Illu Illalu Pillalu September 12 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు- తిరుపతి పెళ్లి చేసిన ధీరజ్- వేదవతిపై తమ్ముడు రివర్స్

Illu Illalu Pillalu Serial September 12th Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే సెప్టెంబర్ 12వ ఎపిసోడ్‌లో తిరుపతిని తీసుకెళ్లి గుడిలో సుకన్యతో పెళ్లి చేస్తారు ధీరజ్, ప్రేమ. రామరాజు ఇంటికి కొత్త జంటను తీసుకెళ్తాడు. ఆ జంటను చూసి వేదవతి స్పృహ తప్పి పడిపోతుంది. భద్రావతి రామరాజు ఇంటికి వస్తుంది.

Published on: Sep 12, 2026, 08:50:25 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈరోజు ఎపిసోడ్‌లో టైర్లో గాలి తీసి రెడీగా ఉండమని ధీరజ్ చెబితే తాము వచ్చే కారు టైర్లో గాలి తీస్తుంది ప్రేమ. అది చూసిన ధీరజ్ కోప్పడుతాడు. నువ్వే సరిగా చెప్పలేదని ప్రేమ అంటే.. నువ్వు నోటితోనే బతికేస్తావే అని ధీరజ్ అంటాడు.

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ సెప్టెంబర్ 12వ ఎపిసోడ్
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ సెప్టెంబర్ 12వ ఎపిసోడ్

పాము పాము అంటూ అరిచిన ధీరజ్

మరోవైపు ఉంగరం తొడగమని తిరుపతితో పంతులు అంటాడు. చేసేది లేక తిరుపతి రింగ్ తొడగబోతుండగా.. ధీరజ్ వచ్చి పాము పాము అని అరుస్తాడు. దాంతో అంతా కంగారుపడి అటు ఇటు తిరుగుతారు. లగెత్తు మామ అని ధీరజ్ అంటాడు. ఇద్దరు పరుగెత్తుతారు. అల్లుడు గుడి మెట్లు దాటకూడదు అని చింతామణి రౌడీలను పంపిస్తుంది.

తిరుపతి, ధీరజ్ పరుగెడుతారు. కారులో తిరుపతిని ధీరజ్ తీసుకెళ్తాడు. తమ టైర్లో గాలి తీశారని తెలుస్తుంది. రేయ్ ధీరజ్‌గా ఎంత దూరం వెళ్తావో వెళ్లురా అని భద్రావతి కోప్పడుతుంది. శంభో శివ శంభో అంటూ బీజీఎమ్ ప్లే అవుతుంది. ధీరజ్ కారు వెనుక చింతామణి రౌడీలు పరుగెడతారు. టైమ్‌కి దేవుడిలా వచ్చావురా అని తిరుపతి థ్యాంక్స్ చెబుతాడు.

ఓ గుడికాడ ధీరజ్, తిరుపతి ఆగుతారు. హమ్మయ్య ఎవరు రావట్లేదని సుకన్య అంటుంది. కానీ, నర్మద కనిపిస్తుంది. పులి బోనులో నుంచి సింహం బోనులో పడ్డట్టయిందని సుకన్య అంటుంది. అందరిని గుడిలోపలికి తీసుకెళ్తాడు ధీరజ్. పంతులుతో పెళ్లి త్వరగ చేయమని చెబుతారు. గుడిలోకి నర్మద వస్తుంది. మంత్రాలు పూర్తిగా వద్దు తాళి మాత్రం కట్టించండని ధీరజ్ అంటాడు.

నర్మద కాళ్లపై తిరుపతి సుకన్య

తిరుపతి మురిసిపోతాడు. నా పొలంలో మొలకలు వచ్చాయిరో అని తిరుపతి అంటాడు. నర్మదను గుర్తు చేస్తుంది ప్రేమ. తర్వాత సుకన్యకు తాళి కడతాడు తిరుపతి. ప్రేమ జడ ఎత్తిపట్టుకుంటుంది. తిరుపతి సుకన్య పెళ్లి జరగడం నర్మద చూస్తుంది. తిరుపతి సంతోషంగా గెంతులు వేస్తాడు. పెద్దవాళ్ల ఆశీర్వాదం తీసుకోండని పంతులు అంటాడు.

