Illu Illalu Pillalu November 13 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు-రౌడీలతో భద్రావతి కన్నింగ్ ప్లాన్-ప్రేమకు షాకిచ్చిన ధీరజ్!

Illu Illalu Pillalu November 13 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే నవంబర్ 13 ఎపిసోడ్ లో ధీరజ్ ఆఫీస్ ఓపెనింగ్ రోజే క్లోజ్ అయిపోవాలని రౌడీలకు భద్రావతి చెప్తుంది. ఇక ఆఫీసుకు రామరాజు పేరు పెట్టి ప్రేమకు చందు షాకిస్తాడు. అక్కడికి వల్లి రావడంతో చందు ఫుల్ ఫైర్ అవుతాడు. 

Published on: Nov 13, 2026, 08:05:26 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Illu Illalu Pillalu November 13 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. ధీరజ్ ట్రావెల్ ఏజెన్సీ ఓపెనింగ్ సంబరంలో ఉన్న రామరాజు ఫ్యామిలీని దెబ్బ కొట్టేందుకు భద్రావతి రౌడీలను పురమాయిస్తుంది. ఆ రౌడీలకు ఏం చేయాలో భాగ్యం వివరించి చెప్తుంది. ఓపెనింగ్ రోజే ఆ ట్రావెల్ ఏజెన్సీ క్లోజ్ అవుతుందని వాళ్లకు తెలియదు పాపమని భద్రావతి కన్నింగ్ గా అంటుంది.

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే ఎపిసోడ్ (jiohotstar)
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే ఎపిసోడ్ (jiohotstar)

కామాక్షి చదివింపులు

మరోవైపు ట్రావెల్ ఏజెన్సీలో తన భర్తకు ఓ పెన్ను, నోట్ బుక్ ఇచ్చి టేబుల్ ముందు కూర్చోబెడుతుంది కామాక్షి. ధీరజ్ పై ప్రేమ ఉన్నవాళ్లు వచ్చి చదివించుకోవాలని పిలుస్తుంది. చదివింపుల కోసం గట్టిగట్టిగా అరుస్తుంది. అప్పుడే వేదవతి, రామరాజు, చందు వస్తారు. ట్రావెల్ ఏజెన్సీ ఓపెనింగ్ కు చదివింపులు ఏంటీ? అని కూతురిపై వేదవతి ఫైర్ అవుతుంది.

ఆడపడుచు కట్నం

మీరందరూ తలా కొంచెం చదివించాలి. అలా అయితే ఆడపడుచు కట్నం కింద మీరు ఇవ్వాల్సిన దాంట్లో కొంచెం కవర్ అవుతుందని ఆశగా కామాక్షి అడుగుతుంది. ఆడపడుచు కట్నం ఏంటీ అని రామరాజు అడుగుతాడు. తమ్ముడు ఇంత గ్రాండ్ గా ట్రావెల్ ఏజెన్సీ పెడుతున్నప్పుడు ఆడపడుచు కట్నం ఉండాల్సిందేనని కామాక్షి అంటుంది. దీంతో అందరూ తల కొట్టుకుంటారు.

నాన్నకు సారీ చెప్పాడు

ఆ సంగతి పక్కనపెట్టిన వేదవతి అందరికీ గుడ్ న్యూస్ చెప్తుంది. పెద్దోడు మీ నాన్నకు సారీ చెప్పాడ్రా అని వేదవతి పొంగిపోతూ చెప్తుంది. అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. చందు దగ్గరకు వెళ్లి ధీరజ్ హత్తుకుంటాడు. అయితే రాత్రి తనను ఎవరు ఇంటికి తీసుకొచ్చారని చందు మెల్లగా అడుగుతాడు. అంజలి తీసుకొచ్చిందనే అసలు నిజం చెప్పకుండా తానే తీసుకొచ్చానని ధీరజ్ అబద్ధం చెప్తాడు.

ప్రేమకు షాక్

తన పేరు మీద ధీరజ్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాడని ప్రేమ తెగ బిల్డప్ ఇస్తుంది. సుక్కును వీడియో తీయమంటుంది. కానీ ఆ బోర్డు మీద రామరాజు ట్రావెల్ ఏజెన్సీ అని ఉండటం చూసి ప్రేమకు నోట మాట రాదు. వేదవతి ఏమో తెగ సంబరపడుతుంది. ప్రేమను చూసి అందరూ నవ్వుతారు. ప్రేమ ఏమో అలుగుతుంది. నా పేరు ఎందుకు పెట్టావ్ రా? నీ భార్య పేరు పెట్టుకోవచ్చు కదా అని ధీరజ్ ను రామరాజు అడుగుతాడు.

