...
...
Next Story

Telangana Cold Wave : తెలంగాణలో పెరగనున్న చలి.. నవంబర్ 30 నుంచి చల్లని గాలులు!

Telangana Cold Wave : మరికొన్ని రోజుల్లో తెలంగాణలో వాతావరణం మారనుంది. నవంబర్ చివరి నుంచి చల్లని గాలులు వీచే అవకాశం ఉందని తెలంగాణ వెదర్ మ్యాన్ తెలిపారు.

Published on: Nov 24, 2026, 10:36:44 IST
Advertisement

రాబోయే రోజుల్లో తెలంగాణలో వాతావరణ పరిస్థితులు మారనున్నాయి. ఒకవైపు పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉండగా.. మరోవైపు నవంబర్ చివరి నాటికి చలి తీవ్రత పెరగనుంది. తాజా వాతావరణ సూచనల ప్రకారం, నవంబర్ 29 నుండి డిసెంబర్ 4 వరకు రాష్ట్రంలో తీవ్రమైన చలి పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది.

తెలంగాణలో పెరగనున్న చలి
తెలంగాణలో పెరగనున్న చలి

ముఖ్యంగా నవంబర్ 30 నుండి డిసెంబర్ 2 వరకు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో చల్లని గాలుల ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. కొన్ని జిల్లాల్లో పొడి వాతావరణం కొనసాగుతుండగా, మరికొన్ని చోట్ల తేలికపాటి వర్షాలకు అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. వర్షాల ప్రభావం తగ్గిన తర్వాత రాత్రి ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గే అవకాశం ఉంది.

ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, వనపర్తి, నాగర్‌కర్నూల్, జోగులాంబ గద్వాల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రధానంగా మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో జల్లులు పడే సూచనలు ఉన్నాయి. మిగిలిన జిల్లాల్లో చాలా వరకు పొడి వాతావరణమే కొనసాగవచ్చు.

తాజా అంచనాల ప్రకారం.. నవంబర్ 25 నుండి 27 మధ్య హైదరాబాద్‌తో పాటు దక్షిణ, మధ్య తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే భారత వాతావరణ శాఖ సూచనల మేరకు నవంబర్ 24-25 తేదీల్లో అక్కడక్కడా వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.

రాష్ట్రంలో వర్షాల ప్రభావం తగ్గిన తర్వాత శీతాకాలపు పరిస్థితులు మరింత తీవ్రతరం కానున్నాయి. ముఖ్యంగా ఉత్తర, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని వాతావరణ సూచనలు చెబుతున్నాయి. ఆదిలాబాద్, కుమ్రం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్ జిల్లాల్లో చలి ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఈ ప్రభావం ఎక్కువగా కనిపించవచ్చు.

పిల్లలు, వృద్ధులు, శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారు చలికాలంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఉదయాన్నే బయటకు వెళ్లేవారు, బైకర్లు చలి నుండి తమను తాము రక్షించుకోవడానికి అవసరమైన దుస్తులు ధరించాలి. రాబోయే రోజుల్లో, ఉష్ణోగ్రతలలోని మార్పులకు అనుగుణంగా చల్లని గాలుల ప్రభావంపై మరింత స్పష్టమైన అంచనాలు వెలువడే అవకాశం ఉంది.

 

ABOUT THE AUTHOR

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks