స్వరాష్ట్ర కల నిజమై.. సంక్షేమం, అభివృద్ధిలో రాష్ట్రం నంబర్‌ వన్‌గా రూపొందుతోంది : సీఎం రేవంత్

తెలంగాణ తల్లిని తలుచుకుని పనులు మెుదలుపెట్టేందుకు విగ్రహాలు ఆవిష్కరించామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. స్వరాష్ట్ర కల నిజమై.. సంక్షేమం, అభివృద్ధిలో రాష్ట్రం నంబర్‌ వన్‌గా రూపొందుతోందని పేర్కొన్నారు.

Published on: Dec 9, 2025, 12:07:48 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రాష్ట్రంలోని అన్ని కలెక్టరేట్లలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాలను ఫ్యూచర్ సిటీలోని గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణం నుంచి సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. 33 కలెక్టరేట్లలో రూ.5.8 కోట్లతో తెలంగాణ తల్లి విగ్రహాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. 18 అడుగుల ఎత్తుతో విగ్రహాలను నిర్మించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు.

తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ
తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ

తెలంగాణ తల్లి విగ్రహాలను ఆవిష్కరణ చేయడం చాలా ఆనందంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. 2009లో డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైందన్నారు. ఆరు దశాబ్దాల తెలంగాణ ప్రజలు కలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చిందని అన్నారు. ప్రతీ ఏటా డిసెంబర్ 9న తెలంగాణ తల్లి ఆవిష్కరణ ఉత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. తెలంగాణ తల్లిని తలుచుకుని పనులు మెుదలు పెట్టేందుకు విగ్రహాలను ఆవిష్కరించామన్నారు. 'స్వరాష్ట్ర కల నిజమై.. సంక్షేమం, అభివృద్ధిలో రాష్ట్రం నంబర్‌ వన్‌గా రూపొందుతోంది. సోనియా గాంధీ ఎన్నో అడ్డంకులు అధిగమించి ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారు.' అని రేవంత్ రెడ్డి అన్నారు.

సోనియా గాంధీ జన్మదినం డిసెంబర్ 9వ తేదీన కావడం తమ అందరికీ సంతోషాన్ని కలిగించే పర్వదినం అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రతీ ఏటా తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవాలతోపాటుగా, సోనియా గాంధీ జన్మదిన ఉత్సవాలను తెలంగాణ ప్రజలను నిర్వహించుకుంటారన్నారు. తమ పథకాలు, కార్యక్రమాల్లో సోనియా, మన్మోహన్ స్ఫూర్తి కొనసాగుతోందన్నారు.

జూలై 2025లో ప్రభుత్వం అన్ని జిల్లా కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహాలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. మరుసటి నెలలో శిల్పకళ కోసం టెండర్లను ఆహ్వానించింది. అన్ని విగ్రహాలు ఇప్పుడు పూర్తయ్యాయి. దీంతో తాజాగా ప్రభుత్వం ఆవిష్కరించింది.

డిసెంబర్ 2023లో కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాన్ని పునఃరూపకల్పన చేసింది. ఆకుపచ్చ చీర ధరించి, సాంప్రదాయ ఆభరణాలు అలంకరించిన, మధ్య వయస్కురాలైన మహిళ డిజైన్ రూపొందించారు. ఈ విగ్రహంలో తెలంగాణ తల్లి వరి, మొక్కజొన్న పట్టుకున్నట్లుగా కనిపిస్తుంది. ప్రభుత్వం డిసెంబర్ 9ని తెలంగాణ తల్లి దినోత్సవంగా కూడా ప్రకటించింది. దీనిని ఏటా జరుపుకోవాలని కూడా తెలిపింది.

మునుపటి బీఆర్ఎస్ ప్రభుత్వం జనంలోకి తీసుకొచ్చిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మార్చింది. అయితే దీనిపై ప్రతిపక్షం నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయినా రేవంత్ రెడ్డి సర్కార్ వెనక్కు తగ్గలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త తెలంగాణ తల్లి రూపాన్ని అధికారికంగా గుర్తిస్తూ జీఓ నంబర్ 1946ను జారీ చేసింది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More