Illu Illalu Pillalu October 30 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు-ఇదీ ట్విస్టంటే-చందు మాజీ లవర్ అంజలి ఎంట్రీ-వల్లి వేడుకోలు!
Illu Illalu Pillalu October 30 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే అక్టోబర్ 30 ఎపిసోడ్ లో అదిరే ట్విస్ట్ చోటు చేసుకుంది. చందు మాజీ లవర్ అంజలి కథలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమెను ధీరజ్ చూస్తాడు. మరోవైపు రామరాజును ఊరందరి ముందు అవమానించేందుకు భాగ్యాన్ని భద్రావతి ఉసిగొల్పుతుంది.
Illu Illalu Pillalu October 30 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. బతుకమ్మను ఎత్తుకొని అంత దూరం నడవలేవ్ కానీ కార్లో తీసుకెళ్తానని ప్రేమతో ధీరజ్ చెప్తాడు. నాయనా ధీరజ్.. భార్య మీద ప్రేమ ఉండొచ్చు కానీ నడిస్తే కందిపోతుందేమో అన్నంత మాత్రం ఉండకూడదు. మేం మనుషులం కాదా? మేం నడవట్లేదా? అని నర్మద సెటైర్ వేస్తుంది.

ధీరజ్ ను ఇరికించిన ప్రేమ
అసలే ఆమె శత్రుదేశపు యువరాణి కదా వదిన. భూమి మీద నడవడం ఆమె బాదం కాయ్ భద్రావతి అత్త, నాన్న బిజ్జాలదేవ చూశారనుకో మా తింగరి యువరాణిని వాకింగ్ చేయిస్తావా అని కత్తి తీసుకొని యుద్ధానికి వస్తారని ప్రేమను ధీరజ్ ఎగతాళి చేస్తాడు. అమ్మను కార్లో తీసుకెళ్తానని అనకుండా, భార్యను తీసుకెళ్తానని అంటే మీరు ఫీల్ అవుతారు కదా. అందుకే మా వాళ్లని అని కవర్ చేశాడని వేదవతి ముందు ధీరజ్ ను ప్రేమ ఇరికిస్తుంది.
బతుకమ్మ సందడి
దీంతో వేదవతి ఏడుస్తుంది. నువ్వు మారిపోయావ్ ధీరజ్ అని వేదవతి ఫీల్ అవుతుంది. నేను అమాయకురాలినే కానీ బుర్ర లేని దాన్ని కాదని వేదవతి అంటుంది. పెద్దోడు చందు కూడా బయటకు వస్తాడు. బతుకమ్మ పండగను ధూమ్ ధామ్ గా చేసుకోవాలని అంటాడు. ఇదంతా దూరం నుంచి భద్రావతి, సేనాపతి చూస్తారు.
భద్రావతి గర్వం
ఊరందరి ముందు పరువు పోగొట్టుకోవడానికి సంబరంగా వెళ్తున్నారక్కా అని భద్రావతితో సేనాపతి అంటాడు. ఇకపై ఎవరైనా శత్రువుపై పగ తీర్చుకోవాలనుకుంటే నేను తీర్చుకున్నట్లే తీర్చుకోవాలని గర్వంగా చెప్పుకుంటార్రా సేనా అని భద్రావతి గర్వంతో ఊగిపోతుంది. నువ్వు ఎలా చేస్తావో నాకు తెలీదు కానీ ఆ రామరాజు ఇంట్లోని ఉండి కుమిలిపోవాలి అక్క అని సేనాపతి చెప్తాడు.
భాగ్యాన్ని ఆ రామరాజు మీదకు, ఆ కుటుంబం మీదకు ఉసిగొల్పా. విడాకుల విషయం మాత్రమే చెప్తే ఆ భాగ్యం పరువు తీయదు. ఇంకేదో ఎగేసి చెప్పాలని భద్రావతి ఆలోచిస్తుంది. మంచి ఆలోచన వచ్చిందిరా సేనా అని భద్రావతి సైకోలా చెప్తుంది.
