Illu Illalu Pillalu October 19 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు.. కేసు వాపస్-వల్లికి విడాకులిస్తానన్న చందు-గెంటేసిన భాగ్యం
Illu Illalu Pillalu October 19 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే అక్టోబర్ 19 ఎపిసోడ్ లో శ్రీవల్లి కేసు వాపసు తీసుకోవడంతో భాగ్యం షాక్ అవుతుంది. వల్లిని చెంపలపై కొడుతుంది. వల్లికి విడాకులు ఇస్తానని చందు బాంబ్ పేలుస్తాడు. ఆ బల్లక్కాయ్ ను భాగ్యం ఇంటి నుంచి గెంటేస్తుంది.
Illu Illalu Pillalu October 19 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. మా అమ్మడిని యువరాణిలా అత్తారింటికి తీసుకుపోతే కేసు వాపసు తీసుకుంటామని ఎస్ఐకి భాగ్యం చెప్తుంది. ఇంతకుముందైతే అయ్యో పాపం అని జాలి పడి ఉండేదాన్ని. కానీ మమ్మల్ని పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చి పరువు తీశాక ఆలోచించేదే లేదని వేదవతి సీరియస్ అవుతుంది.

కోర్టులోనే తేల్చుకుందామని
అయితే కోర్టులోనే తేల్చుకుంటామని భాగ్యం. అవును కోర్టులోనేె తేల్చుకుందామని ధీరజ్ అంటాడు. మీ మోసాల ఎవిడెన్స్ అన్నీ జడ్జీ ముందు పెట్టి అక్కడే తేల్చుకుందామని ధీరజ్ కౌంటర్ ఇస్తాడు. పోనీ అని ఒక ఛాన్స్ ఇచ్చాం. కానీ బుద్ధి చెప్పక తప్పదని అర్థమైందని సాగర్ కూడా అంటాడు.
కేసు వాపసు
అప్పుడే అక్కర్లేదని బయటి నుంచి శ్రీవల్లి వస్తుంది. కోర్టులకు గీర్టులకు వెళ్లాల్సిన అవసరం లేదు. అసలు ఈ కేసే అక్కర్లేదు. ఎస్ఐ గారు నేను ఈ కేసును వాపసు తీసుకుంటున్నానని బల్లక్కాయ్ అనగానే భాగ్యం, ఇడ్లీ బాబాయి మైండ్ బ్లాక్ అవుతుంది. అమ్మడూ ఏమైందే? ఈ నర్మద ఏమైనా నిన్ను బెదిరించిందా? అని భాగ్యం అడుగుతుంది.
తప్పంతా నాదే
నన్ను ఎవరూ బెదిరించలేదు. నాకు నేనుగానే నిర్ణయం తీసుకున్నా. ఎస్ఐ గారు మా అత్తమామలు, మా ఆయన నన్ను టార్చర్ పెట్టలేదు. మా ఆయన బంగారం. మా అత్తామామ దేవుళ్లు. వాళ్లది ఏ తప్పూ లేదు. తప్పంతా నాదేనని వల్లి అంటుంది. నీ కాపురం నిలబెడదామనుకుంటే ఏం చేస్తున్నావని వల్లిని భాగ్యం అడుగుతుంది. నువ్వు చెప్పినట్లు మా అత్తామామ, భర్తను జైలుకు పంపిస్తే నా కాపురాన్ని తగలబెట్టుకున్నదాన్ని అవుతానని వల్లి చెప్తుంది.
అమ్మ ఇప్పటికీ నువ్వు నా జీవితానికి చేసింది చాలు. నన్ను వదిలేయ్. నేను ఇంతదూరం వచ్చింది మా ఆయన కోసం. ఆ ఇంట్లో కోడలి స్థానం కోసం. అందరూ కోర్టుకు వెళ్లడానికి రెడీ అయ్యారు కానీ నన్ను ఇంటికి తీసుకెళ్తామని అంటున్నారా? అసలు నా బతుకే దిక్కుమొక్కు లేకుండా అయిపోయేలా ఉంది. నేను ఈ కేసు వాపసు తీసుకుంటా. మా అత్తామామలు, మా ఆయనను వదిలేయమని ఎస్ఐని బల్లక్కాయ్ వేడుకుంటుంది.
వల్లిని కొట్టిన భాగ్యం
దెబ్బలు కొట్టారని, బంగారం గురించి టార్చర్ పెడుతున్నారని కేసు పెట్టావ్. ఇప్పుడేమో వాళ్లు దేవుళ్లని అంటున్నావని ఎస్ఐ గట్టిగా అడుగుతుంది. అవన్నీ అబద్ధాలు. మా అమ్మానాన్న నాతో చెప్పించారని భాగ్యం, ఇడ్లీ బాబాయిని బల్లక్కాయ్ ఇరికిస్తుంది. ఫస్ట్ మిమ్మల్ని అరెస్టు చేయాలని ఎస్ఐ అనడంతోనే వల్లిని భాగ్యం చెంపలపై కొడుతుంది.
