Illu Illalu Pillalu October 17 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు- వల్లిని లాజిక్‌తో కొట్టిన నర్మద-కేసు వాపసు-భాగ్యం డిమాండ్
Illu Illalu Pillalu Serial October 17th Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే అక్టోబర్ 17వ ఎపిసోడ్లో తప్పు మీద తప్పు చేయకని, అక్కలా భావించి చెబుతున్నాని విశ్వ అంటాడు. కానీ, వల్లి వినదు. పోలీస్ స్టేషన్లో వేదవతి కళ్లు తిరిగి పడిపోతే డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తుంది. అదంతా నాటకమని భాగ్యం అంటుంది.
Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈరోజు ఎపిసోడ్లో భాగ్యం ఫ్యామిలీని అడ్డుకున్న విశ్వ రామరాజు వాళ్లపై కేసు వాపసు తీసుకోమంటాడు. పగోళ్లు మావాళ్లవరకు వచ్చిందా మ్యాటరు.. మీరు, మీ అత్త చేసిన అన్యాయాల ముందు మేము చేసింది ఎంతని భాగ్యం, వల్లి అంటారు.

ఇంకా పెద్ద తప్పు చేస్తున్నావ్
నేను అవి తప్పులు అని తెలుసుకున్నా కాబట్టే సరిచేసుకుంటున్నా. నువ్వు ఎన్ని తప్పులు చేసిన వాళ్లు నిన్ను క్షమించారు. ఇప్పుడు ఇంకా పెద్ద తప్పు చేస్తున్నావని విశ్వ అంటాడు. అసలు ఈ ఐడియా ఇచ్చిందే మీ పెద్దత్త. తప్పుకోవయ్యా. పెద్ద హీరోల వచ్చావుగానీ. మమ్మల్ని ఆపితే మీ అత్తకు చెబుతామని భాగ్యం అంటుంది.
ఏంటీ బెదిరిస్తున్నావా. నేను బెదిరించనా.. కేసు పెట్టి వెనక్కి వస్తారా మీరు. వచ్చి నా నుంచి తప్పించుకోగలరా అని విశ్వ అంటాడు. చూడు ఇది నా భర్తకు నాకు సంబంధించిన విషయం. నేను ఆ ఇంట్లోకి అడుగుపెట్టడానికి ఇదే దారి అని వల్లి అంటుంది. మమ్మల్ని మేమే నమ్ముకుంటాం అని ఇడ్లీ బాబాయ్ అంటే.. డిప్పా డప్పైపోద్దని విశ్వ అంటాడు.
మీ భద్రావతి అత్తకు ఫోన్ చేస్తామని చేయమంటుంది భాగ్యం. ఏయ్ ఆగు. నాకు అక్కలాగా చెబుతున్నాను. మీ ఇష్టం అని వెళ్లిపోతాడు విశ్వ. దెయ్యాలు వేదాలు వల్లించినట్లు అవుతుంది. సైడ్ క్యారెక్టర్ మాటలు పట్టించుకోవద్దు. నేను తల్లిని మెయిన్ క్యారెక్టర్ నా మాట విను అని భాగ్యం అంటుంది. మరోవైపు పోలీస్ స్టేషన్లో వేదవతి పడిపోయి ఉంటే డాక్టర్ ట్రీట్మెంట్ ఇస్తుంది.
రాత్రి నుంచి ఏం తినలేదు
వేదవతి కళ్లు తెరుస్తుంది. ఇంతలో ధీరజ్ వాళ్లు వచ్చి కంగారుపడతారు. రాత్రి నుంచి ఏం తినలేదు. నీరసంతో కళ్లు తిరిగిపడిపోయిందని తిరుపతి చెబుతాడు. ధీరజ్ టిఫిన్ పెడితే వేదవతి తినదు. ఏమ్మా ఇదేమైనా మీ ఇల్లు అనుకుంటున్నారా నిరాహార దీక్ష చేయడానికి. పోలీస్ స్టేషన్‌ను హాస్పిటల్‌గా మార్చడం కరెక్ట్ కాదని ఎస్సై అంటుంది.
