Illu Illalu Pillalu October 26 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు-రామరాజు మాట వినని ధీరజ్, సాగర్-మనిషిగా మారనున్న బల్లక్కాయ్
Illu Illalu Pillalu October 26 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే అక్టోబర్ 26 ఎపిసోడ్ లో ధీరజ్ డబ్బులకు బదులు ఐస్ క్రీమ్ తీసుకొని వస్తాడు. రామరాజు ల్యాండ్ అమ్మేందుకు ధీరజ్, సాగర్ ఒప్పుకోరు. మనిషిగా మారాలని బల్లక్కాయ్ అనుకుంటుంది. రామరాజు, వేదవతి నవ్వులు చూసి భద్రావతికి మండిపోతుంది.
Illu Illalu Pillalu October 26 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. రూ.30 లక్షల డబ్బుతో, మూడు మూరెల మల్లెపూలతో వస్తాడు నా రాజు అంటూ ప్రేమ గదిలో గంతులేస్తుంది. అప్పుడే వచ్చిన ధీరజ్ ప్రేమను చూసి షాక్ అవుతాడు. ఏంటి నాధా వచ్చావా? అని ప్రేమ అడుగుతుంది.

ప్రేమ బిల్డప్
ప్రేమకు ధీరజ్ బ్యాగ్ ఇస్తాడు. డబ్బు తీసుకురావడం వరకే నీ పని అని ప్రేమ అంటుంది. ధీరజ్ చెప్పేందుకు ట్రై చేసినా ప్రేమ వినదు. రేపు ఉదయమే ఈ బ్యాగ్ పట్టుకొని వెళ్లి మా భద్రావతి అత్తను బయటకు పిలిచి రప్ఫాడిస్తా అని ప్రేమ తెగ బిల్డప్ ఇస్తుంది.
ఐస్ క్రీమ్ తో ఆటలు
నీ డైలాగ్ అయిపోయేసరికి అందులో ఉన్న ఐస్ క్రీమ్ కరిగిపోతుంది తినమని ప్రేమకు ధీరజ్ చెప్తాడు. ఐస్ క్రీమ్ హా, థ్యాంక్స్ రా మరి రూ.30 లక్షలు ఏవీ అని ప్రేమ అడుగుతుంది. ఊరంతా తిరిగినా రూ.30 వేలు కూడా అప్పు పుట్టలేదని ధీరజ్ చెప్తాడు. ఐస్ క్రీమ్ ఏం వద్దని ప్రేమ అలుగుతుంది. సరే అని ధీరజ్ ఒక్కడే ఐస్ క్రీమ్ తింటూ ఊరిస్తాడు. వెనీలా ఫ్లేవర్ అనగానే ప్రేమ వచ్చి లాక్కుని తినేస్తుంది.
విశ్వ మాటలే
మరోవైపు అమూల్య చదువుకుంటుంది. కానీ విశ్వ మాటలు గుర్తుకు రావడంతో అమూల్య డైవర్ట్ అవుతుంది. వీడిని అర్జెంట్ గా మనసులో నుంచి తీసేయాలి. వాడు మంచోడిలా జీవిస్తున్నాడు. నా మైండ్ ను మార్చాలని చూస్తున్నాడు. వాడిని నా మైండ్ లో నుంచి డిలీట్ చేయాలి. ఎలా చేయాలి? అని వాడు దుష్టుడు అంటూ అమూల్య మెడిటేషన్ చేస్తూ నిద్రలోకి జారుకుంటుంది.
పూర్తిగా మారాలి
ఇటు భాగ్యం ఇంట్లో ఇడ్లీ బాబాయి నిద్రలో కలవరిస్తాడు. కానీ శ్రీవల్లి మాత్రం నిద్రపోకుండా బయటకు వస్తుంది. శిక్ష అనుభవించాల్సేందనన్న ధీరజ్ మాటలను గుర్తు చేసుకుంటూ బల్లక్కాయ్ బాధపడుతుంది. రామరాజు ఇంట్లో తనను మహారాణిలా చూసుకున్న రోజులను తలుచుకుని ఏడుస్తుంది. అంతా చేతులారా చేసుకున్నా. నేను పూర్తిగా మనిషిగా మారాలి. కానీ అవకాశం ఇచ్చేవాళ్లు ఎవరూ లేరు కదా అని శ్రీవల్లి అనుకుంటుంది.
