Illu Illalu Pillalu November 10 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు-ట్విస్టులు-అంజలినే కావాలన్న చందు-తండ్రి దగ్గర ధీరజ్ అప్పు
Illu Illalu Pillalu November 10 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే నవంబర్ 10 ఎపిసోడ్ లో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటాయి. అంజలి, చందు కలుసుకుంటారు. అంజలిని తనతోనే ఉండిపొమ్మని చందు అడుగుతాడు. ఇటు తండ్రి దగ్గర రూ.30 లక్షలు అప్పు తీసుకున్నట్లు ధీరజ్ ప్రామిసర్ నోటు రాసిస్తాడు.
Illu Illalu Pillalu November 10 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. చందు ప్రేమను గుర్తు చేసుకుంటూ అంజలి బాధపడుతుంటుంది. నువ్వు నన్ను ప్రేమించినప్పుడు నాకిచ్చిన మాట మీద నిలబడి ఉంటే నా జీవితం ఇలా అయి ఉండేది కాదు. ఎందుకు చందు మన ప్రేమను చంపేశావ్? అని అంజలి అనుకుంటుంది.

ఫుల్ గా తాగిన చందు
ఇటు చందు ఫుల్ గా తాగి రోడ్డు మీద తులూతూ వస్తాడు. నా జీవితం సర్వనాశనమైపోయింది. ఆ వల్లి అమాయకురాలనుకొని నెత్తిన, గుండెల్లో పెట్టుకున్నా. నా గుండెల మీద తన్ని, నా ప్రేమకు తలకొరివి పెట్టేసిందని అరుస్తూ రాయి తగిలి అంజలి ఇంటి ముందు రోడ్డు మీద చందు పడిపోతాడు.
అంజలి షాక్
ఆ సౌండ్ కు అంజలి బయటకు వస్తుంది. చందును చూసి షాక్ అవుతుంది. లే చందు అని అంజలి ఏడుస్తుంది. అప్పుడే కళ్లు తెరిచిన చందుకు అంజలి కనిపించడంతో మైండ్ బ్లాక్ అవుతుంది. నువ్వు నిజంగా నా అంజలివేనా అంజలి? నేనంటే నీకు ఎంత పిచ్చి ప్రేమ. నా జీవితంలోకి రాలేదని నా కలలోకి వచ్చావా? నిజంగా నీది గొప్ప ప్రేమే అని చందు అంటాడు.
నీకు అన్యాయం చేశా అంజలి
నీ కోసమే తాగాను. నీకు చేసిన అన్యాయం గుర్తొచ్చి తాగా. నా జీవితం సర్వ నాశనమైపోయిందని తాగా. నా జీవితమే పెద్ద ప్రాబ్లెం. అది చెప్పుకునేంత మంచి ప్రాబ్లెం కాదు అంజలి. నేను ఇంటికి వెళ్లను. నీ దగ్గరే ఉంటా. కల పోతుంది అంజలి అని చందు కలలోనే ఉన్నాననే భ్రమలో మాట్లాడతాడు. అప్పుడే ఆటోలో చందును తీసుకుని రామరాజు ఇంటికి అంజలి వెళ్తుంది.
వేదవతి సంబరం
మరోవైపు రామరాజు ఇంట్లో అందరూ కూర్చుని భోజనం చేస్తుంటారు. ప్రేమను నర్మద ఆట పట్టిస్తుంది. అప్పుడే ధీరజ్ రావడంతో చిన్నోడికి నచ్చినవన్నీ చేశానని వేదవతి అంటుంది. ఆ భాగ్యాన్ని తన తండ్రి కాళ్లు పట్టుకునేలా చేశాడు. కానీ కొంతమంది మాత్రం మోసం చేసినవాళ్లకే సపోర్ట్ చేస్తారని నర్మద ఉడుక్కునేలా వేదవతి మాట్లాడుతుంది.
నడిపోడికి రూ.20 లక్షలు
ట్రావెల్ ఏజెన్సీ విషయంలో చింతామణిని నమ్మిన ధీరజ్ ను రామరాజు ప్రశ్నిస్తాడు. అలాగే చివాట్లు పెట్టండని ప్రేమ చెప్తుంది. కొడుకులకు ఉన్న ప్రేమ కోడళ్లకు ఉండదని వేదవతి అంటుంది. భాగ్యంపైకి చిన్నోడు కారు తీసుకెళ్లాడని, ఈ పెంకి పిల్ల ప్రేమ ఇంకా రెచ్చగొట్టిందని రామరాజు చెప్తాడు. ధీరజ్ వాళ్లు చేసిన చాలా ఆనందంగా ఉందని సుక్కు కూడా అంటుంది.
