Illu Illalu Pillalu November 3 Episode:ఇల్లు ఇల్లాలు పిల్లలు-రామరాజు కాలర్ పట్టుకొని భాగ్యం రచ్చ-తండ్రికి షాకిచ్చిన చందు

Illu Illalu Pillalu November 3 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే నవంబర్ 3 ఎపిసోడ్ లో వల్లిని వేదవతి అసహ్యించుకుంటూనే ఉంటుంది. అప్పుడే చందును చూసిన అంజలి పాత జ్ణాపకాలను గుర్తు చేసుకుంటుంది. పరుగెత్తుకుంటూ వచ్చిన భాగ్యం ఏమో రామరాజు కాలర్ పట్టుకొని రచ్చ చేస్తుంది.

Published on: Nov 3, 2026, 07:53:20 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Illu Illalu Pillalu November 3 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. వల్లిని క్షమించేదే లేదని చందు తెగేసి చెప్తాడు. చూడక్క నీ బతుకమ్మ నువ్వు ఆడుకో, అత్తయ్యను పలకరించకు అని బల్లక్కాయ్ కు నర్మద చెప్తుంది. ప్రేమ కూడా అదే మాట అంటుంది. ఆ తర్వాత బతుకమ్మ ఆడటం స్టార్ట్ చేస్తారు.

ఇల్లు ఇల్లాలు పిల్లలు-రామరాజు కాలర్ పట్టుకొని భాగ్యం రచ్చ-తండ్రికి షాకిచ్చిన చందు (jiohotstar)
ఇల్లు ఇల్లాలు పిల్లలు-రామరాజు కాలర్ పట్టుకొని భాగ్యం రచ్చ-తండ్రికి షాకిచ్చిన చందు (jiohotstar)

బల్లక్కాయ్ రిక్వెస్ట్

వల్లి కాలు జారి చందు మీద పడుతుంది. కానీ చందు కిందకు తోసేస్తాడు. నేను చేసింది తప్పే బావ. నా తప్పు తెలుసుకున్నా. నన్ను క్షమించండని బల్లక్కాయ్ రిక్వెస్ట్ చేస్తుంది. నువ్వు చేసింది తప్పులు కాదు మోసాలు అని వేదవతి ఫైర్ అవుతుంది. పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కినప్పుడు ఎవరికి తెలిసిందో లేదో కానీ ఇప్పుడైతే అందరికీ తెలిసేలా ఉందని అత్తను నర్మద ఊరుకోమంటుంది.

చందును చూసిన అంజలి

ఇక అందరు కలిసి బతుకమ్మలను నిమజ్జనం చేయడానికి వెళ్తారు. అక్కడ చందును చూసి అంజలి షాక్ అవుతుంది. మన పెళ్లి గురించి చెప్పేద్దాం లేదంటే ఎక్కడికైనా వెళ్లిపోయి పెళ్లి చేసుకుందామని చందును అడిగిన పాత రోజులను అంజలి గుర్తు చేసుకుంటుంది. వేరేవాళ్లను పెళ్లి చేసుకొని ఏడుస్తూ వెళ్లిన చేదు జ్ణాపకాలు తలుచుకొని అంజలి ఫీల్ అయి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

పగ తీర్చుకోవాలనా?

పగ తీర్చుకొనే అవకాశం ఇవ్వమని బతుకమ్మను కోరుకున్నావా అని బల్లక్కాయ్ పై వేదవతి మండిపడుతూనే ఉంటుంది. నేనెప్పుడూ మన కుటుంబ క్షేమమే కోరుకుంటా. అందుకే దండం పెట్టుకున్నానని వల్లి చెప్తుంది. నీకెప్పటికీ మా ఇంటి గడప తొక్కే అర్హత లేదని వేదవతి చెప్పేసరికి వల్లి పక్కకు వెళ్తుంది.

మరోవైపు భద్రావతి ఉసిగొల్పడంతో రెచ్చిపోయిన భాగ్యం పరుగులు పెట్టుకుంటూ గుడికి వెళ్తుంది. ఊరందరి ముందు వాళ్ల పరువు తీస్తాననుకుంటూ వెళ్తుంది. ఇక రామరాజు ఫ్యామిలీ అంతా ఇంటికి వెళ్దామనుకునే టైమ్ లో వల్లి వెళ్లి రామరాజు కాళ్లపై పడుతుంది.

క్షమించండి మామయ్య

నన్ను ఎక్కువగా నమ్మింది మీరే మామయ్య. నన్ను కోడలిగా కాకుండా కడుపులో పెట్టుకొని చూసుకున్నారు. అట్టాంటి మిమ్మల్ని మోసం చేశా. నేను చేసిన పాపాలకు ఆ దేవుడు కూడా క్షమించడు. మీ కాళ్లు పట్టుకొని క్షమాపణ చెప్తే నా మనసు తేలిక పడుతుంది. మీ పెద్ద కూతురే తప్పు చేసిందనుకోండి. నన్ను క్షమించి మీ అక్కున చేర్చుకోకపోయినా సరే కానీ చీదరించుకుంటూ మాత్రం చూడకండని బల్లక్కాయ్ ఏడుస్తుంది.

