Illu Illalu Pillalu Serial: ఇల్లు ఇల్లాలు పిల్లలు- రామరాజు కుటుంబంపై గృహ హింస కేసు- చందు కోసం గోడలపై వల్లి ప్రేమ రాతలు!

Illu Illalu Pillalu Serial Latest Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్‌లో ఇంటి గోడలపై చందు కోసం ప్రేమ రాతలు రాసుకుంటుంది శ్రీవల్లి. చందు పేరుపై పడుకుని ఏడుస్తుంది. కూతురు బాధ చూడలేక రామరాజు కుటుంబంపై గృహ హింస కేసు పెట్టేందుకు తల్లి భాగ్యం కన్నింగ్ ప్లాన్ వేస్తుంది.

Published on: Oct 11, 2026, 09:46:55 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Illu Illalu Pillalu Serial Latest Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు తాజా ఎపిసోడ్‌లో శ్రీవల్లి ఆడుతున్న నాటకాలు పూర్తిగా బయటపడటంతో రామరాజు కుటుంబం సహనం నశించింది. "నీ గురించి తెలిసి కూడా మా కొంపను కూల్చుకోలేం. బయటకు నడు" అని వేదవతి గట్టిగా అరుస్తుంది.

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్

బతిమిలాడిన వల్లి

నర్మద, ప్రేమ, ధీరజ్, సాగర్‌లను క్షమించమని, మావయ్యకు నచ్చజెప్పమని బతిమిలాడుకుంటుంది శ్రీవల్లి. శ్రీవల్లి నర్మద, ప్రేమల కాళ్లావేళ్లా పడి క్షమించమని ప్రాధేయపడినా ఎవరూ కనికరించరు. అలాగే నాటకాలు ఆడుతుందని భావించిన వేదవతి, కామాక్షి, నర్మద, ప్రేమలకు సహనం నశించి వల్లిని, భాగ్యం కుటుంబాన్ని బయటకు గెంటేస్తారు.

ఇదే గొడవలో రామరాజు కుటుంబం నాశనమైపోతుందని భాగ్యం శాపనార్థాలు పెడుతుంది. దాంతో "నా కుటుంబం జోలికి వస్తే ఊరుకోను" అని నర్మద చెంపదెబ్బ కొట్టి మరి భాగ్యానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది. అదే కోపంలో భాగ్యం కుటుంబాన్ని నర్మద, వేదవతి ఫ్యామిలీ గేటు బయటకు గెంటేస్తారు. ఇకపై శ్రీవల్లితో తనకు ఎలాంటి సంబంధం లేదని చందు తేల్చి చెబుతాడు.

చూసుకుంటాం చూసుకుంటాం. సమాధానం ఇస్తాం అంటూ ఏదోటి చేస్తాను అన్నట్లుగా భాగ్యం వార్నింగ్ ఇచ్చి వల్లిని బలవంతంగా లాక్కెళ్తుంది. శ్రీవల్లి వెళ్లిన తర్వాత ఇంట్లో అందరూ దిగాలుగా కూర్చుంటారు. సుకన్య అందరికీ టీ ఇవ్వడానికి ప్రయత్నించగా నువ్వు వల్లిలాగే డ్రామాలు చేస్తావని ప్రేమ కోప్పడుతుంది. మోసగాళ్ల పక్కన చేరి సుక్కు కూడా నాటకాలు ఆడిందని మండిపడుతుంది.

సుకన్యకు వార్నింగ్

తిరుపతి బాబాయ్‌పై ఉన్న గౌరవాన్ని మనసులో ఉంచుకుని నర్మద జోక్యం చేసుకుంటుంది. ఇంట్లో ఉండాలంటే పద్ధతిగా నడుచుకోవాలని సుకన్యను హెచ్చరిస్తుంది నర్మద. ఇకపై ఈ ఇంట్లో శ్రీవల్లి పేరు ఎవరూ ఎత్తకూడదని చందు స్పష్టం చేస్తాడు. ఇంటికి వెళ్లిన శ్రీవల్లి కోపం నరానరాలకూ పాకింది. భాగ్యం తీసుకొచ్చిన అన్నం ప్లేట్‌ను విసిరికొడుతూ తన కాపురం ముక్కలు కావడానికి కన్నవాళ్లే కారణమని శ్రీవల్లి నిలదీస్తుంది.

క్షమించమని వేడుకునేందుకు మావయ్య రామరాజుకు ఫోన్ చేయగా, ఆయన ఫోన్ లిఫ్ట్ చేయడు. ఆ ఫోన్ కాల్‌ను వేదవతి కట్ చేస్తుంది. రామరాజు కుటుంబంలో మళ్లీ అడుగుపెట్టే అవకాశం లేకపోవడంతో శ్రీవల్లి తీవ్ర నిరాశకు గురవుతుంది. ఆవేశం తట్టుకోలేక కర్ర తీసుకుని తల్లి భాగ్యం, తండ్రి ఇడ్లీ బాబాయ్‌లపై దాడికి దిగుతుంది.

గోడలపై వల్లి ప్రేమ రాతలు

ఎంతో ప్రేమించిన బావ చందుకు దూరమైపోయానని వల్లి కుమిలిపోతుంది. ఇంటి గోడలపై వల్లి లవ్స్ చందు, వల్లి డై ఫర్ చందు (చందుకోసం వల్లి చస్తుంది) అని శ్రీవల్లి రాతలు రాస్తుంది. చందు పేరుపై తలపెట్టి ఏడుస్తుంటుంది వల్లి.

కూతురు బాధ చూడలేకపోతారు తల్లిదండ్రులు. ఏదోటి చేయాలని కన్నింగ్ ప్లాన్ వేస్తుంది భాగ్యం. వల్లిని తిరిగి అత్తింటికి పంపించేందుకు రామరాజు కుటుంబాన్ని నిందించాలనుకుంటుంది. దానికి ఏం చేస్తావని ఇడ్లీ బాబాయ్ అడుగుతాడు.

మనల్నీ, నా కూతురును అవమానించి గెంటేసినందుకు ఆ రామరాజు కుటుంబంపై, నర్మద, ప్రేమ, వేదవతిలపై పగ తీర్చుకుంటాను. మన అమ్మడిని ఆ చందు చిత్ర హింసలు పెడుతున్నాడని పోలీసులకు కంప్లైంట్ ఇస్తాను. రామరాజు కుటుంబంపై గృహ హింస కేసు పెడతానని భాగ్యం అంటుంది. దానికి ఇడ్లీ బాబాయ్ మైండ్ బ్లాక్ అవుతుంది.

భాగ్యం కన్నింగ్ ప్లాన్

ఇప్పటికే మనమీద వాళ్లు పీకల్లోతి కోపంలో ఉన్నారు. ఇప్పుడు ఇలా కేసు పెడితే ఇంకా ఊరుకుంటారా అని ఇడ్లీ బాబాయ్ అంటాడు. ఏదైతే అది అయింది. మన కూతురుని ఆ ఇంటికి పంపించాలంటే ఇదే దారి అని భాగ్యం స్కెచ్ వేస్తుందని సమాచారం.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More