Illu Illalu Pillalu November 24 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు-వల్లిని క్షమించేసిన అత్తామామ-బిడ్డ కూడా వద్దని చందు ఆవేశం

Illu Illalu Pillalu November 24 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే నవంబర్ 24 ఎపిసోడ్ లో వల్లి ప్రెగ్నెన్సీ విషయం తెలిసి రామరాజు ఫ్యామిలీ హ్యాపీగా ఫీల్ అవుతుంది. వల్లిని క్షమించేస్తారు. కానీ చందు మాత్రం వల్లి ఇంట్లోకి వస్తే తాను వెళ్లిపోతానంటాడు. కడుపులోని బిడ్డను కూడా వద్దంటాడు.

Published on: Nov 24, 2026, 07:48:38 IST
As Prefered on
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Illu Illalu Pillalu November 24 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. వల్లి ప్రెగ్నెన్సీ విషయం తెలుసుకున్న నర్మద ఆమెను ఇంటికి తీసుకొచ్చి సర్ ప్రైజ్ చేద్దామనుకుంటుంది. కానీ దీపావళి సంబరాల్లో ఉన్న రామరాజు ఫ్యామిలీ వల్లిని చూడగానే షాక్ అవుతుంది. వేదవతి అయితే కోప్పడుతుంది.

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే ఎపిసోడ్ (jiohotstar)
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే ఎపిసోడ్ (jiohotstar)

వల్లి కడుపులో బిడ్డ

సాయంత్రం నుంచి సర్ ప్రైజ్ సర్ ప్రైజ్ అంటున్నావ్ ఇదేనా? నర్మద అక్క తీసుకురావడం, నువ్వు ఎలివేషన్ ఇవ్వడం అని ధీరజ్ పై ప్రేమ మండిపడుతుంది. ఎలివేషన్ ఇచ్చింది వల్లి అక్కకు కాదు, వల్లి అక్క కడుపులో పెరుగుతున్న బిడ్డకు అని నర్మద చెప్పగానే మరోసారి అందరూ షాక్ అవుతారు.

రామరాజు సంతోషం

మామయ్య మీరు తాతయ్య కాబోతున్నారని నర్మద చెప్పగానే రామరాజు హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆవిడ గారు నానమ్మ కాబోతున్నారని చెప్పండి. షాక్ లో నోరు వెళ్లబెట్టారని వేదవతి గురించి చెప్తుంది నర్మద. ఇది నిజమేనా అని రామరాజు అడుగుతాడు. నిజమే మామయ్య అని వల్లి చెప్పడంతో రామరాజు సంతోషానికి అంతుండదు.

మారిన ప్రేమ

మీరు వెంటనే నమ్మేసి సంబరపడకండి. వాళ్లది డ్రామాల ఫ్యామిలీ అని వేదవతి చెప్తుంది. ఇలా అంటారనే హాస్పిటల్ కు చెకప్ కు తీసుకెళ్లి ట్యాబ్లెట్స్ అన్నీ తీసుకున్నా. స్కానింగ్ కూడా చేయించానని రిపోర్ట్ కూడా చూపిస్తుంది నర్మద. ఈ ఇంటికి వారసుడో, వారసురాలో రాబోతున్నారు కాబట్టి ఇది నిజంగానే సర్ ప్రైజ్ అని ప్రేమ అంటుంది. వల్లికి సపోర్ట్ గా ప్రేమ మారిపోతుంది.

వల్లి రిక్వెస్ట్

అందరూ వల్లికి కంగ్రాట్స్ చెప్తారు. వల్లి అక్క పూర్తిగా మారిపోయింది. తాను చేసిన తప్పులను తెలుసుకుంది. నా మాటను నమ్మండని రామరాజును నర్మద రిక్వెస్ట్ చేస్తుంది. ఈ బిడ్డను అడ్డు పెట్టుకొని ఈ ఇంట్లోకి రావాలనుకోవడం లేదు. నిజంగానే పూర్తిగా మారిపోయా. కావాలంటే నాకు కొంచెం టైమ్ ఇవ్వండి. మీ అందరికీ నమ్మకం కుదిరాకే ఇంట్లోకి రానివ్వండి. నన్ను అసహ్యించుకున్నా ఏం అనుకోను. కానీ ఈ బిడ్డను మాత్రం దూరం పెట్టకండి. ఒక్క అవకాశం ఇవ్వండని వల్లి వేడుకుంటుంది.

వల్లిని క్షమించేసిన ఫ్యామిలీ

మమ్మల్ని మోసం చేశావని దూరం పెట్టాం కానీ నువ్వెప్పటికీ ఈ ఇంటి పెద్ద కోడలివే. పశ్చాత్తాపానికి మించిన శిక్ష ఏం ఉంటుందని రామరాజు అంటాడు. దాన్ని క్షమించేది లేదు. కానీ కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసం క్షమించానని అనుకోండని వేదవతి అనడంతో అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక రామరాజు తాతయ్య కాబోతున్నాడనే వార్త ఊరంతా తెలిసేలా క్రాకర్స్ వెలిగించమని రామరాజు చెప్తాడు.

