Illu Illalu Pillalu September 25 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు- వల్లిని నీళ్లలో ముంచిన నర్మద- చింతామణి ఇంట్లో ప్రేమ
Illu Illalu Pillalu Serial September 19th Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే సెప్టెంబర్ 25వ ఎపిసోడ్‌లో ధీరజ్‌కు మంగళస్నానాలు చేయిస్తారు. అదంతా ప్రేమ చూస్తుంది. ప్రేమకు పైనుంచి మంగళస్నానాలు చేయిస్తాడు విశ్వ. వల్లినే కుట్ర అంతా చేసిందని, ఆధారాల వీడియోలు నర్మదకు పంపుతుంది పోలీస్ స్మిత.
Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈరోజు ఎపిసోడ్‌లో ధీరజ్ పెళ్లి గురించి అంతా సంతోషిస్తుంటే శ్రీవల్లి నవ్వుతుంది. ఎందుకు నవ్వు అని నర్మద అడిగితే.. ఇది జరుగుతుందా ఏంటీ అని వల్లి అంటుంది. ఎగిరిపడు. నర్మద ధీరజ్‌ల పెళ్లి కాగానే నీ సంగతి తేలుస్తానని నర్మద వార్నింగ్ ఇస్తుంది.

ధీరజ్, ప్రేమకు మంగళస్నానాలు
దీని వార్నింగ్‌తో సంతోషంగా కూడా ఉండలేకపోతున్నా అని వల్లి అనుకుంటుంది. ధీరజ్‌కు మంగళస్నానాలు చేస్తారు. అక్షింతలు వేసి అంతా ఆశీర్వదీస్తారు. ప్రేమను బలవంతంగా బయటకు తీసుకొస్తుంది శారదాంబ. నీకు కూడా అలా చేసి పెళ్లి మండపానికి తీసుకెళ్లేవారు. కానీ, నీ మూర్ఖత్వం వల్ల ఎలాంటి ఆనందాన్ని కోల్పోతున్నావో అర్థమవుతుందా అని శారదాంబ అంటుంది.
ఇంతలో పైనుంచి ప్రేమకు పసుపు నీళ్లు పోస్తాడు విశ్వ. మనం కూడా వాళ్లకంటే తక్కువ ఏం కాదని నిరూపించాలిగా. పెళ్లికూతురుకి కూడా మంగళస్నానం చేయించాలిగా. ఆపే ప్రసక్తే లేదని విశ్వక్ అంటాడు. అలా ధీరజ్, ప్రేమకు ఇద్దరికి మంగళస్నానాలు జరుగుతాయి. ధీరజ్ కుటుంబం సంతోషంగా గడపడం చూస్తుంది ప్రేమ.
నర్మదకు స్మిత కాల్ చేస్తుంది. ధీరజ్, ప్రేమలు విడిపోడానికి భద్రావతి, వల్లి, భాగ్యమే కదా కారణం అని నర్మద అడిగితే.. అవును. అసలు దీనంతటికి ప్రధాన సూత్రధారి వల్లినే. వాళ్లను విడదీయాలని వల్లినే ప్లాన్ చేసింది. దానికి భద్రావతిని వాడుకుంది అని స్మిత అంటుంది. ఆ ఫేక్ ఎస్సైని మనవాళ్లు పట్టుకున్నారు. అతనితో వల్లినే ఫోన్ చేయించింది. వల్లి అమ్మనాన్న వెళ్లి హోటల్‌లో ఎంక్వైరీ చేసి పెళ్లి వీడియో తీసుకున్నారు అని స్మిత చెబుతుంది.
వల్లి కుట్ర చేసిందన్న ఆధారాలు
దానికి సంబంధించిన వీడియోలు అన్ని పంపిస్తానంటుంది స్మిత. మరోవైపు ఆగిపోయే పెళ్లికి ఆర్భాటాలు ఎక్కువ అని సంతోషంగా డ్యాన్స్ చేస్తుంటుంది శ్రీవల్లి. కోపంగా రగిలిపోయిన నర్మద వచ్చి సీరియస్‌గా చూస్తుంది. దాంతో భయపడుతుంది వల్లి. సంతోషంగా రీల్స్ చేస్తున్నానని అంటుంది. కోపంగా నీటి గంగాళంలో వల్లిని ముంచుతుంది నర్మద.
