Illu Illalu Pillalu September 11 Episode:ఇల్లు ఇల్లాలు పిల్లలు-భాగ్యంని కొట్టిన నర్మద-ధీరజ్ కారు టైర్లో గాలి తీసిన ప్రేమ
Illu Illalu Pillalu Serial September 11th Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే సెప్టెంబర్ 11వ ధీరజ్, ప్రేమ కారులో వెళ్లడం చూసిన నర్మద ఫాలో అవుతుంది. సుక్కుని కార్లో ఎక్కించుకోవడం ధీరజ్‌కు కాల్ చేస్తుంది నర్మద. కానీ, ధీరజ్ లిఫ్ట్ చేయడు. ప్రేమకు కాల్ చేసి పెళ్లి జరిపించొద్దని నర్మద చెబుతుంది.
Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈరోజు ఎపిసోడ్‌లో వీధి చివర ధీరజ్ కారు ఎక్కుతుంది ప్రేమ. అది నర్మద చూస్తుంది. ఇలా దొంగచాటుగా ఇద్దరు వెళ్లడం ఏంటీ. వీళ్లిద్దరు నా ముందు ఏదో డ్రామాలు ఆడుతున్నారు. అదేంటో తెలుసుకోవాలని నర్మద ఫాలో అవుతుంది.

భద్రావతిని పొగిడిన సేనాపతి
మరోవైపు ఎవరికి తెలియకుండా భలే పెళ్లి చేస్తున్నావని భద్రావతిని పొగుడుతాడు సేనాపతి. రామరాజు ఇంట్లో ఇన్నేళ్లు పెరిగాడు. వాళ్లకు ఇలా పెళ్లి చేయడం కరెక్ట్ కాదని శారదాంబ అంటుంది. అంత పెంచినవాళ్లు అయితే గాలికొదిలేయరు అని భద్రావతి అంటుంది.
మరోవైపు భాగ్యం ఇంటికి ధీరజ్, ప్రేమ వస్తారు. సుకన్యను తీసుకెళ్తారు. ఇక్కడ జరిగినదానికి మాకు ఎలాంటి సంబంధం లేదు. అంతా నీదే పూచి అన్నట్లుగా మాట్లాడుతుంది భాగ్యం. దీన్ని తిరుపతి బాబాయ్ మీదకు ఉసిగొలిపి ఇప్పుడు ఏం సంబంధం లేదంటారా అని ప్రేమ తిడుతుంది. లేట్ అవుతుందని సుకన్య చెప్పడంతో కారులో వెళ్తారు.
అది చూసిన నర్మద ధీరజ్ అని పిలుస్తుంది. నర్మదను ధీరజ్ చూస్తాడు. అది తెలిసి ప్రేమ, సుకన్య భయపడతారు. నర్మదను భాగ్యం, ఇడ్లీ బాబాయ్ కూడా చూస్తారు. భాగ్యం వాళ్ల దగ్గరికి నర్మద కోపంగా వస్తుంది. వద్దు బాబు.. మా సుక్కుని తీసుకెళ్లొద్దు.. తీసుకొచ్చేయ్ అని భాగ్యం, ఇడ్లీ బాబాయ్ కావాలనే డ్రామా చేస్తారు.
కొడితే కొట్టింది గానీ
ఏంటీ ఏం నాటకాలు ఆడుతున్నారా. మీకు ఏమాత్రం తెలియకుండానే తనను తీసుకెళ్తున్నారా అని నర్మద అంటుంది. ఒట్టు అమ్మా మాకు ఏం తెలియదని ఇడ్లీ బాబాయ్ అంటాడు. దాంతో నర్మద కోపంగా చూస్తుంది. దాంతో రెండు చెంపలు పట్టుకుంటారు భాగ్యం, ఇడ్లీ బాబాయ్. నర్మద వెళ్లిపోతుంది. కొడితే కొట్టింది కానీ వదిలేసింది అదే పది ఇడ్లీ అని ఇడ్లీ బాబాయ్ అంటాడు.