చందు ఫైర్

అప్పుడే వచ్చిన చందు అక్కడ వల్లిని చూసి కోపంతో ఊగిపోతాడు. తాను కడుపుతో ఉందని వేదవతి చెప్పగానే చందు మైండ్ బ్లాక్ అవుతుంది. వీళ్ల దొంగ డ్రామాలకు మళ్లీ ట్రాప్ లో పడిపోయారా? అని చందు నవ్వుతూ చప్పట్లు కొడతాడు. ఒకసారి ప్రెగ్నెంట్ అని నాటకం ఆడింది మర్చిపోయారా? మళ్లీ నాటకం మొదలెట్టిందని చందు అంటాడు. హాస్పిటల్ కు తీసుకెళ్లి స్కానింగ్ చేయించానని నర్మద చెప్తుంది.

బిడ్డ ఉన్నా సరే వల్లి వద్దు

చందు చేతిని వల్లి తన కడుపుపై పెట్టుకుంటుంది. ఒకసారి ప్రెగ్నెంట్ అని మోసం చేశా. కానీ ఇప్పుడు చెప్తుంది నిజం బా. కడుపులో మన బిడ్డ పెరుగుతుందని వల్లి అంటుంది. కోపంతో చేయి తీసేసిన చందు.. బిడ్డను అడ్డం పెట్టుకొని ఇంట్లోకి వస్తానంటే ఒప్పుకోనని అంటాడు. అసలు క్షమించే ఉద్దేశమే లేదంటాడు. కడుపులో బిడ్డ ఉన్నా సరే వల్లి తనకు వద్దనే అంటాడు.

బిడ్డ నాకెందుకు?

నర్మదను ఈ విషయం కలగజేసుకోవద్దని చందు చెప్తాడు. ఎవరినీ మాట్లాడనివ్వడు. కడుపులో పెరుగుతున్న బిడ్డ సంగతి ఏంటీ అని రామరాజు అడుగుతాడు. తననే వద్దనుకున్నప్పుడు తన కడుపులో ఉన్న బిడ్డ నాకెందుకు? అవసరమైతే కడుపు తీయించుకుంటుంది. ఈ దుర్మార్గురాలి కడుపులో నా బిడ్డ పెరగడం ఇష్టం లేదని చందు కఠినంగా మాట్లాడతాడు.

వల్లి వస్తే ఉండను

ఆ మాటలతో చందును వేదవతి కొడుతుంది. పండగ పూట ఏం మాట్లాడుతున్నావ్? అని అరుస్తుంది. చందు కోపంతో లోపలికి వెళ్లిపోయి లగేజీతో బయటకు వస్తాడు. వల్లి లోపలికి అడుగుపెడితే తాను బయటకు వెళ్లిపోతానంటాడు. తానే అక్కడి నుంచి వెళ్లిపోతానని వల్లి ఏడుస్తుంది. మీరు ఇంట్లోకి రానివ్వరని నాకు తెలుసు బావ అని కన్నీళ్లు పెట్టుకుంటూ వెళ్లిపోతుంది.

భాగ్యం మాటలు

ఇటు ఉదయం ఇంట్లో కడుపులో బిడ్డ కోసం తినమ్మా అని వల్లికి ఇడ్లీ బాబాయి ఇడ్లీలు తినిపిస్తాడు. కడుపుతో ఉందని తెలిసి గెంటేసినా కొన్ని జన్మలకు సిగ్గుండదు. అంత జరిగినా సిగ్గులేకుండా ఎలా తింటుంది? కడుపులో బిడ్డ ఉందని తెలిసినా కనికరం లేదు. ఇదిగో అమ్మడు నెక్స్ట్ వాయిదాతో నీకు విడాకులు ఇవ్వడం ఖాయం. విడాకులు ఇస్తే వాడు ఇంకో పెళ్లి చేసుకుంటాడు. నువ్వు రోడ్డు మీద పడు అని భాగ్యం దెబ్బిపొడుస్తుంది.

కడుపుతో ఉన్నదానికి శాపనార్థాలు పెడతావా? అని భార్యపై ఇడ్లీ బాబాయి ఫైర్ అవుతాడు. నెల నెల హాస్పిటల్ ఖర్చు ఎవరు పెడతారని భాగ్యం అంటుంది. అప్పుడే నర్మద, ప్రేమ, ధీరజ్ వస్తారు. బావ ఇలా రియాక్టవుతారని అనుకోలేదని బల్లక్కాయ్ కు నర్మద సారీ చెప్తుంది. నిన్ను చూస్తుంటే నా మనసు కరిగిపోతుందని ప్రేమ అంటుంది.

కేర్ టేకర్ గా వల్లి

ఎగ్జామ్ రాయడానికి హైదరాబాద్ వెళ్తున్నా అక్క. నీకు ఏం కావాలన్నా ధీరజ్, ప్రేమకు కాల్ చేయ్ అని నర్మద చెప్తుంది. అలాగే తన ఫ్రెండ్ కు కేర్ టేకర్ కావాలంటా, అలా వెళ్తే వల్లి అక్కకు ఇక్కడ మాటలు పడాల్సిన బాధ తప్పుతుంది. రోజూ తీసుకెళ్తూ ఉండు అని ప్రేమకు నర్మద చెప్తుంది. అక్కడి నుంచి నర్మద, ధీరజ్, ప్రేమ వెళ్లిపోతారు. ఇక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

ABOUT THE AUTHOR

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.