మీరు చేసేది కూడా కరెక్ట్ కాదు. వల్లి పెట్టింది తప్పుడు కేసని చెప్పిన వినకుండా మావాళ్లతో రూడ్‌గా ప్రవర్తించడం కరెక్ట్ కాదని నర్మద అంటుంది. అత్తారింటి వాళ్లు టార్చర్ పెడుతున్నారని కేసు పెడితే మేము ఇలాగే డీల్ చేస్తాం. పైగా ఒంటిమీ దెబ్బలున్నాయి అని ఎస్సై అంటుంది. అలా అయితే వాళ్లు చేసిన నేరాలకు ఆధారాలు ఉన్నాయి. మేము కూడా కేసు పెడతామని నర్మద అంటుంది.
మీరు స్మిత గారి ఫ్రెండ్ అంటగా. ఆవిడకు చెప్పిందే మీకు చెబుతున్నా. ఆధారాలు ఉంటే కేసు పెట్టుకుని కోర్టులో తేల్చుకోండి. దీంట్లో మాత్రం ఏం చేయలేం. ఎఫ్ఐఆర్ రెడీ అవుతోంది. కోర్టుకి తీసుకెళ్తామని ఎస్సై అంటుంది. ఇంతలో భాగ్యం వాళ్లు వస్తారు. నిజంగానే కళ్లు తిరిగి పడిపోయారా. కోర్టుకు వెళ్లాల్సి వస్తుందని నాటకాలు ఆడుతున్నారా అని భాగ్యం అంటుంది.
రౌడీలను పెట్టి కొట్టించారు
దాంతో వేదవతి కోపంగా లేస్తుంది. నిజంగా కళ్లు తిరిగి పడిపోతే ఇలా లేస్తుందా అని భాగ్యం అంటుంది. మీరు చేసినదానికి సహనం చచ్చిపోయింది. చంపాలన్నంత కోపం వస్తుందని వేదవతి అంటుంది. చూశారా ఎస్సైగారు చంపేస్తుందట. ఇందాక వస్తుంటే దారిలో రౌడీలను పెట్టి మా ఆయన్ను కొట్టించారని చూపిస్తుంది. ఇడ్లీ బాబాయ్ దెబ్బలు చూపిస్తాడు.
మా మీద దాడి చేయించింది ఈ ధీరజ్, సాగర్ బాబు అని అనుమానంగా ఉంది. వీళ్లపై కూడా కేసు పెట్టి కోర్టుకు పంపించండని భాగ్యం అంటుంది. వీళ్లను కాదు మిమ్మల్ని అరెస్ట్ చేసి కోర్టుకు పంపించేయాల్సి వస్తుంది. మీ తప్పులకు నేరాలకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. వాళ్లు కేసు పెడతారంట అని ఎస్సై అంటుంది.
పెడితే పెట్టుకోండి. మా వైపు దిట్టమైన లాయర్ ఉన్నాడు అని భాగ్యం అంటుంది. భాగ్యం నువ్వు అసలు మనిషివేనా. తల్లివి కూతురు తప్పులను సరిదిద్దాల్సిపోయి వెనుకుండి తప్పు మీద తప్పు చేయిస్తున్నావ్ అని రామరాజు అంటాడు. అయ్యయ్యో నా కూతురుని టార్చర్ పెట్టి మా మీద నిందలు వేస్తారా అని డ్రామా చేస్తుంది.
నమ్మక ద్రోహం చేస్తారా
సొంత చెల్లెలా చూసుకుంటే ఇంత నమ్మక ద్రోహం చేస్తారా. వల్లి ఇప్పటికే చాలా తప్పు చేశావ్. అది తెలుసుకుని మర్యాదగా కేసు వాపసు తీసుకోమని రామరాజు అంటాడు. చూశారా ఎలా బెదిరిస్తున్నారో అని భాగ్యం అంటుంది. అర్థమైంది. మీరు రాజీపడరని. కోర్టుకు పంపిస్తానని ఎస్సై అంటుంది. వల్లితో ఓసారి పర్సనల్‌గా మాట్లాడాలని నర్మద అంటే.. మా లాయర్తోనే మాట్లాడుకోండని వల్లి అంటుంది.
ఒసేయ్ తింగరమొద్దు. నీకు ఎవరైనా ఐడియా ఇచ్చారో నీ కోడి బ్రెయిన్‌తో ఇలా చేస్తున్నావో తెలియదు గానీ తెగేదాక లాగకు. నీ జీవితం కాపురం రెండు నాశనమైపోతాయి. ఓసారి నర్మదతో మాట్లాడు. నీ కాపురం బాగుపడితే అదే పదివేలు అని సుకన్య సలహా ఇస్తుంది. ఒకసారి ఆలోచించుకో. ఒక్కసారి కోర్టుకు వెళ్తే మీ చేయిదాటిపోతుంది. జీవితాంతం కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుందని ఎస్సై చెబుతుంది.
