Illu Illalu Pillalu October 27 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు.. నర్మదకు తెలిసిన సాగర్ లంచావతారం- భద్రావతి ఉచ్చులో ధీరజ్

Illu Illalu Pillalu October 27 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే అక్టోబర్ 27 ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్ సాగుతుంది. మారేందుకు ఛాన్స్ ఇవ్వమని అడిగిన బల్లక్కాయ్ మాటలకు నర్మద కరిగిపోతుంది. సాగర్ లంచావతారం గురించి నర్మదకు తెలుస్తుంది. ఇటు చింతామణ ఆఫర్ తో భద్రావతి ఉచ్చులో ధీరజ్ చిక్కుకుంటాడు. 

Published on: Oct 27, 2026, 07:49:25 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Illu Illalu Pillalu October 27 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. తన ఆఫీస్ దగ్గర వల్లిని చూసి నర్మద షాక్ అవుతుంది. గొడవ చేయడానికి వచ్చావా? నేనే నిన్ను ఇంట్లో నుంచి గెంటేశానని చెప్పి ఆఫీసులో బ్యాడ్ చేద్దామనుకుంటున్నావా? అని బల్లక్కాయ్ ను నర్మద అడుగుతుంది.

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే ఎపిసోడ్ (jiohotstar)
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే ఎపిసోడ్ (jiohotstar)

బల్లి మేడం ఎందుకొచ్చారు?

నేను అందుకోసం ఇక్కడికి రాలేదని బల్లక్కాయ్ చాలా నెమ్మదిగా మాట్లాడుతుంది. అప్పుడే నర్మద ఫ్రెండ్ లోపలి నుంచి వచ్చి తను గంట సేపటి నుంచి నీ కోసం వెయిట్ చేస్తుందని చెప్తుంది. ఏంటి వల్లి బల్లి మేడం? మళ్లీ ఏం డ్రామా మోసుకొచ్చారని నర్మద అనేసరికి వల్లి నవ్వేస్తుంది.

ఏడ్చేసిన వల్లి

నువ్వు నన్ను వల్లి బల్లి అని చాలా రోజులు అవుతుంది కదా. నువ్వు అట్టా అనేసరికి ఆ ఇంట్లో ఉన్న రోజులు గుర్తుకొచ్చాయి. నాకు నీ హెల్ప్ కావాలి అని నర్మద చేతులను వల్లి పట్టుకొని ఏడ్చేస్తుంది. నేను పూర్తిగా మారిపోదామనుకుంటున్నా సెల్లాయ్. నా తప్పులన్నింటికీ క్షమాపణ అడుగుదామనుకుంటున్నా. నన్ను క్షమించేయ్ సెల్లాయ్ అని వల్లి అడుగుతుంది.

నర్మద షాక్

పాత డ్రామానా? కొత్తగా ట్రై చేయ్ అక్కాయ్. నక్క కూడా పెంపుడు కుక్కలా మారుదామనుకుంటుంది. కానీ మారదు. నువ్వు కూడా అంతే. ఇప్పుడు నేను నిన్ను నమ్మలేనని నర్మద అంటుంది. నేనేమీ ఇంటికి తీసుకెళ్లమని అడగడానికి రాలేదు. నేను మారడానికి నీ సాయం కావాలని అడగడానికి వచ్చానని బల్లక్కాయ్ అంటుంది. ఏంటి అక్కా కొత్తగా మాట్లాడుతున్నావని నర్మద షాక్ అవుతుంది.

కరిగిపోయిన నర్మద

నేను చెడు ఆలోచనల నుంచి దూరంగా ఉండాలనుకుంటున్నా. అందుకు నీ సాయం కావాలని వల్లి అడుగుతుంది. నువ్వు మారితే నాకేంటీ అని నర్మద అంటుంది. కానీ వల్లి ముఖం చూసి నర్మద నమ్మేస్తుంది. ఓ ఫ్రెండ్ లా నా మార్పులో తోడు ఉండాలి సెల్లాయ్. నన్ను నేను మార్చుకుంటా. టైమ్ పట్టినా పర్లేదు. ఆ ఇంటి పెద్ద కోడలిగా, చందు బా భార్యగా ఉండే అర్హత వచ్చిందనుకున్న రోజే నన్ను తీసుకెళ్లు. కానీ అప్పటివరకూ నన్ను దూరంగా పెట్టకు అని వల్లి ఏడ్చేస్తుంది.

వల్లి మాటలతో నర్మద కరిగిపోతుంది. అక్కడే బల్లక్కాయ్ కళ్లు తిరిగి పడిపోతుంటే నర్మద పట్టుకుంటుంది. అత్తయ్య చేసిన ఉప్మా తినమని నర్మద అడిగితే.. ఆ ఇంటి భోజనం తినే అర్హత లేదని బల్లక్కాయ్ వెళ్లిపోతుంది.

నర్మదకు తెలిసిన లంచావతారం

అప్పుడే ఓ వ్యక్తి వచ్చి ఫైల్ మీద సంతకం చేయమంటాడు. కానీ నర్మద రూల్స్ ప్రకారం సంతకం చేయడం కుదరదంటుంది. అందరి చేతులు తడిపామని ఆ వ్యక్తి చెప్తాడు. ఆ ఫైల్లో సాగర్ సంతకం ఉంటుంది. ఆ సార్ కు రూ.10 వేలు లంచం ఇచ్చానని, ఫైల్ ను బట్టి ఆ సార్ రేట్ ఉంటుందని ఆ వ్యక్తి చెప్పడంతో నర్మద షాక్ అవుతుంది. ఇలా సాగర్ లంచావతారం గురించి నర్మదకు తెలిసిపోతుంది.