అంజలి ఎంట్రీ
మరోవైపు బతుకమ్మ తీసుకొని వచ్చిన వల్లి తన అత్తారింటి వాళ్ల కోసం ఎదురు చూస్తుంది. పండగ అంటే రామరాజు కుటుంబంలా చేసుకోవాలని ఊరంతా అనుకునేవాళ్లు. ఇదంతా నా కర్మే. నేనే చేసుకున్నానని వల్లి కన్నీళ్లు పెట్టుకుంటుంది. అప్పుడే సీరియల్ లోకి అంజలి అనే అమ్మాయి ఎంట్రీ ఇస్తుంది. ఆమె వీరమాచినేని దశరథ రామయ్య కూతురు అని ఇంట్రడక్షన్ ఇస్తారు.
చందు మాజీ లవర్
అంజలి పెళ్లి ఘనంగా చేశారు. కానీ, ఆ దిష్టి తగిలే అత్తారింటి నుంచి వచ్చేసి ఇంట్లో ఉంటుంది. ఆ అబ్బాయి మంచోడు కాదంటా. అనుమాన పక్షి అంటా. ఇక్కడే ఉండి ఆమె జాబ్ చేసుకుంటుందని అంజలి గురించి అక్కడున్న ఆడవాళ్లు మాట్లాడుకుంటారు. నా భర్త మరో పెళ్లి చేసుకున్నాడు. నా పాత ప్రేమను గుర్తు చేయకు. చందును కానీ, ఆ కుటుంబాన్ని కానీ నా కంట పడకుండా చూడు తల్లి అని అంజలి బతుకమ్మను వేడుకుంటుంది. అంటే చందు మాజీ ప్రేయసి అంజలి అని తెలుస్తోంది.
చందు ఫైర్
బతుకమ్మను ఎత్తుకొని నడుస్తున్న ప్రేమను చూసి పాటలు పాడుతాడు ధీరజ్. ఆమె చెమటను చూసి ధీరజ్ బాధపడుతూ ఊపిరితో గాలి ఊపుతాడు. అడ్డం ఎవరూ రాకుండా ధీరజ్ జరగండి, జరగండని హడావుడి చేస్తాడు. ఇక తన అత్తారింటి వాళ్లను చూసి బల్లక్కాయ్ సంతోషంగా ఫీల్ అవుతుంది. శుభమా అని బతుకమ్మను ఎత్తుకొస్తుంటే దిష్టిబొమ్మలా, అపశకునపు పక్షిలా ఇక్కడకు కూడా వచ్చావేంటీ అని చందు ఫైర్ అవుతాడు.
వేదవతి సీరియస్
తనతో మనకెందుకు కానీ నర్మద, ప్రేమను బతుకమ్మ దింపమని వేదవతి చెప్తుంది. వల్లి వెళ్లి వాళ్ల బతుకమ్మల పక్కనే తన బతుకమ్మ పెట్టాలనుకుంటుంది. ఈ మనిషికి ఒకసారి చెప్తే అర్థం కాదేమో. మా వెంట రాకు, కళ్ల ముందు కనిపించకు మొర్రో అంటే నీకు అర్థం కాదా? చెప్పేది వినిపించడం లేదా అని వల్లిపై వేదవతి సీరియస్ అవుతుంది. మదం తలకెక్కింది కదా బుద్ధితో సహా ఏం పనిచేయదని చందు కూడా అంటాడు.
మీరు ఎన్ని మాటలు అన్నా పడతా. నా తప్పులు ఉన్నాయి. కానీ అందరూ చూస్తున్నారు కదా బతుకమ్మ పెట్టనివ్వండని వల్లి వేడుకుంటుంది. ఊర్లో అందరూ చూస్తున్నారు వదిలేయండి అత్తయ్య అని నర్మద, ప్రేమ చెప్తారు. వాళ్లను అక్కడి నుంచి చందు తీసుకెళ్తాడు.
అంజలిని చూసిన ధీరజ్
గుడిలో ధీరజ్, తిరుపతి పులిహోర ప్రసాదం తింటూ ఎంజాయ్ చేస్తారు. అప్పుడే అంజలిని ధీరజ్ చూస్తాడు. అంజలి కూడా ధీరజ్ ను చూస్తుంది. ధీరజ్ పిలుస్తుంటే కావాలనే అంజలి దూరంగా వెళ్తుంది. కానీ ధీరజ్ పరుగెత్తుకుంటూ వెళ్లి అంజలితో మాట్లాడతాడు. మీరు అంజలినే కదా అని ధీరజ్ అడిగితే ఆమె సైలెంట్ గా ఉండిపోతుంది. ధీరజ్ పొరపాటు పడ్డానని అనుకుంటాడు. ఇక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