ల్యాండ్ అమ్మాలని
ఉదయం రామరాజు ఇంటికి ల్యాండ్ బ్రోకర్ నాగరాజు వస్తాడు. ల్యాండ్ అమ్మాలని కాల్ చేశారు కదా అని నాగరాజు అడుగుతాడు. అందరూ వచ్చి షాక్ అవుతారు. ల్యాండ్ అమ్మాల్సిన అవసరం ఏముందని నర్మద అడుగుతుంది. కొడుకులను కన్నాక అమ్ముకోక ఏం చేస్తామని రామరాజు కఠినంగా మాట్లాడతాడు. మంచి మనసుతో చేసేది చేస్తూ మళ్లీ ఈ మాటలు ఎందుకంటా అని వేదవతి అంటుంది.
డబ్బు తీసుకోను
చిన్నోడు ధీరజ్ కు రూ.30 లక్షలు, సాగర్ సేట్ కు కట్టడానికి రూ.20 లక్షలు మొత్తం రూ.50 లక్షలు కావాలి కదా. అందుకే ఓ స్థలాన్ని అమ్మాలని అనుకుంటున్నారని వేదవతి క్లియర్ గా చెప్తుంది. కానీ ధీరజ్ మాత్రం అందుకు ఒప్పుకోడు. బయటే చూసుకుంటానని చెప్తాడు. సాగర్ కూడా ఆ డబ్బు తీసుకోనంటాడు. నేను డబ్బు కావాలని అడగలేదు కదా అని సాగర్ అంటాడు.
నర్మద రిక్వెస్ట్
అందరం కలిసి ఉన్న కుటుంబంలో పిల్లల అవసరాలు తెలియదా అని వేదవతి అంటుంది. చిన్నోడి మీద నాకు నమ్మకం ఉంది. కానీ నువ్వు డబ్బు కోసం ఏ దొంగదారి వెతుక్కుంటావోనని భయం అని సాగర్ పై రామరాజు ఫైర్ అవుతాడు. సాగర్ కూడా తగ్గకుండా మాట్లాడతాడు. ప్లీజ్ మామయ్య సాగర్ కు ఒక అవకాశం ఇవ్వమని రామరాజును నర్మద రిక్వెస్ట్ చేస్తుంది.
రామరాజు, వేదవతి నవ్వులు
నా కొడుకులు, నీ కొడుకులు అంటూ రామరాజు, వేదవతి గొడవ పెట్టుకుంటారు. మీ బుర్ర వేడిని తగ్గిస్తానని రామరాజు తలకు వేదవతి ఆయిల్ తో మర్దన చేస్తుంది. వాడి బాబును నేను, ఎందుకు తీసుకోడో చూస్తానని రామరాజు అన్న మాటలను గుర్తు చేసుకొని వేదవతి నవ్వుతుంది. వాళ్లకు అన్నీ నీ పోలికలు వచ్చాయని రామరాజు సెటైర్ వేస్తాడు. ఇద్దరూ నవ్వుకుంటూ ఉంటారు.
మండిపోతున్న భద్రావతి
వేదవతి, రామరాజును అలా చూసి భద్రావతి, సేనాపతికి మండిపోతుంది. పాతికేళ్లుగా రామరాజుపై పగ తీర్చుకోవడం కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాం. కానీ వాడి నుంచి ఆ నవ్వులను మాత్రం దూరం చేయలేకపోతున్నాం. పదే పదే అవమానించినా అంత సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నారు సేనా అని భద్రావతి తన తమ్ముడిని భద్రావతి అడుగుతుంది. వాడి కుటుంబమే వాడి బలం అక్క అని సేనాపతి చెప్తాడు.
కుటుంబం బలమే కాదు బలహీనత అని నిరూపిస్తా. ట్రావెల్స్ విషయంలో ధీరజ్ ను కోలుకోలేని దెబ్బ కొడతా. ధీరజ్ అనే పిల్లర్ ను కూల్చేసి, వాడి కుటుంబాన్ని కూల్చేస్తానని భద్రావతి కన్నింగ్ గా చెప్తుంది.
మరోవైపు నర్మద ఆఫీస్ దగ్గర బల్లక్కాయ్ వెయిట్ చేస్తుంటుంది. ఏంటి గొడవ చేయడానికి వచ్చావా? నిన్నే నేను గెంటేశానని ఆఫీసులో అందరికీ చెప్పి బ్యాడ్ చేద్దామని వచ్చావా? బ్లాక్ మెయిల్ చేస్తావా? అని వల్లిని నర్మద అడుగుతుంది. ఇక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