దాంతో ధీరజ్, ప్రేమల దగ్గర తిరుపతి సుకన్య ఆశీర్వాదం తీసుకుంటారు. నర్మద వచ్చి ధీరజ్‌ను తిడుతుంది. అక్షింతలు ఇచ్చి ఆశీర్వదించమంటాడు ధీరజ్. పంతులు వచ్చి అక్షింతలు చేతిలో ఉన్నప్పుడు ఆశీర్వదించాలి. లేకుంటే అరిష్టం అని అంటాడు. నర్మద కాళ్లపై తిరుపతి సుకన్య పడతారు. దాంతో ఏం చేయలేక నర్మద కూడా ఆశీర్వదిస్తుంది.

మీ పెళ్లికి నర్మద వదిన కూడా సంపూర్ణ మద్దతు ఇచ్చింది కాబట్టి మెజారిటీ ఓట్లు పడినట్లే. వెళ్లి ప్రదక్షిణలు చేసి రండని ధీరజ్ అంటాడు. తిరుపతి సుకన్య వెళ్తారు. ధీరజ్, ప్రేమలను తిడుతుంది నర్మద. ఆరోజు నీతో పెళ్లి జరగకుంటే మా నడిపోడు ఎలా చనిపోతాను అన్నాడో తిరుపతి మామ కూడా అన్నాడు. ఆరోజు మీ విషయంలో చేసింది తప్పు అయితే ఇది తప్పే అని డైలాగులు కొడతాడు ధీరజ్.

ప్రేమ వచ్చి ఉంటుంది

కానీ, నర్మద రివర్స్ అవుతుంది. ఇప్పుడు వాళ్లను ఇంటికి తీసుకెళ్తే ఏంటీ పరిస్థితి అని నర్మద అడుగుతుంది. ఏం జరిగిన ఫేస్ చేయాల్సిందే అని ధీరజ్ అంటాడు. తర్వాత ఇంటికి వెళ్లిన ధీరజ్ మీకోసం ఒకరు వచ్చారు. బయట ఉన్నారు. రండని వేదవతి, రామరాజుతో అంటాడు. అందరిని పిలుస్తాడు ధీరజ్. వచ్చింది మన ప్రేమ. అందుకే ఇంత హడావిడి చేస్తున్నాడని వేదవతి అంటుంది.

ఫస్ట్ మీరు రండి. మీకు సర్‌ప్రైజ్ అని ధీరజ్ అంటాడు. దాంతో అంతా వెళ్తారు వేదవతి కళ్లు మూసి తీసుకెళ్తాడు ధీరజ్. తిరుపతి సుకన్యను జంటగా చూసి అంతా షాక్ అవుతారు. శ్రీవల్లి మాత్రం సంతోషిస్తుంది. స్కూటీపై నర్మద వస్తుంది. పరిస్థితుల ప్రభావం వల్ల పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందక్కా అని తిరుపతి అంటాడు. వేదవతి స్పృహ కోల్పోతుంది.

తర్వాత తేరుకుంటుంది. ఇద్దరిని ఆశీర్వదించమని ధీరజ్ అంటే.. వేదవతి కోప్పడుతుంది. ఏయ్ వగలాడి నా తమ్మున్ని తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నావా అని సుకన్యను కొడుతుంది వేదవతి. చెంపలు ఎడాపెడా వాయిస్తుంది. దాంతో వేదవతిపై తిరుపతి కోప్పడుతాడు. అక్క తనదేం తప్పులేదు. నేనే వెళ్లి పెళ్లి చేసుకున్నాను అని తిరుపతి అంటాడు.

రామరాజు ఇంట్లో రచ్చ

దాన్ని వెనుకేసుకొచ్చావంటే చంపేస్తానని తిరుపతిపై చేయి ఎత్తుతుంది వేదవతి. రామరాజు ఆగమంటాడు. ప్రేమించుకుంటే పెళ్లి చేసుకునేందుకు మాకు చెప్పాలనిపించాల్సిన అవసరం లేదా అని రామరాజు అంటాడు. ఇంతలో భద్రావతి వాళ్లు వస్తారు.

ఇలా లేచిపోయి పెళ్లి చేసుకునేందుకు సిగ్గు లేదా అని సుకున్యను కొడుతుంది శ్రీవల్లి. డ్రామా చేస్తుంది. భద్రావతి అరుస్తూ వస్తుంది. అక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More