మీ తర్వాతే ఎవరైనా. మీరు లేకపోతే ఈ అడుగు ముందుకు వేసేవాడినా? అని ధీరజ్ అంటాడు. రూ.30 లక్షలు ఇస్తే ఎవరైనా పేరు పెడతారని సాగర్ వెటకారంగా అంటాడు. నాన్న డబ్బులిచ్చాడని ఈ పేరు పెట్టలేద. బోర్డు ఆర్డర్ ఇచ్చి వారమైంది. నాన్న డబ్బులిచ్చింది నిన్న అని ధీరజ్ అసలు విషయం చెప్తాడు. రామరాజు రిబ్బన్ కట్ చేస్తాడు.

ప్రేమ వార్నింగ్

మొహం మాడిపోయిన పెసరట్టులా పెట్టావేంటని ప్రేమను ధీరజ్ అడుగుతాడు. నీలాంటి నమ్మక ద్రోహిని చూడలేదని ప్రేమ కోప్పడుతుంది. నీకు నచ్చిన కలర్ లోనే పెద్ద పెద్ద అక్షరాలు రాయించాను కదా అని ధీరజ్ చెప్తాడు. వెనుకాలే ఉన్న నర్మద నవ్వుతుంది. నీ సంగతి తర్వాత చెప్తానని ప్రేమ వార్నింగ్ ఇస్తుంది.

ధీరజ్ కౌంటర్

అయితే లోపల ఆఫీసులో చైర్ లో రామరాజును ధీరజ్ కూర్చోమంటాడు. కానీ రామరాజుతో సహా అందరూ కలిసి ప్రేమను కూర్చోబెడతారు. ఈ రోజు నుంచి ఆఫీస్ ఓనర్ నువ్వేనమ్మా అని రామరాజు చెప్తాడు. ఇక్కడ వచ్చిన డబ్బులన్నీ నీ భార్యకే ఇవ్వాలని ధీరజ్ కు రామరాజు చెప్తాడు. కానీ ధీరజ్ సొమ్మొకరిది సోకు ఒకరిది అని కౌంటర్ వేస్తాడు.

వల్లి రాకతో

ప్రేమ నీ మీద అలిగింది ధీరజ్ అని నర్మద చెప్తుంది. ఆ అలక ఎలా తీర్చాలో నాకు తెలుసు వదినా అని నర్మదను పక్కకు చూడని ప్రేమకు ముద్దు పెడతాడు ధీరజ్. ఆ తర్వాత ఆఫీస్ లో పూజ జరుగుతుంది. వల్లి కోసం నర్మద ఎదురు చూస్తుంటుంది. అప్పుడే వల్లి వస్తుంది. ఇంటి పెద్ద కోడలు వస్తుందని నర్మద అనగానే అందరూ షాక్ అవుతారు.

రామరాజు మౌనం

వల్లిని దీపం వెలిగించమని నర్మద అడుగుతుంది. కానీ నర్మదపై వేదవతి, ప్రేమ ఫైర్ అవుతారు. మామయ్య ఇది ఫ్యామిలీ ఫంక్షన్ కదా. అందరం ఆనందంగా ఉన్నాం. రేప్పొద్దున్న బావకు, వల్లక్కాయ్ కు మధ్య గొడవలు తొలగిపోయి అందరం సంతోషంగా ఉన్నప్పుడు ధీరజ్ ఆఫీస్ ఓపెనింగ్ వీడియోలో తాను లేనే అని వల్లి బాధపడుతుంది. బావ కూడా బాధపడతారని నర్మద చెప్తుంది. ధీరజ్ కూడా అదే మాట అంటాడు.

చందు సీరియస్

రామరాజు మౌనంగా ఉంటాడు. మౌనం అంగీకారం అనుకుంటా మామయ్య అని నర్మద అంటుంది. వల్లిని దీపం వెలిగించమంటుంది. కానీ చందు కోపంగా వచ్చి అడ్డుకుంటాడు. నువ్వెందుకు వచ్చావ్? నీ అడుగు పడితేనే దరిద్రం. తనను ఎవరు పిలిచారని చందు గట్టిగా అరుస్తాడు. నేనే పిలిచారా. వదిన ఉంటే సంతోషంగా ఉంటుందని రమ్మన్నానని చందు అబద్ధం చెప్తాడు.

ఎవర్రా వదిన? ఎవరికి వదిన? తనకు ఈ ఇంటితో బంధం ఎప్పుడో తెగిపోయింది. నేను తనకు విడాకులు పంపించానని తెలుసు కదా. అయినా పిలిచారంటే అర్థం ఏంటీ అని చందు కోప్పడతాడు. ఇక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More