రాష్ట్రంలోని అన్ని కలెక్టరేట్లలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాలను ఫ్యూచర్ సిటీలోని గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణం నుంచి సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. 33 కలెక్టరేట్లలో రూ.5.8 కోట్లతో తెలంగాణ తల్లి విగ్రహాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. 18 అడుగుల ఎత్తుతో విగ్రహాలను నిర్మించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు.

తెలంగాణ తల్లి విగ్రహాలను ఆవిష్కరణ చేయడం చాలా ఆనందంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. 2009లో డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైందన్నారు. ఆరు దశాబ్దాల తెలంగాణ ప్రజలు కలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చిందని అన్నారు. ప్రతీ ఏటా డిసెంబర్ 9న తెలంగాణ తల్లి ఆవిష్కరణ ఉత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. తెలంగాణ తల్లిని తలుచుకుని పనులు మెుదలు పెట్టేందుకు విగ్రహాలను ఆవిష్కరించామన్నారు. 'స్వరాష్ట్ర కల నిజమై.. సంక్షేమం, అభివృద్ధిలో రాష్ట్రం నంబర్ వన్‌గా రూపొందుతోంది. సోనియా గాంధీ ఎన్నో అడ్డంకులు అధిగమించి ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారు.' అని రేవంత్ రెడ్డి అన్నారు.
సోనియా గాంధీ జన్మదినం డిసెంబర్ 9వ తేదీన కావడం తమ అందరికీ సంతోషాన్ని కలిగించే పర్వదినం అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రతీ ఏటా తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవాలతోపాటుగా, సోనియా గాంధీ జన్మదిన ఉత్సవాలను తెలంగాణ ప్రజలను నిర్వహించుకుంటారన్నారు. తమ పథకాలు, కార్యక్రమాల్లో సోనియా, మన్మోహన్ స్ఫూర్తి కొనసాగుతోందన్నారు.
జూలై 2025లో ప్రభుత్వం అన్ని జిల్లా కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహాలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. మరుసటి నెలలో శిల్పకళ కోసం టెండర్లను ఆహ్వానించింది. అన్ని విగ్రహాలు ఇప్పుడు పూర్తయ్యాయి. దీంతో తాజాగా ప్రభుత్వం ఆవిష్కరించింది.
డిసెంబర్ 2023లో కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాన్ని పునఃరూపకల్పన చేసింది. ఆకుపచ్చ చీర ధరించి, సాంప్రదాయ ఆభరణాలు అలంకరించిన, మధ్య వయస్కురాలైన మహిళ డిజైన్ రూపొందించారు. ఈ విగ్రహంలో తెలంగాణ తల్లి వరి, మొక్కజొన్న పట్టుకున్నట్లుగా కనిపిస్తుంది. ప్రభుత్వం డిసెంబర్ 9ని తెలంగాణ తల్లి దినోత్సవంగా కూడా ప్రకటించింది. దీనిని ఏటా జరుపుకోవాలని కూడా తెలిపింది.
{{/usCountry}}డిసెంబర్ 2023లో కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాన్ని పునఃరూపకల్పన చేసింది. ఆకుపచ్చ చీర ధరించి, సాంప్రదాయ ఆభరణాలు అలంకరించిన, మధ్య వయస్కురాలైన మహిళ డిజైన్ రూపొందించారు. ఈ విగ్రహంలో తెలంగాణ తల్లి వరి, మొక్కజొన్న పట్టుకున్నట్లుగా కనిపిస్తుంది. ప్రభుత్వం డిసెంబర్ 9ని తెలంగాణ తల్లి దినోత్సవంగా కూడా ప్రకటించింది. దీనిని ఏటా జరుపుకోవాలని కూడా తెలిపింది.
{{/usCountry}}మునుపటి బీఆర్ఎస్ ప్రభుత్వం జనంలోకి తీసుకొచ్చిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మార్చింది. అయితే దీనిపై ప్రతిపక్షం నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయినా రేవంత్ రెడ్డి సర్కార్ వెనక్కు తగ్గలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త తెలంగాణ తల్లి రూపాన్ని అధికారికంగా గుర్తిస్తూ జీఓ నంబర్ 1946ను జారీ చేసింది.