 మంది ఇన్‌చార్జ్ మంత్రులు అన్ని జిల్లాల్లో దీనిపై సమీక్షలు నిర్వహిస్తారని, ఈ సమావేశాలకు ప్రజాప్రతినిధులు ఎవరూ గైర్హాజరు కావద్దని ఆదేశించారు.

బీఎల్ఏల నివేదికలపై నిఘా…

బూత్ లెవెల్ ఆఫీసర్ల (BLO) నివేదికలపైనే కాకుండా… కాంగ్రెస్ పార్టీ తరఫున పనిచేసే బూత్ లెవెల్ ఏజెంట్ల (BLA) నివేదికలను ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జులు క్షుణ్ణంగా పరిశీలించాలని సీఎం స్పష్టం చేశారు. వెనుకబడిన నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలో అద్భుతంగా పనిచేసి ఉత్తమ ప్రదర్శన కనబరిచిన 100 మంది బీఎల్ఏలకు (BLAs) కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కలిసి… ఆయనతో ఫొటో దిగే సువర్ణావకాశాన్ని కల్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ మొత్తం ప్రక్రియ పురోగతిపై జూలై 30న మరోసారి సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More