మరోవైపు ఆఫీస్ లో సాగర్ లంచాల గురించి మరో ఆఫీసర్ మాట్లాడతాడు. నువ్వు నీ భార్యకు తెలియకుండా లంచాలు తీసుకుంటున్నావ్. కానీ ఈ విషయం తెలిస్తే ఎలా ఉంటుందో ఊహించు అని అతను చెప్తాడు. తన లంచాల విషయం నర్మదకు తెలిస్తే చంపేస్తుందేమోనని సాగర్ భయపడతాడు.

రూ.30 లక్షల లంచం

ఇక నేను ఫైల్స్ మీద సంతకాలు చేయను సార్. నాకు చిన్న చిన్న చేపలు కాదు. పెద్ద పెద్ద చేపలు కావాలని సాగర్ అడుగుతాడు. ఇది సొరచేప అని సాగర్ కు పెద్ద ఫైల్ ఇస్తాడు ఆఫీసర్. దీని విలువ రూ.30 లక్షలని చెప్తాడు. రిస్క్ తనదే కాబట్టి సాగర్ రూ.20 లక్షలు తీసుకుంటానంటాడు. సార్ కు మాత్రం రూ.10 లక్షలు ఇస్తానంటాడు. బయట సాగర్ ఫ్రెండ్ తనకు రూ.5 లక్షలు ఇవ్వమంటాడు. కానీ సాగర్ నో చెప్తాడు. దీంతో ఏం చేయాలో తనకు తెలుసని సాగర్ ఫ్రెండ్ కన్నింగ్ గా అనుకుంటాడు.

ఫైనాన్షియర్ నో

ఇటు ట్రావెల్ ఏజెన్సీ ఆఫీస్ దగ్గర ప్రేమ, ధీరజ్ మాట్లాడుకుంటారు. క్యాబ్ డ్రైవర్ నుంచి ఆఫీస్ ఓనర్ అయిపోతున్నావని ప్రేమ హ్యాపీగా ఫీల్ అవుతుంది. రూ.12 లక్షల ప్రాపర్టీని నీ అత్త మీద పంతంతో రూ.30 లక్షలకు పాడావని ధీరజ్ అంటాడు. అప్పుడే ధీరజ్ ఫ్రెండ్ ఫైనాన్షియర్ ను తీసుకొని వస్తాడు. ఈ ప్రాపర్టీని లీజుకు తీసుకున్నారు కాబట్టి రూ.30 లక్షలు కష్టం, రూ.15 లక్షలు అయితే ఇస్తానని ఫైనాన్షియర్ అంటాడు.

చింతామణి ఆఫర్

ధీరజ్, ప్రేమ ఏమో ఫైనాన్షియర్ ను రిక్వెస్ట్ చేస్తారు. అయినా అతను ఒప్పుకోడు. అప్పుడే డబ్బు నేనిస్తానని చింతామణి ఎంట్రీ ఇస్తుంది. మీరు మనవాళ్లే కదా రూ.30 లక్షలు కాకపోతే రూ.35 లక్షలు తీసుకోండి. నా దగ్గర డబ్బు ఉంది. మీకు అవసరం ఉంది. నాకు వడ్డీ వస్తుంది. బిజినెస్ లో ఇది మాత్రమే చూస్తా. రూ.5 వడ్డీ ఓకేనా ధీరజ్ అని చింతామణి ఆఫర్ ఇస్తుంది.

భద్రావతి ఉచ్చు

చివరకు ధీరజ్ ఓకే అంటాడు. డబ్బు తీసుకుని మీ ఇంటికి వస్తా. ఇంట్లో పెద్దవాళ్లు ఓ సంతకం పెట్టాలని చెప్పి చింతామణి వెళ్లిపోతుంది. చింతామణి వెళ్లి భద్రావతిని కలుస్తుంది. ఇదంతా ధీరజ్ ను ఇరికించడానికి భద్రావతి ఆడిన కుట్ర అని అర్థమవుతుంది. మనం వేచిన ఉచ్చులో కుందేలు పిల్ల చిక్కుకుందన్న మాట అని భద్రావతి సైకో ఆనందం పొందుతుంది.

ధీరజ్ ఇంటికి వెళ్లి అందరి సంతకాలు పెట్టుకొని డబ్బు ఇస్తానని చింతామణి అంటుంది. అదే ట్రావెల్స్ ఆఫీసులో ధీరజ్ ను పనోడిని చేయాలని భద్రావతి చెప్తుంది. అప్పుడే వల్లి కనిపిస్తే భద్రావతి పిలుస్తుంది. ఒకేసారి గంగిగోవులా మారిపోయావంటా. నిజంగానే మారిపోయావా? కొత్త డ్రామా వేశావా? నిన్ను అడ్డుపెట్టుకొని రామరాజును 5 ఏళ్లయినా జైల్లో ఉంచుదామనుకున్నా అని భద్రావతి చెప్తుంది. ఇక్కడితో ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More