రామరాజు దుర్మార్గుడు

మీరు నన్ను తిడుతున్నారనే బాధ నాకు లేదు అత్తయ్య. నాకు మీరు అమ్మానాన్నలు. మామయ్య దయచేసి నన్ను క్షమించండి. నేను మారిపోయా అత్తయ్య. నన్ను నమ్మండి ప్లీజ్ అని వల్లి ఏడుస్తుంది. అప్పుడే భాగ్యం వచ్చి వల్లిని పైకి లేపుతుంది. కాళ్లు పట్టుకొని మొక్కడానికి ఈ రామరాజు ఏమైనా దేవుడా? దుర్మార్గుడు అని భాగ్యం అరుస్తుంది.

కాలర్ పట్టుకొని రచ్చ

నీకెంత ధైర్యం ఉంటే నా కూతురు జీవితం నాశనం చేసి నీ కొడుక్కి ఇంకో పెళ్లి చేద్దామనుకుంటావ్ అని రామరాజు కాలర్ పట్టుకుంటుంది భాగ్యం. భాగ్యం చేయి తీసేసిన వేదవతి ఎడాపెడా చెంపలు వాయిస్తుంది. నువ్వెంత, నీ బతుకెంత? నా మొగుడి కాలర్ పట్టుకుంటావా? అని వేదవతి చెంపదెబ్బలు కొడుతూనే ఉంటుంది.

ఇంత మంది పెద్ద మనుషులు ఉన్నారు. ఒక్కరైనా మాట్లాడరా? నా కూతురు వీళ్ల కాళ్ల మీద పడితే అసహ్యంగా చూస్తున్నారు. వాళ్ల కొడుక్కి రెండో పెళ్లి చేయాలనుకుంటున్నారు. ఇదేంటీ అని అడిగితే నా చెంపలు వాయిస్తున్నారు. చంపేస్తామని బెదిరిస్తున్నారు. నా కూతురి స్థానంలో మీ కూతుళ్లు ఉంటే ఇట్టాగే చూస్తూ ఉంటారా? అని భాగ్యం రచ్చ చేస్తుంది.

రెండో పెళ్లి

ఏం మాట్లాడుతున్నావ్ భాగ్యం? బావకు రెండో పెళ్లి చేయాలనే ఆలోచన మామయ్యకు ఉందా? ఇప్పటికీ బావ, అక్క జీవితం ఇలా అయిందని బాధపడుతున్నారు. ఆయన మనసులో బావకు రెండో పెళ్లి చేయాలనే ఆలోచనే లేదని నర్మద మండిపడుతుంది. ఈవిడ అబద్ధాలు ఆడుతూ నాటకం ఆడుతుందని ప్రేమ కూడా అంటుంది.

విడాకుల నోటీసులు

ఇది నా ఇంటి సమస్య అమ్మ. నువ్వు మధ్యలో వచ్చి రచ్చ చేయకు అమ్మ అని బల్లక్కాయ్ అంటున్నా సరే భాగ్యం మాత్రం వినదు. నీకు విడాకులు ఇవ్వడానికి నోటీసులు పంపారని భాగ్యం చెప్పేసరికి అందరి మైండ్ బ్లాక్ అవుతుంది. మేం నోటీసులు పంపించడం ఏంటీ? అని ఏం తెలియని రామరాజు అడుగుతాడు.

విడాకుల నోటీసులు పంపించమని చెప్పింది నువ్వే. ఏం తెలియనట్లు నాటకం ఆడుతున్నావ్. అందరూ నాశనం అవుతారని భాగ్యం దుమ్మెత్తి పోస్తుంది. నువ్వు, నీ తల్లి కలిసి ఊరి అందరి ముందు మా అమ్మానాన్న పరువు తీయాలనుకుంటున్నారా? మీకు మాటలతో చెప్తే సరిపోదని వల్లిని చందు కొడతాడు. వెంటనే చందును రామరాజు కొడతాడు.

చందు చెప్పిన నిజం

ఎవరిని అడిగి నోటీసులు పంపించావ్? నేను బతికున్నాను అనుకున్నావా లేదా? నువ్వు విడాకుల పత్రాలు పంపించావా? అని రామరాజు అడుగుతాడు. అవును, పంపించా. నాకు వల్లితో కలిసి ఉండటం ఇష్టం లేదు. మీకు క్షమించే గుణం ఉండొచ్చు. కానీ నాకు గొప్ప మనసు లేదు. అందుకే వల్లికి విడాకులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నానని చందు చెప్తాడు. ఇక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More