నడిపోడికి రూ.20 లక్షలు కావాలేమో అడుగు బుజ్జమ్మా అని రామరాజు అంటాడు. నా కాళ్ల మీద నేను నిలబడగలను. నా డబ్బ నా దగ్గర ఉందని సాగర్ పొగరుగా సమాధానం చెప్తాడు. కొంపమీదకు ఏం తీసుకువస్తావేమోనని భయంగా ఉందని రామరాజు అంటాడు.
తండ్రి దగ్గరే ధీరజ్ అప్పు
భోజనాలు తిన్న తర్వాత రామరాజుకు ధీరజ్ షాక్ ఇస్తాడు. తన తండ్రి దగ్గర రూ.30 లక్షలు అప్పు తీసుకున్నట్లు, ఎంత వడ్డీ అయినా ప్రతి నెల కడతానని ప్రామిసరీ నోటులో రాసి ఇస్తాడు. ఈ ప్రామిసరీ నోటు సుక్కు చదివి చెప్తుంది. ఏంట్రా ఇది అని రామరాజు అడుగుతాడు. ఆ డబ్బు నేనైతే అప్పుగానే తీసుకోగలను. మీరు డబ్బు ఊరికే ఇచ్చేస్తా దాని వాల్యూ నాకు తెలియదు నాన్న. మీరు అప్పుగా ఇచ్చారని చెప్తేనే తీసుకుంటా. లేదంటే వేరే ఎక్కడైనా తీసుకొచ్చి ఇచ్చేస్తానని ధీరజ్ అంటాడు.
అప్పుడే సాగర్ వెటకారంగా నవ్వుతాడు. ఆ ప్రామిసరీ నోటును బీరువాలో పెట్టు. ట్రావెల్ ఏజెన్సీ పెట్టుకోమని నీ కొడుక్కు చెప్పు అని రామరాజు అనడంతో అందరూ నవ్వేస్తారు. మా ఆయన బంగారం అని కోడళ్ల దగ్గర వేదవతి తెగ బిల్డప్ ఇస్తుంది.
భద్రావతి మరో కుట్ర
ఇక రామరాజు ముందు పాతికేళ్లుగా ఓడిపోతూనే ఉన్నా. మళ్లీ రామరాజు గెలిచాడు. ధీరజ్ తప్పించుకున్నాడు. ఏం చేస్తే రామరాజు మీద పగ తీర్చుకోగలను? ప్రతిసారి వాళ్ల నవ్వులు చూడలేక నరకం చూస్తున్నారా సేనా అని భద్రావతి రగిలిపోతుంది. ధీరజ్ ఏదో ఒక చోట మనకు దొరుకుతాడు. ట్రావెల్ ఏజెన్సీ విషయంలో ఆటాడుకుందామని సేనాపతి అంటాడు.
ట్రావెల్ ఏజెన్సీకి నన్ను రమ్మంటాడా? వాడికి బుద్ధి చెప్పాలి. నన్నెందుకు పిలిచాడా అని బాధపడాలి. వాడు ట్రావెల్ ఏజెన్సీ ఎలా ఓపెన్ చేస్తాడో చూస్తా. నువ్వు భాగ్యానికి రేప్పొద్దున పని ఉందని చెప్పు. ఈ భద్రావతి వెల్ కం ఎలా ఉంటుందో ఆ ధీరజ్ కు రుచి చూపిస్తానని భద్రావతి మరో కుట్రకు తెరతీస్తుంది.
నాతో ఉండిపో అంజలి
ఇటు ఆటోలో చందు, అంజలి వస్తారు. కలలో కూడా నన్ను వదిలేసి వెళ్లిపోతావా అంజలి. అందుకే అడ్రెస్ చెప్పను. నాతో ఉండిపో అంజలి ప్లీజ్. నువ్వు నాకు కావాలి. ఎవరు అడ్డొచ్చినా సరే నేను నీతోనే ఉంటానని చందు అనడంతో అంజలి ఎమోషనల్ అవుతుంది. నువ్వేం మారలేదు చందు. నా దగ్గర ప్రేమగా ఉంటావ్. మీ నాన్నకు భయపడతావ్. ఆ భయమే కదా మనల్ని దూరం చేసిందని అంజలి అడగుతుంది.
ఇప్పుడు అలా కాదు. మా నాన్న చేతిలో నుంచి నా జీవితాన్ని లాగేసుకున్నా. నన్ను అడిగేవాళ్లు ఎవరూ లేరు అంజలి. ఇష్టమొచ్చినట్లు బతకొచ్చని చందు చెప్తాడు. ఇక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