పట్టించుకోని రామరాజు
ఈ విధంగా నా కూతురి కాపురాన్ని నిలబెట్టాలనుకున్నా. క్షమించమ్మా అని భాగ్యం అక్కడి నుంచి వెళ్లిపోతుంది. కేసు వెనక్కి తీసుకుంటున్నట్లు వల్లి సంతకం పెడుతుంది. రామరాజుకు ఎస్ఐ సారీ చెప్తుంది. తిరిగి మన ఇంట్లోకి రావడానికే ఇదంతా చేశా. నన్ను క్షమించి మన ఇంటికి తీసుకెళ్లండని రామరాజు, వేదవతి కాళ్లపై వల్లి పడుతుంది. కానీ వాళ్లు పట్టించుకోకుండా వెళ్లిపోతారు.
నీ మీద ప్రేమతోనే ఇదంతా చేశా బా. నువ్వయినా ఇంటికి తీసుకెళ్లు అని చందును వల్లి రిక్వెస్ట్ చేస్తుంది. కానీ చందు వదిలించుకొని వెళ్లిపోతాడు. కేసు వాపస్ తీసుకొని మంచి పని చేశావ్. మంచి మాటలతో ఇంట్లోకి రావడానికి ప్రయత్నించమని చెప్పి సుక్కు వెళ్లిపోతుంది.
రామరాజు బాధ
ఇంటికి వచ్చిన తండ్రిని హత్తుకొని అమూల్య ఏడుస్తుంది. భాగ్యం వేసిన అబద్ధపు నిందల గురించి ఆలోచిస్తూ రామరాజు ఫీల్ అవుతుంటాడు. మనసులో నుంచి బాధను తీసేయండి నాన్న అని చందు చెప్తాడు. నా పెద్ద కోడలిని ఎంతో నమ్మా. అలాంటిది ఇంత మోసం చేసిందంటే, మన మీద కేసు పెట్టిందంటే నమ్మలేకపోతున్నానని రామరాజు బాధపడతాడు.
వల్లికి విడాకులిస్తా
వల్లికి విడాకులు ఇచ్చేస్తానని చందు బాంబ్ పేలుస్తాడు. బావ ఆవేశంలో నిర్ణయం తీసుకోకండని నర్మద చెప్తుంది. ఆలోచించే నిర్ణయం తీసుకున్నా. మళ్లీ దాన్ని తీసుకొచ్చి నెత్తిమీద పెడతానంటే ఒప్పుకోనని చందు అంటాడు. మా పెద్దత్తనే వల్లితో ఇలా చేయించిందని విశ్వ చెప్పినా చందు వినడు. మళ్లీ ఇంట్లో తెచ్చి పెట్టుకుంటే ఎవరి జీవితాన్నో తగలపెడుతుందని చందు కోప్పడతాడు.
మీరు ఏమైనా ఆలోచించండి కానీ ఆ వల్లి నా ఇంట్లోకి రానివ్వను అని వేదవతి కూడా గట్టిగా చెప్తుంది. అప్పుడే ధీరజ్ కు ఫ్రెండ్ కాల్ చేసి ట్రావెల్ ఆఫీస్ వేలం గురించి చెప్తాడు. అదే విషయం ధీరజ్ చెప్తే ఈ వేలం పాటలో పాల్గొనమని రామరాజు చెప్తాడు. అందరూ అదే మాట అంటారు.
వల్లిని గెంటేసిన భాగ్యం
మరోవైపు ఏడుస్తూ కూర్చున్న వల్లిని భాగ్యం ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మంటుంది. పో బయటకు అని గెంటేస్తుంది. నాకు నువ్వు తప్పా ఎవరున్నారు అమ్మ. ఎక్కడికి పోవాలని వల్లి ఏడుస్తుంది. వెళ్లి మీ అత్తారింటి ముందు కూర్చో. మారిపోయాను బాబూ అని అడుక్కో అని భాగ్యం ఎగతాళిగా మాట్లాడుతుంది.
నీ కడుపులో ఉన్న విషాన్ని నాకు ఎక్కించావ్. నీ అత్యాశలన్నీ నా మీద రుద్దావు. అబద్ధాలు ఆడి పెళ్లి చేశావ్. నా కాపురం నాశనం అవడానికి కారణం నువ్వే అమ్మా అని బల్లక్కాయ్ కుండ బద్ధలు కొడుతుంది. ఆ మాటలు విని భాగ్యానికి కోపం వస్తుంది. వల్లిని చెంపపై కొడుతుంది.
నువ్వు ఏది చెప్తే అది గుడ్డిగా చేశా. కానీ నీలా మారిపోతున్నానని గమనించలేకపోయా. నేను పాపాలు చేశా కాబట్టి శిక్ష అనుభవిస్తున్నానని బల్లక్కాయ్ ఏడ్చేస్తుంది. ఇక్కడతో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