వదిలిపెడతానా.. అంతకంతా బదులు తీర్చుకోకుండా వదిలిపెట్టను అని భాగ్యం పగతో ఊగిపోతుంది. మీ నర్మద వదిన చూసిందిగా ఏదైనా ప్రాబ్లమ్ చేస్తుందా అని ధీరజ్‌ను సుకన్య అడుగుతుంది. అవుతుందే అవుతుందే నీలాంటి మాయలాడితే మా బాబాయ్ పెళ్లి జరగకుండా అన్ని నాశనం అవుతాయని ప్రేమ అంటుంది. ఇంతలో ధీరజ్‌కు నర్మద కాల్ చేస్తుంది.
ధీరజ్ లిఫ్ట్ చేయదు. ఫోన్ ఎత్తితే తాట తీస్తుందని ధీరజ్ అంటాడు. దాంతో ప్రేమకు కాల్ చేస్తుంది నర్మద. నన్ను అడ్డంగా ఇరికించి సచ్చావ్‌గారా అని ప్రేమ అంటుంది. ప్రేమ లిఫ్ట్ చేస్తుంది. ముందు మీ ఆయనకు ఇవ్వు అని నర్మద అంటుంది. నేను కోచింగ్ సెంటర్‌లో ఉన్నా. వాడి ఒళ్లో ఉన్నానా ఏంటీ అని ప్రేమ అంటుంది.
నర్మద మాట వినని ధీరజ్
నేను మీ ఇద్దరిని చూసిన విషయం నీకు కూడా తెలుసు కానీ ఫోన్ స్పీకర్‌లో పెట్టు అని నర్మద అంటుంది. ధీరజ్ ఫస్ట్ కారు ఆపు అని నర్మద అంటే.. సారీ వదిన అని ధీరజ్ అంటాడు. ఆ వగలాడితో తిరుపతి బాబాయ్ పెళ్లి చేయడం ఏంటని తిడుతుంది నర్మద. సుక్కుతో పెళ్లి జరగకుంటే తిరుపతి మామ చస్తానంటున్నాడు అని ధీరజ్ అంటాడు.
మీరు ఈ పెళ్లి చేస్తే రెండు కుటుంబాల మధ్య మరింత గొడవలు అవుతాయని నర్మద అంటుంది. అయిన ధీరజ్ వినడు. నర్మదకు కనిపించకుండా ఫాస్ట్‌గా కారును తీసుకెళ్లిపోతాడు ధీరజ్. మరోవైపు గుడిలో ఉంగరాలు మార్చుకోమ్మని తిరుపతితో పంతులు అంటాడు. తిరుపతి సుకన్య కోసం బాధపడుతుంటాడు. పాస్ వస్తుందని, లేచి వెళ్తానంటాడు తిరుపతి.
ఉంగరం మార్చాక వెళ్లు అని భద్రావతి అంటుంది. తిరుపతి, విశ్వ ఎంత చెప్పిన భద్రావతి వినదు. ఉంగరం చూస్తూ వణికిపోతాడు తిరుపతి. కొంపదీసి నరాల బలహీనత ఉందేంటీ అని చింతామణి అంటుంది. అదేం లేదు, అలాంటి పరిస్థితికి ఇంకా రాలేదని తిరుపతి అంటాడు. ఓహో టెన్షనా. పెళ్లిలో మీ మావయ్య చేతులు కూడా ఇలాగే వణికేవి అని చింతామణి అంటుంది.
ధీరజ్ కారు టైర్లలో గాలి తీసిన ప్రేమ
గుడి దగ్గర ధీరజ్ కారు ఆపుతాడు. గుడిలోకి రమ్మంటే మావాళ్లు చూస్తే చంపేస్తారు రానని ప్రేమ అంటుంది. సరే ఈలోపు టైర్లలో గాలి తీసి రెడీగా ఉండు అని ధీరజ్ వెళ్తాడు. దాంతో తాము వచ్చిన కారు టైర్లో గాలి తీస్తుంటుంది ప్రేమ. మళ్లీ ఏదో చెప్పబోయి వెనక్కి చూసిన ధీరజ్ తిడతాడు. ఇంత మట్టి బుర్రవి ఎక్కడ దొరికావే అని ధీరజ్ అంటాడు. అక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