వల్లి చేసిన పాపాల గురించి చెబుతుంది. ధీరజ్, ప్రేమలపై పగ పెంచుకుంటావా. విడగొట్టడానికి ఇంత పెద్ద కుట్ర చేస్తావా అని నర్మద మరింత ముంచుతుంది. నేను అమాయకురాలినని వల్లి అంటుంది. మీ అమ్మనాన్నను మోపిదేవికి ఎందుకు పంపించావ్ అని నర్మద అడుగుతుంది. ధీరజ్, ప్రేమల గురించి తప్పుగా అనుకుంటున్నారని అదేంటో తెలుసుకుందామని పంపించాను అంతే అని వల్లి అంటుంది.
ఊపిరి ఆడట్లేదు చెల్లాయ్ అని వల్లి అనడంతో ధీరజ్ పెళ్లి అయ్యేవరకు నీ ఆటలు. పెళ్లయ్యాక మామయ్య ముందు ఆధారాలతో నీ కుట్రలన్నీ బయటపెడతాను. అప్పుడు నీ గతేంటో చూసుకో అని నర్మద వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది. అమ్మో దీనికి ఏ ఆధారాలు దొరికాయో ఏంటో అని వల్లి భయపడుతుంది. మరోవైపు ధీరజ్‌ను పెళ్లికొడుకును చేస్తారు.
రోడ్డు మీద ధీరజ్, ప్రేమల కౌగిలింత
ప్రేమ కూడా పెళ్లికూతురుగా రెడీ అయి ఉంటుంది. ప్రేమ అనుకుంటూ ధీరజ్ మాట వినిపిస్తుంది. దాంతో బయటకు వచ్చి చూస్తుంది ప్రేమ. ధీరజ్ ఉంటాడు. ఇద్దరు ప్రేమగా చూసుకుంటారు. కిందకు వస్తుంది ప్రేమ. ధీరజ్, ప్రేమ ఇద్దరు కలుసుకుని రోడ్డు మీద హగ్ చేసుకుంటారు. కానీ, అదంతా ప్రేమ కల. ఇంతలో తల్లి రేవతి వచ్చి ప్రేమను త్వరగా రెడీ అవ్వమంటుంది.
తనను ఫోర్స్ చేయకండని ప్రేమ అంటుంది. భద్రావతి దగ్గరికి వచ్చిన సేనాపతి రామరాజు శుభలేఖలు పంచుతున్నాడని చెబుతాడు. ఆగని పెళ్లికి పంచనిరా. వాడే పరువే పోతుంది. ఇవాళ ఒక్కరోజుకు ఓపిక పట్టు. ధీరజ్, ప్రేమలను శాశ్వతంగా విడగొట్టి అప్పుడు చెబుదాం రామరాజు సంగతి అని భద్రావతి అంటుంది. ప్రేమపై కోపంగా అరుస్తుంది శారదాంబ.
ఆ మాటలు విని పైకి వెళ్తారు భద్రావతి, సేనాపతి. ప్రేమ వెళ్తానంటే చెప్పమను నేనే దిగబెడతాను. పిల్లల మనసులో ఉన్న బాధను అర్థం చేసుకోవాలని రేవతిని తిడుతుంది. ఈ గడువు పూర్తయ్యేసరికి ప్రేమను చింతామణి ఇంట్లో వదిలిపెడాతనని తీసుకెళ్తుంది భద్రావతి. మరోవైపు ధీరజ్‌ను పెళ్లికొడుకుగా చూసి వేదవతి మురిసిపోతుంది.
ఉలిక్కిపడిన వల్లి
నర్మదను చూసి శ్రీవల్లి తెగ భయపడుతుంది. ఏమైంది వదిన అంతలా ఉలిక్కిపడిపోయావ్ అని అమూల్య అంటుంది. ఏదో నీళ్లలో మునిగినట్టు అనిపించిందని వల్లి అంటుంది. మనం పెళ్లి మండపానికి బయలుదేరుదామని సాగర్ అంటాడు. ప్రేమ గురించి ఆలోచిస్తాడు ధీరజ్. అక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