మాటలేం లేవు. నా కూతురుని కాపురానికి తీసుకెళ్లాలి. నా కూతురు మీద ఈగ కూడా వాలకూడదని పేపర్‌పై సంతకం చేసి ఇవ్వాలని, దానికి అందరూ ఒప్పుకుంటేనే లేకుంటే కోర్టుకే అని భాగ్యం డిమాండ్ చేస్తుంది. నీలాంటి తల్లుల వల్లే కూతుర్లు కాపురం నాశనం చేసుకుంటున్నారు. వెళ్లి ఓసారి మాట్లాడు అని ఎస్సై సలహా ఇస్తుంది. దాంతో నర్మదతో వల్లి మాట్లాడేందుకు పోలీస్ స్టేషన్ బయటకు వెళ్తుంది.
హారతి ఇచ్చి స్వాగతం పలకాలి
వల్లి మనసులో అనుకున్నది కనిపెట్టిన నర్మద కొట్టాలనుకుంటే అక్కడే కొట్టేదాన్ని అంటుంది. నాకు నా మొగుడు కావాలి. నా కాపురం సెట్ చేయాలి. నా బండారం బయటపెట్టి చెడగొట్టినందుకు నువ్వే సెట్ చేయాలి. హారతి ఇచ్చి స్వాగతం పలకాలని శ్రీవల్లి అంటుంది. నేను నీ కోరికలు తీర్చేందుకు రాలేదు. నీకు వార్నింగ్ ఇవ్వడానికి వచ్చాను అని నర్మద అంటే వల్లి షాక్ అవుతుంది.
అత్తమామలపై కేసు పెట్టి చాలా పెద్ద తప్పు చేశావ్. ఇవాళ బెయిల్ రాకపోవచ్చు. కోర్టుకు వెళ్లొచ్చు. కానీ నాలుగైదు రోజుల్లో కచ్చితంగా వస్తుంది. గృహ హింస కేసు కొలిక్కి రాడానికి కొన్నేళ్లు పడుతుంది. ఈ గ్యాప్‌లో నీ దుస్థితి ఏంటో తెలుసా. నీ మొహం కూడా చూడరు. చందు బావ ఇంట్లోకి రానివ్వరు. నీకు జీవితాంతం పుట్టిల్లే. దీనివల్ల అత్తారింట్లో జన్మలో అడుగుపెట్టలేవు అని నర్మద లాజిక్‌తో కొడుతుంది.
జీవితాంతం పుట్టిల్లే
కోర్టులో కేసు తేలేదాక నీ జీవితం పుట్టిల్లే. తీర్పు వచ్చాకా నీ పరిస్థితి ఎలా ఉంటుందో ఆ దేవుడికే తెలియాలి. ఇంతకు చందు బావ నిన్ను భార్యగా ఒప్పుకోడానికి ఇష్టపడట్లేదు. కోపంగా ఉన్నాడు. అలాంటిది జైలుకు వెళ్తే ఎలా ఉంటుంది. కేసు వెనక్కి తీసుకుంటే ఇవాళ రేపో మావయ్య వాళ్లు క్షమించి నిన్ను ఇంట్లోకి తీసుకొచ్చుకుంటారు. లేకుంటే నీ గొయ్యి నువ్వే తవ్వుకుంటావని నర్మద వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది.
నా కూతురు మాటలకు బెదరదు, బెదిరింపులకు భయపడదు. కేసు వాపసు తీసుకోవాలంటే ఒక్కటే దారి అందరు నోరుమూసుకుని మా అమ్మడిని యువరాణిలా అత్తారింటికి తీసుకెళ్లాలని లేకుంటే కోర్టుకే పదండని భాగ్యం అంటుంది. పదండి వెళ్దాం. అక్కడ మీ నేరాలను చూపించి మీ అంతు అక్కడే చూస్తామని ధీరజ్ అంటాడు.
పదండి కోర్టులోనే తేల్చుకుందామని సాగర్ అంటాడు. పదండి కోర్టుకు అని అంతా అంటారు. అక్కర్లేదని శ్రీవల్లి ఎంట్రీ ఇస్తుంది. అంటే కేసు వాపసు తీసుకోడానికి వల్లి ఒప్పుకుందని తెలుస్తోంది. అక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


